AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulasi Plant: తులసికి సంబంధించి ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం.. మిమ్మల్ని దరిద్రులను చేస్తాయి

సనాతన ధర్మంలో సరైన నియమాల ప్రకారం తులసి మొక్కను నాటడం మంచిది. మొక్కలు నాటేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. తులసి మొక్క శ్రేయస్సుకు చిహ్నం. ఏయే ఇళ్లలో తులసి మొక్కను ఉంచకూడదో తెలుసుకుందాం.

Tulasi Plant: తులసికి సంబంధించి ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం.. మిమ్మల్ని దరిద్రులను చేస్తాయి
Surya Kala
|

Updated on: Jul 25, 2023 | 10:45 AM

Share

హిందూ మతంలో తులసి మొక్కను పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్క ఉన్న ఇంటిలో లక్ష్మీదేవి నివాసం  ఉంటుందని నమ్మకం. అంతే కాదు తులసి మహావిష్ణువుకు కూడా ప్రీతికరమైనది. నైవేద్యంలో తులసి ఆకులను వేసి సమర్పించిందే శ్రీ హరి ఆ నైవేద్యాన్ని స్వీకరించడని నమ్ముతారు. సనాతన ధర్మంలో సరైన నియమాల ప్రకారం తులసి మొక్కను నాటడం మంచిది. మొక్కలు నాటేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. తులసి మొక్క శ్రేయస్సుకు చిహ్నం. ఏయే ఇళ్లలో తులసి మొక్కను ఉంచకూడదో తెలుసుకుందాం.

మందు, మాసం వినియోగించే ఇంట్లో.. 

మాంసం, మాసం సేవించే ఇంటిలో తులసి మొక్కను నాటకూడదు. అలాంటి ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ ఇంటి సభ్యులు లక్ష్మీ దేవి, విష్ణువు ఆగ్రహానికి గురికావాల్సిందే. అంతేకాదు మద్యం, మాసం తిన్నవారు తులసి మొక్కను తాకరాదు.

ఇవి కూడా చదవండి

ఏ దిశలో తులసి మొక్క ఉండాలంటే..

తులసి మొక్కను పెంచుకోవడానికి ఉత్తర , ఈశాన్య దిశలు ఉత్తమం. తప్పు దిశలో నాటిన తులసి మొక్క ఇంట్లో అశాంతిని తెస్తుంది. ఇంట్లో తులసి మొక్కను తెలిసి తెలియక దక్షిణ దిశలో నటరాదు.

 స్త్రీలు అవమానానికి గురయ్యే ఇంట్లో తులసి 

స్త్రీలను అవమానించే ఇంటిలో తులసి మొక్కను పెంచరాదు. స్త్రీని అవమానించడం అంటే లక్ష్మీదేవిని అవమానించినట్లే. మహిళలంటే చిన్న చూపు ఉన్న ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ వ్యక్తికి పూజ చేసినా  సరైన ఫలితం దక్కదు.

ఇంట్లో తులసి మొక్కను నాటడానికి నియమాలు

స్నానం చేయకుండా లేదా బహిష్టు సమయంలో తులసి మొక్కను తాకవద్దు. ఇలా చేయడం వల్ల మొక్క ఎండిపోవచ్చు. విష్ణువుకి కూడా కోపం వస్తుందని నమ్మకం

ఆదివారం, ఏకాదశి రోజున తులసి మొక్కను నీరు పోయకండి లేదా తాకవద్దు.

తులసి మొక్కను వంటగది,  బాత్రూమ్ దగ్గర ఉంచవద్దు.

తులసి మొక్క దగ్గర ముళ్ల మొక్క ఉండకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్