AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: రూ.10 వేలు విరాళం ఇస్తే.. వీఐపీ దర్శనం.. శ్రీవాణి ట్రస్టుకు 5 ఏళ్లలో రూ. 880 కోట్ల లభ్యం

తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ (శ్రీవాణి ట్రస్ట్) భక్తుల కోసం వీఐపీ దర్శనాన్ని కల్పిస్తోంది. ఈ దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు రూ. 10,000 విరాళం సమర్పించాల్సి ఉంటుంది. ఈ దర్శనం చేసుకునే భక్తులు ఎక్కువ సేపు క్యూ లైన్ లో వేచి చూడాల్సిన అవసరం లేదు. అంతేకాదు స్వామివారిని అతి దగ్గరగా దర్శించకునే  వీలుకల్పిస్తుంది టీటీడీ.

Tirumala: రూ.10 వేలు విరాళం ఇస్తే.. వీఐపీ దర్శనం.. శ్రీవాణి ట్రస్టుకు 5 ఏళ్లలో రూ. 880 కోట్ల లభ్యం
Tirumala
Surya Kala
|

Updated on: Jul 17, 2023 | 3:10 PM

Share

తిరుమల తిరుపతి క్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. స్వామివారి దర్శనం సర్వదర్శనం,  వీఐపీ బ్రేక్ దర్శనం వంటి అనేక రకాల దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ (శ్రీవాణి ట్రస్ట్) భక్తుల కోసం వీఐపీ దర్శనాన్ని కల్పిస్తోంది. ఈ దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు రూ. 10,000 విరాళం సమర్పించాల్సి ఉంటుంది. ఈ దర్శనం చేసుకునే భక్తులు ఎక్కువ సేపు క్యూ లైన్ లో వేచి చూడాల్సిన అవసరం లేదు. అంతేకాదు స్వామివారిని అతి దగ్గరగా దర్శించకునే  వీలుకల్పిస్తుంది టీటీడీ. ఈ దర్శనంతో భక్తుల నుంచి గత ఐదేళ్లలో రూ.880 కోట్లు స్వీకరించినట్లు టీటీడీ పేర్కొంది.

అంతేకాదు శ్రీవాణి ట్రస్టుకు రూ.10,000 (ఒక వ్యక్తి) విరాళంగా ఇచ్చిన భక్తుడికి ఒకసారి వీఐపీ దర్శనం కల్పించడం ద్వారా మధ్య దళారుల సమస్యను అరికట్టామని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ దర్శనం ద్వారా ట్రస్టుకు సుమారు రూ.880 కోట్లు వచ్చినట్లు తెలిపారు.

శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏమిటి? శ్రీ వాణి ట్రస్ట్ వాస్తవానికి 2018లో ప్రారంభించబడింది. శ్రీవాణి ట్రస్ట్ భారతదేశం అంతటా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించడం, నిర్వహించడం..  ఆచారాలు, విధులు, పండుగలను నిర్వహించడానికి సౌకర్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు ఆలయ గోపురాన్ని పునరుద్ధరించడం, రక్షించడం, పరిరక్షించడం, నిర్వహించడం వంటి ఇతర కార్యక్రమాలకు కూడా ఉపయోగపడుతుంది. 2019 నుంచి శ్రీవాణి ట్రస్టు ద్వారా 9 లక్షల మంది భక్తులు దర్శనం పొందారని రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

రోజుకు లక్ష మంది యాత్రికులు వస్తుంటారు తిరుమలలో రోజుకు లక్ష మంది యాత్రికులు వస్తుండగా 7 వేల గదులు మాత్రమే ఉన్నందున 24 గంటలకు మించి భక్తులకు వసతి కల్పించడం లేదని ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

భక్తులకు వీఐపీ దర్శనం 2018 సంవత్సరంలో తిరుమలలోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే ‘శ్రీవాణి ట్రస్ట్’కి రూ. 10,000 విరాళం ఇచ్చిన భక్తుల కోసం వీఐపీ దర్శన టిక్కెట్ విధానాన్ని ప్రారంభించింది. వీఐపీ సిఫార్సు లేఖ లేని భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10,000 విరాళంగా చెల్లించి వీఐపీ దర్శన టిక్కెట్‌ను పొందవచ్చని ధర్మా రెడ్డి తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..