Bus Accident : పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా.. ఆరేళ్ల చిన్నారి సహా ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు

ఆదివారం పొదిలిలో పెళ్లికూతురు ఇంటిదగ్గర పెళ్లి జరిగింది. మంగళవారం రోజు కాకినాడలో పెళ్ళికొడుకు ఇంటిదగ్గర రిసెప్షన్ (వలిమా). రిసెప్షన్‌ కోసమే బస్సులో బయలుదేరారు పెళ్ళికూతురు తరపు బంధువులు. పెళ్లికూతురు తండ్రి సిరాజ్, పెళ్ళికొడుకు తండ్రి మంజూర్ అహ్మద్ ఇద్దరూ సౌదీలో ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లల పెళ్లి కోసం స్వగ్రామాలకు వచ్చారు.

Bus Accident : పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా.. ఆరేళ్ల చిన్నారి సహా ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు
Bus Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 11, 2023 | 7:10 AM

ప్రకాశం జిల్లా దర్శి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దర్శి దగ్గర సాగర్ కెనాల్ లో అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి, ఓ యువకుడు కూడా ఉన్నాడు. మరో 30 మందికి గాయాలయ్యాయి. పొదిలి నుంచి కాకినాడకు వివాహ రిసెప్షన్ కోసం వెళుతుండగా డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలిసింది. వీరంతా పొదిలిలో సోమవారం జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై కాకినాడలో రిసెప్షన్ కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులో బయలుదేరింది పెళ్లి బృందం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో బోల్తా పడిన బస్సును బయటకు తీశారు.

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నట్టుగా తెలిసింది. బస్సు కింద నీళ్లలో చిక్కుకున్న ఆరేళ్ల పాప షేక్ హీనా మృతదేహం లభించింది. అతి కష్టం మీద పాప మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు. మృతుల్లో పెళ్లికూతురు మేనత్తలు ఇద్దరు, అమ్మమ్మ, మేనత్త కోడలు ఉన్నట్టు తెలిసింది. పొదిలి పెద్ద మసీదు హాఫీజ్ సాబ్ అబ్దుల్ అజీజ్ , ఆయన భార్య, మనవరాలు ఉన్నట్టు గుర్తించారు.

మృతి చెందిన వారి వివరాలు…

ఇవి కూడా చదవండి

1.అబ్దుల్ అజీస్ (65)

2.అబ్దుల్ హాని(60)

3.షేక్ రమిజ్(48)

4.ముల్లా నూర్జహాన్ (58)

5.ముల్లా జానీ బేగం(65)

6.షేక్ షాభినా (35)

7.షేక్ హీనా(6)

ఆదివారం పొదిలిలో పెళ్లికూతురు ఇంటిదగ్గర పెళ్లి జరిగింది. మంగళవారం రోజు కాకినాడలో పెళ్ళికొడుకు ఇంటిదగ్గర రిసెప్షన్ (వలిమా). రిసెప్షన్‌ కోసమే బస్సులో బయలుదేరారు పెళ్ళికూతురు తరపు బంధువులు. పెళ్లికూతురు తండ్రి సిరాజ్, పెళ్ళికొడుకు తండ్రి మంజూర్ అహ్మద్ ఇద్దరూ సౌదీలో ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లల పెళ్లి కోసం స్వగ్రామాలకు వచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..