Adhik Maas 2023: నేటి నుంచి అధిక మాసం మొదలు.. శుభకార్యాలు నిషేధం.. విష్ణు పూజ శ్రేష్టం.. రీజన్ ఏమిటంటే
హిరణ్యకశ్యపుడు తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. విష్ణువు ఆరాధనను నిషేధించాడు. భూమిపై అతని దౌర్జన్యాలు చాలా ఎక్కువైనప్పుడు హిరణ్యకశ్యపుడు కి ప్రహ్లాదుడు జన్మించాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. హిరణ్యకశ్యపుడు వధించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు శ్రీ మహావిష్ణువు 12 నెలలు కాకుండా 13వ హిందూ నెలను అధిక మాసాన్ని సృష్టించాడు. తరువాత నరసింహ అవతారంఎత్తి హిరణ్యకశ్యపుని వధించాడు.
పంచాంగం ప్రకారం అధిక శ్రావణ మాసం (జూలై 18, 2023) నేటి నుండి మొదలైంది. ఈ అధిక మాసం విష్ణువు ఆరాధనకు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర అధిక మాసం ఆగస్టు 16 వరకు కొనసాగుతుంది. సనాతన సంప్రదాయంలో ఈ అధిక శ్రవణాన్ని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం ఈ అధిక శ్రవణంలో వివాహం, ప్రాపంచిక, శుభకార్యాలు, ఉపనయం వంటి ఏ విధమైన మత పరమైన శుభకార్యాలు చేయడం పూర్తిగా నిషేధించబడ్డాయి. అయితే ఈ అధిక మాసంలో శ్రీ హరిని ఆరాధించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దానికి సంబంధించిన కథ, అవసరమైన నియమాలు మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
అధిక మాసం ఎప్పుడు మొదలైందంటే.. హిందూ విశ్వాసం ప్రకారం అసురుల రాజు హిరణ్యకశ్యపుడు తాను మరణించకుండా వరం కోరుకోవాలని పరమపిత బ్రహ్మను కోరి తపస్సు చేశాడు. బ్రహ్మ దేవుడు పగలు, రాత్రి, లోపల, బయట, దేవ దానవుల, మానవుల, జంతువుల వల్ల మరణం లేని వరం కోరాడు. అంతేకాదు సంవత్సరంలో 12 నెలల్లో ఎప్పుడూ తనకు మరణం రాకూడదని వరం కోరాడు. ఈ వరం పొందిన తరువాత హిరణ్యకశ్యపుడు తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. విష్ణువు ఆరాధనను నిషేధించాడు. భూమిపై అతని దౌర్జన్యాలు చాలా ఎక్కువైనప్పుడు హిరణ్యకశ్యపుడు కి ప్రహ్లాదుడు జన్మించాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. హిరణ్యకశ్యపుడు వధించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు శ్రీ మహావిష్ణువు 12 నెలలు కాకుండా 13వ హిందూ నెలను అధిక మాసాన్ని సృష్టించాడు. తరువాత నరసింహ అవతారంఎత్తి హిరణ్యకశ్యపుని వధించాడు.
దీనిని పురుషోత్తమ మాసం అని ఎందుకంటారంటే హిందూ విశ్వాసం ప్రకారం అధిక మాసానికి పాలకుడిగా మారడం కోసం దేవతలు సిద్ధంగా లేని సమయంలో శ్రీ మహా విష్ణువు అధిక మాసం పాలకునిగా మారాడు. ఈ అధిక మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దంటూ నిషేధించారు. ఈ అధిక మాసంలో శ్రీ హరిని పూజించడం వలన దీనిని పురుషోత్తమ మాసం అని పిలిచేవారు. ఈ సంవత్సరం అధిక మాసం శ్రావణ మాసంలో వచ్చింది. ఈ పవిత్ర మాసంలో హరిహరుడు అంటే శ్రీ విష్ణువుతో పాటు, శివుని ఆరాధన కూడా చాలా ముఖ్యమైనది.
అధిక మాసం లెక్క కడతారంటే.. హిందూ పంచాంగం ప్రకారం చంద్రుడు 12 రాశుల్లో ప్రయాణించడానికి 28 నుండి 29 రోజులు పడుతుంది, దీని కారణంగా చంద్ర సంవత్సరం 354.36 రోజులు. మరోవైపు, సూర్యుడు 30.44 రోజులు ఒక రాశిలో ఉంటాడు. దీని కారణంగా 12 రాశుల్లో సూర్యుడు పూర్తిగా పయనించడానికి 365.28 రోజులు పడుతుంది. ఈ విధంగా సౌర సంవత్సరానికి, చంద్ర సంవత్సరానికి మధ్య 10.92 రోజుల తేడా ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దడానికి ప్రతి మూడవ సంవత్సరం అధిక మాసాన్ని చేర్చే సంప్రదాయం పురాణ కాలం నుండి కొనసాగుతోంది. హిందూ క్యాలెండర్‌లో ఈ అధిక మాసం అమావాస్య నుండి ప్రారంభమవుతుంది. విశేషమేమిటంటే.. అధిక మాసాలు కూడా 12 నెలల్లో ఏదొక నేలగా మారుతూనే ఉంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)