AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivaraha Swamy Temple: మూషిక రూపంలో వెలసిన శ్రీహరి.. ఏటా పెరిగే విగ్రహం.. వరాల స్వామిగా ఖ్యాతి..

కమాన్పూర్ మండల కేంద్రంలోని అరుదైన ఆది వరాహ స్వామి ఆలయం, వరాల స్వామి ఆలయంగా కూడా ప్రాచుర్యం పొందింది. గతంలో ఒక భక్తుడు ఇక్కడ కోరుకున్న కోరిక నెరవేరడంతో, మొక్కు ప్రకారం ఆ భక్తుడు ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు.

Adivaraha Swamy Temple: మూషిక రూపంలో వెలసిన శ్రీహరి.. ఏటా పెరిగే విగ్రహం.. వరాల స్వామిగా ఖ్యాతి..
Adivaraha Swamy Temple
G Sampath Kumar
| Edited By: Surya Kala|

Updated on: Jul 22, 2023 | 3:20 PM

Share

భారత దేశం ఆధ్యాత్మిక దేశం. ఎన్నో వింతలు, విశేషాలు రహస్యాలున్న అనేక దేవాలయాలున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సైన్స్ కి కూడా అందని మిస్టరీ టెంపుల్స్ అనేకం ఉన్నాయి. కొన్ని ఆలయాలను చుస్తే.. అవి అద్భుతమానిస్తాయి. మూషిక రూపంలో వెలసిన శ్రీ హరి రాతి విగ్రహం, ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్న అరుదైన దృశ్యం. ఎవరి ఊహలకు అందకుండా, అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ నమ్మలేని ఆలయం.. పెరుగుతున్న స్వామి వారిని దర్శించుకోవడానికి… భారీగా భక్తులు తరలి వస్తున్నారు.. పెరుగుతున్న.. ఈ వింతైన ఆలయ చరిత్ర .. విగ్రహం ఎక్కడ ఉందో ఈ రోజు తెలుసుకుందాం..

పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఆదివరాహ స్వామి ఆలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. సుమారు 600 సంవత్సరాల క్రితం ఒక మహా రుషి తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శ్రీహరి, ఆ ఋషి కోరిక మేరకు ఆదివరాహ స్వామి రూపంలో వెలసి భక్తుల నుండి విశేష పూజలు అందుకుంటున్నారు. మొదట మూషికం మాదిరిగా చిన్నగా వెలసిన స్వామి వారి రాతి విగ్రహం, ప్రతిఏటా పెరుగుతూ వస్తుండడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత.

ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మాత్రమే ఆది వరాహ స్వామి ఆలయాలు ఉండగా, శ్రీవారు కొలువై ఉన్న తిరుమల ప్రాంతంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలంలో ఉన్న ఈ ఆలయం రెండవదిగా ప్రాచుర్యం పొందింది.

ఇవి కూడా చదవండి

కలియుగంలో స్వామివారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వస్తున్న క్రమంలో ఆది వరాహుడు ఆశ్రయం కల్పించాడని, అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చే భక్తులు మొదట ఆదివరాహ స్వామిని దర్శించుకుని వచ్చేలా స్వామివారు వరం ఇచ్చినట్టుగా ఇతిహాసాలు చెబుతున్నాయి. కమాన్పూర్ మండల కేంద్రంలోని అరుదైన ఆది వరాహ స్వామి ఆలయం, వరాల స్వామి ఆలయంగా కూడా ప్రాచుర్యం పొందింది. గతంలో ఒక భక్తుడు ఇక్కడ కోరుకున్న కోరిక నెరవేరడంతో, మొక్కు ప్రకారం ఆ భక్తుడు ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. అప్పుడు స్వామి వారు స్వయంగా ఆ భక్తుడికి కలలో కనబడి తనకు ఎలాంటి ఆలయం నిర్మించవద్దని, తాను ఆరుబయటనే ఉంటూ భక్తుల కోరికలు నెరవేరుస్తానని చెప్పినట్టుగా పూర్వీకులు చెబుతున్నారు. మహిమాన్విత స్వామిగా ప్రసిద్ధిగాంచిన స్వామి వారు, ఇక్కడ ఆరు బయటే ఉండి, ప్రతి ఏటా పరిమాణం పెంచుకుంటూ భక్తుల నుండి నిత్యం విశేష పూజలను అందుకుంటున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..