Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. మంగళవారం ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. ఈజీగా ఎలా బుక్‌ చేసుకోవాలంటే?

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. మంగళవారం (జులై 18) అక్టోబర్‌ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టపళ పాదపద్మారాధన తదితర ఆర్జిత సేవల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. మంగళవారం ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. ఈజీగా ఎలా బుక్‌ చేసుకోవాలంటే?
TTD
Follow us
Basha Shek

|

Updated on: Jul 17, 2023 | 2:58 PM

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. మంగళవారం (జులై 18) అక్టోబర్‌ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టపళ పాదపద్మారాధన తదితర ఆర్జిత సేవల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు వీటిని బుక్‌ చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు డబ్బు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కల్యాణోత్సతవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను శుక్రవారం (జులై 21)న ఉదయం 10 గంటలకు రిలీజ్‌ చేయనుంది టీటీడీ. అలాగే అక్టోబర్‌ నెల అంగప్రదక్షిణం టికెట్లు జులై 24న ఉదయం 10 గంటలకు అందుబాటులో రానున్నాయి.

శ్రీవారి భక్తులు టీటీటీ అధికారిక వెబ్‌సైట్‌ లో ఆర్జిత సేవాటికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. కాగా నెట్టంట టీటీడీ నకిలీ వెబ్‌సైట్లు గుంపగుత్తలుగా ఉన్నాయి. కాబట్టి టికెట్లు బుక్‌ చేసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ భక్తులకు సూచించింది. భక్తులకు సౌకర్యంగా ఉండేలా షెడ్యూల్‌ ప్రకారం టికెట్లను రిలీజ్‌ చేశామని టీటీడీ తెలిపింది. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి