Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అర్ధరాత్రి ఆలయంలోకి దొంగలు.. ఏం చోరి చేయడానికి వచ్చారో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే..

అర్థరాత్రి సమయంలో ఆలయ కేశ ఖండశాలలో శబ్దాలు వచ్చాయి. వీటిని గమనించిన వాచ్మెన్ వెంటనే 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి కేశ ఖండన శాలలోని లాకర్ల వద్ద దొంగలు నలుగురు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన దొంగలు అప్రమత్తమై పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తాడు సహాయంతో కేశఖండనశాల పైకప్పు ఎక్కారు.

Andhra Pradesh: అర్ధరాత్రి ఆలయంలోకి దొంగలు.. ఏం చోరి చేయడానికి వచ్చారో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే..
Sri Venkateswara Swamy
Follow us
T Nagaraju

| Edited By: Surya Kala

Updated on: Aug 05, 2023 | 8:22 AM

తెనాలిలోని వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయం. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వస్తుంటారు. అంతేకాదు తలనీలాలు సమర్పిస్తుంటారు. ఈ తలనీలాలను కొనుగోలు చేసిన వ్యక్తులు వాటిని ఆలయంలోని లాకర్లలో భద్రపరుచుకుంటారు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే రాత్రి నలుగురు దొంగలు ఆలయంలోకి వచ్చి చేసిన పని మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. ఏం జరిగిందంటే.. అర్థరాత్రి సమయంలో ఆలయ కేశ ఖండశాలలో శబ్దాలు వచ్చాయి. వీటిని గమనించిన వాచ్మెన్ వెంటనే 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి కేశ ఖండన శాలలోని లాకర్ల వద్ద దొంగలు నలుగురు ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులను గమనించిన దొంగలు అప్రమత్తమై పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తాడు సహాయంతో కేశఖండనశాల పైకప్పు ఎక్కారు. దొంగలను పట్టుకునేందుకు కానిస్టేబుల్ రమేష్ కూడా పైకి ఎక్కాడు. అయితే నవీన్ నీ పట్టుకొనే ప్రయత్నంలో దొంగ నవీన్ తోయటంతో కానిస్టేబుల్ రమేష్ 12అడుగుల పై నుంచి క్రింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. దుండగల్లో ఇరువురు పరారీ గాక మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగులు జీవన్ తేజ్, సాయికుమార్, నవీన్ కాగ మరొకరు పేరు తెలియాల్సి ఉంది. గాయపడిన కానిస్టేబుల్ రమేష్ ని గుంటూరు లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి వైద్య సేవ లు అందిస్తున్నారు.

ఈ చోరి యత్నం తెనాలిలో కలకలం రేపింది. విలువైన కేశాలను దొంగలించే ప్రయత్నం చేయడం తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్య పోతున్నారు. దొంగల్లో ఒకరు ఆలయంలో కూల్ డ్రింక్ షాపు నిర్వాహాకుడి కుమారుడిగా గుర్తించారు. మొత్తం మీద ఈ ఘటన పట్టణంలో అలజడి రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..