Peepal Tree: రావి చెట్టు కొమ్మ విరిచినా శిక్ష తప్పదట.. రోడ్డుమధ్యలో ఉన్నా తప్పుకుని తిరిగే జనం.. రీజన్ ఏమిటంటే

ఒక రావి చెట్టు జీవితకాలం సుమారు 1500ల సంవత్సరాలని చెబుతారు. అయితే శ్రీలంకలో అతి పురాతనమైన అశ్వత్థ వృక్షం ఉంది. దీనిపేరు "జయ శ్రీ మహా భోది". ఈ వృక్షం వయస్సు సుమారు 2,250ల సంవత్సరాల పైగానే ఉందట. ఇంకా ఇలా వందల సంవత్సరాల నాటి రావి చెట్లు బలమైన ఊడలు దిగి చాలా గ్రామాల్లోనూ, అడవి ప్రాంతంలో, ఆలయాల్లో కనిపిస్తుంటాయి.

Peepal Tree:  రావి చెట్టు కొమ్మ విరిచినా శిక్ష తప్పదట.. రోడ్డుమధ్యలో ఉన్నా తప్పుకుని తిరిగే జనం.. రీజన్ ఏమిటంటే
Tree On The Road
Follow us
B Ravi Kumar

| Edited By: Surya Kala

Updated on: Jul 25, 2023 | 1:07 PM

మొక్కే కదా అని – పీకేద్ధామను కున్నాడు. రోడ్డుకు అడ్డంగా ఉందని తొలగించే ప్రయత్నం చేశారు. కాని అలా చేసిన ఒక వ్యక్తి సడెన్ గా మ్రృత్యునాత పడ్డాడట. మరికొద్ది రోజులు తర్వాత వాహనంపై వెలుతుంటే కొమ్మలు తగిలి ఇబ్బంది పడాల్సి వస్తుందని మరొకరు కొమ్మ విరిచే ప్రయత్నం చేశారట అంతే అతని చేతికి బలమైన దెబ్బ తగిలి లబో దిబో మన్నాడట. దీంతో చెట్టు రోడ్డు మధ్యలో ఉన్నా కొమ్మలు వ్రేలాడి ఇబ్బంది పెట్టినా భక్తి తోనూ, భయంతోనూ పక్కనుంచి వెళ్లటం తప్ప మరేం చేయటం లేదు ఆ గ్రామస్తులు..ఇంతకీ ఆ చెట్టులో ఏ ముంది, ఏ శక్తి ఊరి వారితో పూజలందుకుంటుంది.

వృక్షాల్లో నేను అశ్వత్థ వృక్షాన్ని అని శ్రీ క్రృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఇక గౌతముడికి భోది వ్రృక్షం కిందనే జ్ఞానోదయం అయింది. ఇలా హిందువులు, బౌద్ధులు, జైనులకు రావి చెట్టు అత్యంత పవిత్రమైనది గా భావిస్తుంటారు, పూజిస్తుంటారు. చాలా హిందూ దేవాలయాల్లో రావి, వేప చెట్లు ఉంటాయి. కొన్ని చోట్ల ఇవి రెండూ కలిసి పెరుగుతాయి. ఇలాంటి చెట్లను భక్తులు ఆరాధిస్తారు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వసించే వారు చాలా మంది ఉన్నారు. సాక్షాత్తు రావి చెట్టును విష్ణు స్వరూపంగాను భావిస్తారు. ఈ చెట్టు నుంచి ఆక్సిజన్ అధికంగా వస్తుందని, అందువల్ల ఇది చాలా మంది వృక్షశాస్త్ర వేత్తలు చెబుతారు. ఈ చెట్టు కాయలు, ఆకులు, బెరడును శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన చికిత్సతో పాటు ఆయుర్వేదంలో పలు విధాలుగా ఉపయోగిస్తారు. అందుకే భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, యజ్ఞ యాగాదులలో ఈ అశ్వత్థ లేదా రావి వృక్షానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది.

గోదావరి గట్టు మధ్యలో రావి చెట్టు

ఇవి కూడా చదవండి

సాధారణంగా ఒక రావి చెట్టు జీవితకాలం సుమారు 1500ల సంవత్సరాలని చెబుతారు. అయితే శ్రీలంకలో అతి పురాతనమైన అశ్వత్థ వృక్షం ఉంది. దీనిపేరు “జయ శ్రీ మహా భోది”. ఈ వృక్షం వయస్సు సుమారు 2,250ల సంవత్సరాల పైగానే ఉందట. ఇంకా ఇలా వందల సంవత్సరాల నాటి రావి చెట్లు బలమైన ఊడలు దిగి చాలా గ్రామాల్లోనూ, అడవి ప్రాంతంలో, ఆలయాల్లో కనిపిస్తుంటాయి. అలాంటి ఒక రావి చెట్టు తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఉమ్మడి వారి పాలెంలో ఉంది. అయితే ఈ చెట్టు గోదావరి గట్టుపై మొలిచింది. పూర్వం గట్టు పటిష్టం చేసే క్రమంలో రావి చెట్టును తొలగించేందుకు ప్రయత్నించగా అలా ప్రయత్నించిన వ్యక్తి గట్టు పైనుంచి పడి చనిపోయాడని స్ధానికులు చెబుతున్నారు. ఇలా చెట్టు తొలగించాలని ప్రయత్నించినా కొమ్మలు, రెబ్బలు విరిచేయాలని చూసినా ఏదో ఒక అపశకునం జరుగుతుండటంతో స్థానికులు ఆ చెట్టును దైవంగా భావిస్తున్నారు. అంతే కాదు ఆ రావి చెట్టుకు ఒక విశేషం ఉంది. సాధారణంగా చెట్టుకు ఒక మొదలు ఉంటుంది అది బలంగా ఎదిగిన తరువాత కొమ్మలు వస్తాయి. కాని ఈ చెట్టు మొదట్లోనే ఐదు మొదళ్లు తో పైకి ఎదిగింది. దీంతో వీటిని “పంచభూతాలు”గాను, పవిత్రమైన చెట్టుగా భావిస్తున్నారు. ఇలాంటి అశ్వత్థ వ్రృక్షం కాశీలో మినహా మరెక్కడా లేదని ఉమ్మడి వారి పాలెం గ్రామస్తుడు శ్రీనివాసరావు టివి9 తెలుగుకు చెప్పారు. వృక్షానికి పూజలు చేయటమే కాదు లంకల్లో తాము పండించిన తొలి పంటను చెట్టుకు నైవేద్యంగాను పెడతారు.

సత్తెమ్మ తల్లి కొలువైన ప్రాంతం

ఉమ్మడి వారి పాలెం నుంచి గోదావరి గట్టు వెంట సిద్ధాంతం చేరుకోవచ్చు. గట్టు దిగువున గోదావరి ప్రవహిస్తుంటే మరో పక్కన గ్రామం ఉంటుంది. ఈ గ్రామస్తులంతా భక్తి శ్రద్ధలతో సత్తెమ్మ తల్లిని దేవతగా కొలుస్తారు. అశ్వత్థ వృక్షం సమీపంలో గోదావరి గట్టుకు ఆనుకుని సత్తెమ్మ తల్లి ఆలయం ఉంటుంది. పూర్వం లంకలో పండిన పంటను దొంగలు దోచుకు వెళ్లటానికి ప్రయత్నిస్తే వెంటనే దేవత పాము రూపంలో వారి వెంట పడి రైతుల పంటను రక్షించేదని భక్తులు విశ్వాసం. ఇలా అశ్వత్ధ వృక్షం, సత్తెమ్మ తల్లి ఆలయం రెండూ గోదావరి గట్టున పూజలు అందుకుంటున్నాయి. గ్రామస్తుల నమ్మకం వెనుక వాస్తవాలు ఎలాఉన్నా ఐదు మొదళ్లతో ఆ రావిచెట్టు ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..