AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gurveshvara Temple: ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే .. అహంకారం నశిస్తుందని నమ్మకం..

శ్రీ గుర్వేశ్వార మహాదేవ ఆలయం రామఘాట్‌లోని శ్రీ పిశాచ ముక్తేశ్వర ఆలయానికి దక్షిణంగా ఉందని ..  ఇది సొరంగం లాంటిదని చెప్పారు. ఇక్కడ స్వామివారి శ్రీ గుర్వేశ్వార భూ గర్భంలో ఉంటాడు. ఆలయంలోని నల్లరాతి దేవుని విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది.

Gurveshvara Temple: ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే .. అహంకారం నశిస్తుందని నమ్మకం..
Sri Gurveshvar Mahadev
Surya Kala
|

Updated on: Jul 21, 2023 | 4:13 PM

Share

మన దేశంలో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శివాలయాలు దర్శనమిస్తాయి. లయకారుడైన శివయ్యను దర్శించుకుని జలంతో అభిషేకిస్తే చాలు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు అని భక్తుల విశ్వాసం. శివయ్య దర్శనం, పూజలతో కష్టాలు తొలగి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అయితే ఈ శివాలయం మాత్రం అన్ని శివాలయాలు కంటే భిన్నం.. ఎందుకంటే ఏ ఆలయంలోకి వెళ్లిన కోరిన కోర్కెలు తీర్చమని కోరుకుంటారు. కానీ మధ్యప్రదేశ్ ని ప్రముఖ నగరం ఉజ్జయినిలో కొలువైన ఈ శివాయలంలో శివయ్యను దర్శించుకునే అహకారం నశిస్తుందని విశ్వాసం. భక్తుల అహంకారాన్ని నాశనం చేసే అటువంటి శివాలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఉజ్జయినిలోని రామ్‌ఘాట్‌లో వాంపైర్ ముక్తేశ్వర్‌కు సమీపంలో ఉన్న సొరంగం లోపల అత్యంత పురాతన శివాలయం ఉంది. ఇక్కడ శివయ్య శ్రీ గుర్వేశ్వార మహాదేవుడిగా పూజలను అందుకుంటాడు. ఈ ఆలయం  చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయ పూజారులు పండిట్ గౌరవ్ ఉపాధ్యాయ, పండిట్ రాహుల్ ఉపాధ్యాయ మాట్లాడుతూ శ్రీ గుర్వేశ్వార మహాదేవ ఆలయం రామఘాట్‌లోని శ్రీ పిశాచ ముక్తేశ్వర ఆలయానికి దక్షిణంగా ఉందని ..  ఇది సొరంగం లాంటిదని చెప్పారు. ఇక్కడ స్వామివారి శ్రీ గుర్వేశ్వార భూ గర్భంలో ఉంటాడు. ఆలయంలోని నల్లరాతి దేవుని విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడడానికి దివ్య రూపంగా గోచరిస్తుంది. ప్రవేశద్వారం పైన మధ్యలో గణపతి విగ్రహం ఉంది, ఇది చాలా దైవికమైనది.

ఈ గుర్వేశ్వార మహాదేవుడు దర్శనం ద్వారా అన్ని పాపాలు నశిస్తాయని అంతేకాదు శివలింగాన్ని పూజించే వ్యక్తి అహంకారాన్ని గుర్వేశ్వార నశింపజేస్తాడని విశ్వాసం. అంతేకాదు ఆ భక్తుని దృఢత్వం ఎప్పటికీ తగ్గదు. అష్టమి, చతుర్దశి తిథిలలో ఈ శివలింగాన్ని దర్శించుకున్న వ్యక్తుల పూర్వీకులు బ్రహ్మలోకాన్ని పొందుతారని ఆలయ పూజారి చెప్పారు.

ఇవి కూడా చదవండి

శ్రావణ మాసంలో ప్రత్యేక అలంకరణ, పూజలు  శ్రీ గుర్వేశ్వార మహాదేవునికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. శ్రావణ, భాద్రపద మాసంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేసి, ఆరతిని ఇస్తారు. ఇప్పుడు శ్రావణ అధిక మాసం కారణంగా శ్రీ గుర్వేశ్వార మహాదేవుడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకోవాడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)