AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravana Masam: శ్రావణ మాసంలో శివయ్యను ఇలా పూజించండి.. రాహు-కేతు దోషాలు రెప్పపాటులో తొలగిపోతాయి..

శివుడిని పూజిస్తే జాతకంలో శని లేదా రాహు-కేతువులతో సంబంధం ఉన్న దోషాలు రెప్పపాటులో తొలగిపోతాయి. ఎందుకంటే ఈ మూడు గ్రహాలకు అధిపతి శివుడు. ముఖ్యంగా శ్రావణ మాసంలో శివుడికి చేసే ధ్యానం, పూజలు, జపంతో అనుగ్రహం సొంతం అవుతుంది. ఎవరి జాతకంలో రాహువు, కేతువు దోషాలతో సమస్యలు కలుగుతుంటే.. బాధను కలిగిస్తుంటే.. శ్రావణ శివరాత్రి రోజున కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం వలన శుభఫలితాలను పొందుతారు. 

Shravana Masam: శ్రావణ మాసంలో శివయ్యను ఇలా పూజించండి.. రాహు-కేతు దోషాలు రెప్పపాటులో తొలగిపోతాయి..
Lord Shiva Puja
Surya Kala
|

Updated on: Jul 16, 2023 | 3:02 PM

Share

సనాతన హిందూ సంప్రదాయంలో శివుని ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. శివుడిని పూజిస్తే అన్ని దుఃఖాలను తొలగించి, సుఖ సంతోషాలు కలుగుతాయని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా శని, రాహు- కేతు దోషాలు ఉంటె.. వారు శివుడిని పూజిస్తే జాతకంలో శని లేదా రాహు-కేతువులతో సంబంధం ఉన్న దోషాలు రెప్పపాటులో తొలగిపోతాయి. ఎందుకంటే ఈ మూడు గ్రహాలకు అధిపతి శివుడు. ముఖ్యంగా శ్రావణ మాసంలో శివుడికి చేసే ధ్యానం, పూజలు, జపంతో అనుగ్రహం సొంతం అవుతుంది. ఎవరి జాతకంలో రాహువు, కేతువు దోషాలతో సమస్యలు కలుగుతుంటే.. బాధను కలిగిస్తుంటే.. శ్రావణ శివరాత్రి రోజున కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం వలన శుభఫలితాలను పొందుతారు.

  1. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో రాహు-కేతు దోషాలు మీ పురోగతికి ఆటంకం కలిగిస్తే.. నివారణ కోసం శ్రావణ మాసం శివరాత్రి నాడు నీటిలో మామిడి ఆకులు, దర్భగడ్డిని కలిపి శివునికి అభిషేకం చేయాలి.
  2. జాతకంలో రాహు-కేతువుల దోషంతో ఏర్పడిన సమస్యల నుండి బయటపడటానికి శివరాత్రి నాడు, నియమాలు, నిబంధనల ప్రకారం శివుడిని పూజించండి. శివ పురాణాన్ని చదవండి.
  3. రాహు-కేతువులకు సంబంధించిన దోషాన్ని తొలగించడానికి శివరాత్రి నాడు రుద్రాక్ష జపమాలతో ‘ఓం నమః శివాయ’ లేదా మహాదేవుని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. శివరాత్రి రోజున ఈ పరిహారం చేస్తే మీరు కాలసర్ప దోషం నుండి విముక్తి పొందుతారు.
  4. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు-కేతు బాధలు పోవాలంటే శివరాత్రి శివలింగానికి పాలు, బిల్వ పత్రాన్ని సమర్పించి అభిషేకం చేయాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో శివరాత్రి నాడు శివునికి పాలు, పెరుగు, నెయ్యి, తేనెను సమర్పించడం, పవిత్ర గంగానది జలంతో చేసే అభిషేకంతో రాహు గ్రహం వలన ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి.
  7. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీ జాతకంలో రాహువుకు సంబంధించిన దోషం ఉన్నట్లయితే, జీవితంలో  ఏర్పడిన రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. వాటిని నివారించడానికి శ్రావణ మాసం శివరాత్రి రోజున శివలింగానికి గంగాజలం సమర్పించిన తర్వాత, ముఖ్యంగా 21 తెల్లని రంగు పువ్వులను శివ మంత్రాన్ని జపిస్తూ సమర్పించండి.
  8. హిందూ విశ్వాసం ప్రకారం శ్రావణ మాసం శివరాత్రికి పూజ చేసే సమయంలో నిర్మలమైన హృదయంతో శివ సహస్రనామ స్తోత్రం పఠిస్తే, జాతకంలో రాహు-కేతువుల దోషం తొలగిపోతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)