AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దివిసీమలో పెరుగుతున్న పాము కాటు కేసులు.. వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..

వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపధ్యంలో కృష్ణజిల్లా వ్యాప్తంగా పాముకాట్లు సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా వర్షాలు అధికంగా కురవటంతో పాటు ఖరీఫ్ సీజన్ నేపధ్యంలో రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలం పనులు కొనసాగుతున్నారు. దీంతో అధికంగా పాముకాట్ల బారిన పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా జూలై నెలలో 150 మంది పాముకాటుకు గురయ్యారు. చల్లపల్లి మండలం పరిధిలో నాలుగు రోజుల్లో 40 మంది పాముకాట్లు గురై ఆస్పత్రి పాలయ్యారు.

Andhra Pradesh: దివిసీమలో పెరుగుతున్న పాము కాటు కేసులు.. వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..
Snake Bite
M Sivakumar
| Edited By: |

Updated on: Jul 31, 2023 | 9:08 AM

Share

కృష్ణా జిల్లాలోని దివిసీమలో పాముకాటు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దివిసీమను వరదలు చుట్టుముట్టడంతో ఎక్కడెక్కడి నుంచో కొట్టుకు వచ్చిన తాచుపాములు పలువురుని కాటేస్తుండగా, వారంతా ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. భారీ వర్షాలకు, వరదలకు నీటిలో  కొట్టుకువస్తున్నాయి పాములు .  దివిసీమ ప్రాంతంలోని వరద నీటి పోటెత్తుండాడంతో పాములు పుట్టాలనుంచి చెట్టుపొదల నుంచి  బయటకు వస్తున్నాయి. అప్పటికే అయోమయ స్థితిలో ఉన్న పాములు తమకు తాకిన వారిని కాటేస్తున్నాయి..

వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపధ్యంలో కృష్ణజిల్లా వ్యాప్తంగా పాముకాట్లు సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా వర్షాలు అధికంగా కురవటంతో పాటు ఖరీఫ్ సీజన్ నేపధ్యంలో రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలం పనులు కొనసాగుతున్నారు. దీంతో అధికంగా పాముకాట్ల బారిన పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా జూలై నెలలో 150 మంది పాముకాటుకు గురయ్యారు. చల్లపల్లి మండలం పరిధిలో నాలుగు రోజుల్లో 40 మంది పాముకాట్లు గురై ఆస్పత్రి పాలయ్యారు. వీరందరిని అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . వీరిలో పలువురు మరణం అంచుకి చేరుకున్నంత పనైంది. మరి కొందరిని అబ్జర్వేషన్ లో ఉంచామని వైద్యులు వెల్లడించారు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పీహెచ్సిలో యాంటీ స్నేక్ వీనమ్ అందుబాటులో ఉంచటంతో పాముకాటు బాధితులకు వ్యాక్సిన్ రక్షగా నిలుస్తుంది. పాముకాటు వేసిన వెంటనే అందుబాదులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే వెంటనే వైద్యుల పర్యవేక్షణలో యాంటీ స్నేక్ వీనమ్ ఇవ్వడం ద్వారా రైతులు, కూలీలు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతున్నారు..

ఇవి కూడా చదవండి

వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు తమ పొలాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ పాముకాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అజాగ్రత్తగా ఉంటే పాముకాట్ల బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. పాము కరిచిన వెంటనే నాటు వైద్యుల వద్దకు వెళ్లకుండా మెరుగైన చికిత్స అందించే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందితే ప్రాణాయం మంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటున్నారు. పాముకాటు వేసిన అరగంటలోనే వైద్య శాలకు వెళ్తే ప్రాణాలు రక్షించుకోగలరని వైద్యులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..