తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

ఆళ్వార్ తిరుమంజనం పేరుతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోంది. కొత్త వస్త్రంతో స్వామివారిని పూర్తిగా కప్పి వేసి గర్భగుడిని, పూజా సామాగ్రిని సుగంధ ద్రవ్యాల లేపనంతో శుద్ది చేశారు. నిన్న రాత్రే తయారు చేసుకున్న పవిత్ర పరిమళ మిశ్రమంతో అభిషేకించడం వల్ల ఆలయ గోడలకు క్రిమి కీటకాలు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, వేల సంవత్సరాల ఆచారమని టీటీడీ భావిస్తోంది.

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
Ttd
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 11, 2023 | 10:47 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ నెల 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించింది. టిటిడి ఇఓ ధర్మారెడ్డి తోపాటు జీయ్యర్లు, పాలక మండలి సభ్యులు టిటిడి అధికారులు, అర్చకులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయ గర్భగుడిని శుద్ది చేసి సుగంధ పరిమళాలతో తయారుచేసిన లేపనంతో ఆలయ గోడలను శుభ్రం చేసి శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ప్రతి ఏటా ఆణివార ఆస్థానం కు ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరుతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోంది. కొత్త వస్త్రంతో స్వామివారిని పూర్తిగా కప్పి వేసి గర్భగుడిని, పూజా సామాగ్రిని సుగంధ ద్రవ్యాల లేపనంతో శుద్ది చేశారు. నిన్న రాత్రే తయారు చేసుకున్న పవిత్ర పరిమళ మిశ్రమంతో అభిషేకించడం వల్ల ఆలయ గోడలకు క్రిమి కీటకాలు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, వేల సంవత్సరాల ఆచారమని టీటీడీ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇందులో భాగంగానే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తరువాత భక్తులను దర్శనానికి అనుతించింది.