Mangala Gauri Vratam: రేపు శ్రావణ మంగళవారం.. అఖండ సౌభాగ్యాన్ని ఇచ్చే గౌరమ్మని ఎలా పూజించాలంటే..

అఖండ సౌభాగ్యాన్ని పొందడానికి.. శ్రవణ మంగళవారం మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో మంగళగౌరీ వ్రతాన్నిఆచరిస్తారు. వ్రతం చేసే సమయంలో తప్పకుండామంగళగౌరి  కథను వినాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన భక్తుల పట్ల పార్వతీ దేవి అనుగ్రహం ఉంటుందని.. తమ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని.. పిల్లలకు దీర్ఘాయువు లభిస్తుందని విశ్వాసం.

Mangala Gauri Vratam: రేపు శ్రావణ మంగళవారం.. అఖండ సౌభాగ్యాన్ని ఇచ్చే గౌరమ్మని ఎలా పూజించాలంటే..
Mangala Gauri Vratam
Follow us
Surya Kala

|

Updated on: Jul 24, 2023 | 1:29 PM

శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం,శుక్రవారాలను మహిళలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. మంగళ గౌరీ, వరలక్ష్మి వ్రతాలను అత్యంత భక్తి శ్రద్దలతో చేస్తారు. శ్రావణ మంగళవారాల్లో వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ ఏడాది అధిక శ్రావణ మాసం రావడంతో 9 మంగళవారాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రావణ మాసం మంగళవారం మహిళలు చేసుకునే మంగళవారం,  మంగళ గౌరీ వ్రతానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అధిక శ్రవణం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు మంగళగౌరీ వ్రతానికి మహిళలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివాహిత స్త్రీలు గౌరమ్మని పూజిస్తే.. అఖండ సౌభాగ్యాన్ని పొందుతారని, పెళ్లికాని అమ్మాయిలు మంచి వరుడిని పొందేందుకు, త్వరగా పెళ్లి అవ్వడం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఏ పద్దతిలో పెళ్లయిన స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందవచ్చో తెలుసుకుందాం..

అఖండ సౌభాగ్యాన్ని ఇచ్చే మంగళగౌరి వ్రతం.. 

అఖండ సౌభాగ్యాన్ని పొందడానికి.. శ్రవణ మంగళవారం మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో మంగళగౌరీ వ్రతాన్నిఆచరిస్తారు. వ్రతం చేసే సమయంలో తప్పకుండామంగళగౌరి  కథను వినాలి.ఈ వ్రతాన్ని ఆచరించిన భక్తుల పట్ల పార్వతీ దేవి అనుగ్రహం ఉంటుందని.. తమ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని.. పిల్లలకు దీర్ఘాయువు లభిస్తుందని విశ్వాసం. ఈ వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత దృష్టా మంగళ గౌరీ వ్రతాన్ని తప్పనిసరిగా కొత్త వధువులతో చేయిస్తారు పెద్దలు.

ఇవి కూడా చదవండి

గౌరమ్మని ఎలా ప్రసన్నం చేసుకోవాలంటే.. 

మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారికి పండ్లు, పూలు, తాంబూలం, లడ్డూలు, శనగలు, 16 గాజులు, పువ్వులను సమర్పించాలి. పూజలో 16 తోరణాలు సమర్పించడం వల్ల అమ్మవారికి సంతోషం కలుగుతుందని నమ్మకం. మంగళగౌరీ వ్రత కథ ను పూజ సమయంలో చదివి భక్తు శ్రద్దలతో పూజను చేయాల్సి ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయని, సంతానం లేనివారు సంతానం పొందుతారని విశ్వాసం.

మంగళ గౌరీ పూజా విధానం

శ్రావణ మాసంలో మంగళవారం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ముందుగా స్నానం చేసి పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. పీఠాన్ని ఏర్పరచి ఎర్రటి వస్త్రాన్ని పరచి.. గౌరమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించండి. పళ్ళెంలో ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై నవగ్రహాలను ఏర్పాటు చేయాలి. అలాగే కలశం ఏర్పాటు చేయడం బియ్యం పిండితో దీపం చేసి పూజలో ఉంచండి. ఈ అన్ని నియమ నిష్టలతో గౌరమ్మని పూజించండి. ఈ విధంగా పూజించడం ద్వారా పార్వతీమాత అనుగ్రహంతో వివాహిత స్త్రీలకు అఖండ సౌభాగ్యం లభిస్తుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)