Weekly Horoscope (16-23 July): ఆ రాశి నిరుద్యోగులు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే?

స్థిరాస్తి కొనుగోలు చేయడం గానీ, స్థిరాస్తి విలువ పెరగడం గానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు.

Weekly Horoscope (16-23 July): ఆ రాశి నిరుద్యోగులు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jul 16, 2023 | 4:00 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

స్థిరాస్తి కొనుగోలు చేయడం గానీ, స్థిరాస్తి విలువ పెరగడం గానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కోర్టు కేసు ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రయాణాల్లోనూ, ఆరోగ్యం విషయంలోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబ విషయాలలో చిక్కులు తొలగిపోతాయి. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగా కాస్తంత పురోగతి ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులకు కళ్లెం వేయగలుగుతారు. అవసరమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొద్దిగా మోసపోయే సూచనలున్నాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. పని చేస్తున్న కంపెనీ నుంచి రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూమికి సంబంధించిన వ్యవహారాలు చాలా వరకు అనుకూలిస్తాయి. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. దైవ కార్యాలలో పాల్గొం టారు. అప్రయత్న కార్యసిద్ధి సూచనలున్నాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి నిపుణు లకు ఆదరణ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ముఖ్యమైన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం అవ సరం. అకారణంగా వివాదాలు తలెత్తే సూచనలున్నాయి. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగు తుంది. వివాహ ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారా లలో కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండడం గానీ, వాగ్దానాలు చేయడం కానీ చేయవద్దు. చిక్కుల్లో పడే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఒక ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారం ఒకటి అనుకోకుండా, అప్రయత్నంగా అనుకూలం అవుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వారమంతా ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతుంది. కార్యసిద్ధికి, వ్యవహార జయానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి జీవితాలవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. బంధువుల రాకపోకలుంటాయి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. విహార యాత్రకు వెళ్లే సూచనలున్నాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వాహన ప్రమాదాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాల వల్ల పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు, చికాకులు ఏమైనా ఉంటే, అవి సునాయాసంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ప్రస్తుతానికి సొంత వాహనాల్లో ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువుల్లో కొందరు అపనిందలు వేయడం గానీ, దుష్ప్రచారం చేయడం గానీ జరుగుతుంది. మిత్రుల్లో కూడా కొందరు తప్పుదోవ పట్టించి లబ్ధి పొందే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. తండ్రి వైపు బంధువుల నుంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. డాక్టర్లు, లాయర్లు తమ కార్యకలాపాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో పని భారం ఉన్నప్పటికీ ముఖ్యమైన బాధ్యతలను సమర్థవం తంగా నిర్వర్తిస్తారు. స్థిరాస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువుల్లో కొందరు వెనుక నుంచి దెబ్బ తీసే అవకాశం ఉంది. మిత్రులు, సన్నిహితుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. ఇరుగు పొరుగు వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. దూర ప్రాంతంలో మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైతే ప్రయాణాలను వాయిదా వేయడం శ్రేయస్కరం. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా అసంతృప్తి కలిగిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు చికాకు పెడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వా‌షాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి బిజీ జీవితం ఏర్పడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. నిర్ణయాలు, ఆలోచనలు కార్యరూపం ధరిస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే వ్యాపారాలు, వ్యవహారాలు విజయవంతం అవుతాయి. కుటుంబంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ముఖ్యమైన కార్యకలాపాలన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలలో నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టడం జరుగుతుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల రాకపోకలుంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లలకు సంబంధించి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతానికి పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

చాలా కాలంగా వేధిస్తున్న ఆస్తి సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. స్తోమతకు మించి బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. మిత్రులతో పేచీలు తలెత్తే అవకాశం ఉంది. అనారోగ్యం సమస్యలు, రుణ సమస్యలు అదుపులో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలపరంగా లబ్ధి చేకూరుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాల విషయంలో మరింత పట్టుదలగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. కొన్ని ప్రయత్నాలు ఆలస్యం అయిన ప్పటికీ మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సంపాదన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహా రాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన, ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. దగ్గర బంధువుల ఇళ్లకు వెళ్లడం, ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!