- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: what did chanakya tell the world over morality in telugu
Chanakya Niti: జీవితంలో సమస్యలు ఎదురైతే చాణక్యుడు చెప్పిన ఈ విధానాలు పాటించి చూడండి..
ఆచార్య చాణక్యుడు తక్షశిలలో మంచి అధ్యాపకుడు మాత్రమే కాదు.. మంచి రాజనీతికలిగిన వ్యక్తి.. తత్వవేత్త కూడా.. చాణుక్యుడు తన తెలివి తేటలతో ఒక సామాన్యుల బాలుడైన చంద్ర గుప్తుడిని ఒక సామ్రాజ్యానికి రాజుని చేశాడు. అంతేకాదు.. తన జీవితంలో ఎదురైన అనుభాలను అనేక పుస్తకాలుగా మలచి నేటి మానవులకు అందించాడు. వాటిల్లో ఒకటి నీతి శాస్త్రం.. ఇది చాణక్య నీతిగా ఖ్యాతిగాంచింది. ఇందులో మనిషి జీవితంలో విజయం సాధించాలంటే ఎటువంటి లక్షణాలు కలిగివుండాలో ఆచార్య చాణక్య తెలియజేశారు
Updated on: Jul 22, 2023 | 7:22 PM


ప్రశాంతమైన ప్రవర్తన కలిగిన స్త్రీ తన కుటుంబంలో సానుకూల మార్పులను తెస్తుంది. ఆమె ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎటువంటి పరిస్థితి ఎదురైనా తన ప్రశాంత చిత్తంతో దానిని ఎదుర్కొంటుంది. మితిమీరిన కోపం హానికరం కాబట్టి అనవసరమైన కోపాన్ని నివారించడం ప్రయోజనకరం.

సహనం అనే గుణం ఉన్న స్త్రీ తన భర్తకు ఎదురైన కష్టాల్లో, నష్టాల్లో అతనికి అండగా నిలుస్తుంది. సహనంతో భర్తకు ఎదురైన కష్టాలను అధిగమించడంలో సహాయపడుతుంది. బాధలు త్వరగా తీరిపోయేలా చేస్తుంది. అటువంటి సహనం కలిగిన స్త్రీ దొరికిన భర్త అదృష్టవంతుడు.

దేవుడి పట్ల భక్తివిశ్వాసాలను కలిగిన స్త్రీ .. భర్తకు అదృష్టవంతురాలిగా పరిగణించబడుతుంది. దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం, భక్తి భర్త అడుగుజాడలను నడిపిస్తుంది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భార్య దారి తప్పకుండా ఈ గుణం కాపాడుతుంది. దేవుడిమీద భయ భక్తులున్న భార్య దొరికిన వ్యక్తి జీవితం శాంతివంతంగా ఉంది. సదా విజయాన్ని పొందుతాడు.

ఎటువంటి సందర్భం ఎదురైనా కుటుంబ సభ్యులతో గొడవ పడవద్దని ఆచార్య చాణక్య సూచించాడు. మీకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా అండగా ఉండే కుటుంబ సభ్యులను దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు అని.. ఒకొక్కసారి మీరు పశ్చాత్తాపడే పరిస్థితులు రావచ్చనని పేర్కొన్నాడు .

ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి వ్యక్తికీ స్వీయ అవగాహన తప్పని సరి అని చాణక్య పేర్కొన్నాడు. ఒక నిర్ణయం తీసుకునే ముందు.. దానివలన కలిగే మంచి చెడుల గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపాడు.





























