Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Overthinking Habit: అతిగా ఆలోచించే అలవాటు మీకు ఉందా.. ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోండి..

నిరంతరం ఆలోచించడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. అది చర్యతో కూడి ఉండాలి. అయితే ఆలోచనలను బంధించడం ఎవరి వల్ల కాదు. నిరంతరం వందల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది నిరంతరం సాగే ఆలోచనలు ఒక గొలుసు వంటిది. అంతేకాదు అతిగా ఆలోచించడం వల్ల జీవితంలో కూడా లేని ఊహాజనిత సమస్యలు కలుగుతూ ఉంటాయి. 

Overthinking Habit: అతిగా ఆలోచించే అలవాటు మీకు ఉందా.. ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోండి..
Overthinking Habit
Follow us
Surya Kala

|

Updated on: Jul 11, 2023 | 9:39 AM

ఒక ధనవంతుడు గురువు వద్దకు వచ్చి, ‘గురుదేవా ఆలోచనలతో నా తల తిరుగుతోంది. ఈ ఆలోచనలను  ఆపడానికి ఏదైనా పరిష్కారం సూచించండని కోరాడు. దీంతో ఆ గురువు అతనికి ఒక చెంచా ఇచ్చి బీచ్‌కి తీసుకెళ్లాడు. ధనిక అనుకున్నాడు.. గురువు తనకు ఏదైనా మంత్రోపదేశం చేస్తాడని భావించాడు. అయితే గురువు సముద్రపు అలలను చాలా సేపు చూస్తూ ఉండిపోయాడు. కొంత సమయం తర్వాత వత్సా  నీకు ఈ సముద్రం కనిపిస్తోందా.. అవును.. నీ చేతిలోని చెంచాతో సముద్రం నీరు తీసుకుని రా.. అయితే చాలా నీటిని తీసుకుని వచ్చే సమయంలో సముద్రంలో అలలు ఉండకూడాదు సుమా అంటూ కండిషన్ పెట్టాడు. అలా నీటిని తీసుకుని వస్తే నీకు వస్తున్న ఆలోచనలు ఆగిపోతాయని చెప్పాడు. గురువు చెప్పిన విషయం విన్న ధనికుడు.. కంగారు పడుతూ.. గురుదేవా నా జీవితమంతా ఇక్కడే గడిపినా అలలు ఆగిన తర్వాత చెంచాతో ఈ సముద్రంలో నుంచి నీరు తేలేను అని చెప్పాడు. దీంతో గురుదేవ నవ్వుతూ,  వత్సా, నీకు అంత తెలుసు, కాదా?  ఈ సముద్రాన్ని చూడు.. నీలోని ఆలోచనలు సముద్రం వంటివి. మనిషి జీవితంలో ఆటుపోట్లు ఎదురవుతూనే ఉంటాయి. కనుక అతిగా ఆలోచించడం మానేసి.. మిమ్మల్ని మీరు నిరంతరం ఏదైనా పని చేసే విధంగా మలచుకోండి.

నిరంతరం ఆలోచించడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. అది చర్యతో కూడి ఉండాలి. అయితే ఆలోచనలను బంధించడం ఎవరి వల్ల కాదు. నిరంతరం వందల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది నిరంతరం సాగే ఆలోచనలు ఒక గొలుసు వంటిది. అంతేకాదు అతిగా ఆలోచించడం వల్ల జీవితంలో కూడా లేని ఊహాజనిత సమస్యలు కలుగుతూ ఉంటాయి.

అయితే ఆలోచనలకు ఎలా అడ్డుకట్ట వేయాలంటే.. కష్టం. ఆలోచనలకు ఆన్ లేదా ఆఫ్ బటన్ లేదు. అవి నిరంతరం కొనసాగుతునే ఉంటాయి. అయితే ఎక్కువ ఆలోచించవద్దని , నిరంతరం ఆలోచిస్తూ ఉంటె వాటి వేగం పెరుగుతుందని సలహా ఇచ్చారు. వాస్తవానికి ఆలోచించడం మంచిదే..  కానీ అతిగా ఆలోచించడం చెడ్డది. కనుక ఆలోచనలను ఎలా అదుపులో పెట్టుకోవాలి.. ఆలోచన దిశ సరైనదా లేదా తప్పు అని ఎలా  నిర్ణయించాలి అనేది నిర్ణయం తీసుకోవాలి. మంచి చెడుల మధ్య తేడా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వ్యక్తిగత దురాశతో ఆలోచనలను నిష్పక్షపాతంగా చూడటం మర్చిపోతాము. కనుక ఆలోచనలు సమతుల్యంగా ఉంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

జీవితంలో నిరంతరం కలిగే ప్రశ్నలు ముగిసిపోతే.. అతిగా ఆలోచన చేసే అవసరం తగ్గుతుందని చాలా మంది భావిస్తారు. అయితే ఇది నిజం కాదు. ఎందుకంటే, ప్రతిరోజూ కొత్త ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. ఈ ప్రశ్నలను పరిష్కరించడానికి జీవితాన్నివృధా చేసుకోరాదు. అటువంటి ప్రశ్నను దాటవేయాలి ! ఆలోచనల దిశను మార్చుకోవాలి. సానుకూల విధానం ఉపయోగకరంగా ఉండటమే కాకుండా, సమస్యను పరిష్కరించడానికి మొదట వాస్తవాలను అంగీకరించాలి. వాస్తవిక అంచనాలను కలిగి ఉండాలి.

ఆలోచనలు రెండు రకాలు. ఒకటి ప్రశ్నించే ఆలోచన, రెండోది ప్రత్యామ్నాయ ఆలోచన. ప్రశ్నించే ఆలోచనలు ఆగవు. వాటి గురించి ఆలోచించడం వల్ల ఏమీ జరగదు. మరోవైపు ప్రత్యామ్నాయాలు ఆలోచించి పనులు ప్రారంభిస్తే సమస్యలు ఆటోమేటిక్‌గా పరిష్కారమవుతాయి. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించి సమస్యలను పరిష్కరించుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).