Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

వానలో తడిసిన బట్టలను ఉంచుకోలేక, ఆరబెట్టుకోలేక మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. దీంతో వర్షాకాలంలో ఇంటి నిండా ఉతికిన బట్టలే దర్శనమిస్తుంటాయి. వారం రోజులు గడిచినా బట్టలు ఆరవు. తడి బట్టలు అలాగే ధరిస్తే, చర్మం దురద, గాయం, అలెర్జీ వంటి సమస్యలు తప్పవు. ఒక్కోసారి బట్టలు ఆరకుండా ఉంటే వాసన కూడా వస్తుంటాయి.

వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..
Moonsoon Season
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 11, 2023 | 9:20 AM

వర్షాకాలం మొదలతే.. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తుంటాయి. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది. దీంతో ఇంట్లో బట్టలు ఆరబెట్టడం పెద్ద సమస్యగా తయారవుతుంది. స్కూళ్లకు, కార్యాలయాలకు వెళ్లే వారి బట్టలు ఆరబెట్టడం మరింత పెద్ద టాస్క్‌గా మారుతుంది. వానలో తడిసిన బట్టలను ఉంచుకోలేక, ఆరబెట్టుకోలేక మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. దీంతో వర్షాకాలంలో ఇంటి నిండా ఉతికిన బట్టలే దర్శనమిస్తుంటాయి. వారం రోజులు గడిచినా బట్టలు ఆరవు. తడి బట్టలు అలాగే ధరిస్తే, చర్మం దురద, గాయం, అలెర్జీ వంటి సమస్యలు తప్పవు. ఒక్కోసారి బట్టలు ఆరకుండా ఉంటే వాసన కూడా వస్తుంటాయి. అలాంటి వాసనలు వదిలించుకోవటం ఇంకా కష్టం. గ్రామాల్లో అయితే, కొంతమంది కట్టెల పొయ్యి చుట్టు పక్కల వేసి బట్టలు ఆరబెట్టుకుంటారు. చాలా చోట్ల డ్రైయర్లు, కట్టెల పొయ్యిలు లేవు. కొన్ని సాధారణ ఉపాయాలను ఉపయోగించడం ద్వారా, వారు బట్టలను సులభంగా ఆరబెడుతుంటారు. ఇలా చేస్తే బట్టల నుండి వాసన రాకుండా కూడా ఉంటుంది.

వర్షాకాలంలో మీ బట్టలు త్వరగా ఆరబెట్టడానికి ఇలా చేయండి :

• ఉప్పు తేమను గ్రహిస్తుంది అని మనందరికీ తెలుసు. వర్షాకాలంలో మీరు బట్టలు ఆరబెట్టే గదిలో సముద్రపు ఉప్పు లేదా గులకరాళ్ళ బ్యాగ్ ఉంచండి. ఉప్పు గదిలోని తేమను గ్రహించి గది ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీంతో చాలా త్వరగా బట్టలు ఆరిపోతాయి.

ఇవి కూడా చదవండి

• మనం సాధారణంగా బట్టలు ఆరబెట్టడానికి, సర్దుకోవటానికి హ్యాంగర్‌ని ఉపయోగిస్తాము. వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి ఈ హ్యాంగర్లు బాగా ఉపయోగపడతాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ, బట్టలు గాలిలో మాత్రమే ఆరిపోతాయి. కాబట్టి వర్షాకాలంలో హ్యాంగర్ ఉపయోగించడం మంచిది.

• బట్టలు త్వరగా ఆరబెట్టడానికి డ్రైయింగ్ రూమ్‌లో ధూపం వెలిగించండి.

• వర్షాకాలంలో దుస్తులను వాషింగ్ మెషీన్‌లో ఆరబెట్టండి. బట్టలు వేగంగా ఆరబెట్టడానికి వెంటిలేషన్ ప్రదేశంలో ఆరబెట్టండి.

• కాస్త తడిగా ఉన్న బట్టలు కూడా ఫ్యాన్ కింద ఆరేసుకోవటం మంచిది.

వర్షాకాలంలో బట్టలు ఆరకపోతే దుర్వాసన వస్తుంది. బట్టల నుంచి వచ్చే ఇలాంటి వాసనలు చూసి ఇబ్బందిపడే పరిస్థితిని కూడా ఎదుర్కొంటాం. వర్షాకాలంలో బట్టలను సువాసనగా ఉంచేందుకు అనేక రకాల లిక్విడ్‌లు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ కొందరికి అలాంటి ద్రవ వాసన నచ్చదు. బట్టలు నుండి దుర్వాసనను వదిలించుకోవడానికి ఈ కొన్ని ఉపాయాలను ఉపయోగించవచ్చు.

వెనిగర్, బేకింగ్ సోడా ఉపయోగించండి: వంటలో ఉపయోగించే బేకింగ్ సోడా బట్టల నుండి వచ్చే వాసనను తొలగిస్తుంది. మీ డిటర్జెంట్‌తో బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమంతో బట్టలు ఉతకడం వల్ల బట్టలు తాజాగా ఉంటాయి.

నిమ్మకాయ: డిటర్జెంట్‌తో నిమ్మరసం కలుపుకోవడం వల్ల బట్టలు దుర్వాసన రాకుండా చూసుకోవచ్చు. నిమ్మరసం దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది.

కర్పూరం : వర్షాకాలంలో బట్టల మధ్య కర్పూరం ఉంచడం వల్ల బట్టల వాసన పోతుంది. బట్టలు ఆరబెట్టిన చోట సాంబ్రాణి పొగ వేయటం వల్ల బట్టలు కూడా సువాసనగా ఉంటాయి.

వోడ్కా: ఇక, డ్రింకింగ్ వోడ్కాను ఖాళీ స్ప్రే బాటిల్‌లో వేసి బట్టల చుట్టూ స్ప్రే చేయడం వల్ల బట్టల దుర్వాసన పోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..