- Telugu News Photo Gallery Try these amazing tricks to carry tight bangles easily in wrist Telugu News
ఆడవాళ్లకు అదిరిపోయే చిట్కా..! ఇలా చేస్తే చేతులకు గాజులు వేసుకోవటం ఎంత ఈజీనో తెలుసా..?
మహిళలు చాలా ఆలోచించి బ్యాంగిల్స్ ఎంచుకుంటారు. ఎందుకంటే.. కొందరు స్త్రీల చేతులకు గాజులు వేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారి చేతులకు బ్యాంగిల్స్ వేస్తున్నప్పుడు చాలా సార్లు అవి విరిగి పోయి చేతులకు గాట్లు పడుతుంటాయి. రక్తం కూడా వస్తుంది. అలాంటి సందర్భాలలో మీరు కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా నిమిషాల వ్యవధిలో సులభంగా టైట్ బ్యాంగిల్స్‌ను కూడా ఈజీగా ధరించవచ్చు.
Updated on: Jul 10, 2023 | 5:46 PM

మాయిశ్చరైజర్ లేదా ఆయిల్ ఉపయోగించండి : బరువు పెరగడం, చేతులు బిగుసుకుపోవడం వల్ల కొన్నిసార్లు బ్యాంగిల్స్ ధరించడం చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు, మీరు బ్యాంగిల్స్ ధరించే ముందు మీ చేతులకు మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాసుకోవాలి. ఇది కంకణాలు సులభంగా ఎక్కించుకోగలుగుతారు. మణికట్టులోకి సరిపోయే గాజులు మాత్రమే ధరించగలుగుతారు.

సబ్బు రాసుకోవటం కూడా: బ్యాంగిల్స్ బిగుతుగా ఉంటే మీరు సబ్బును కూడా ఉపయోగించవచ్చు. బ్యాంగిల్ ధరించే ముందు మీ చేతులకు సబ్బును బాగా అప్లై చేయండి. ఆ తర్వాత మీరు గాజులు వేసుకున్న వెంటనే సబ్బు మృదుత్వంతో వాటిని మణికట్టులోకి ఈజీగా వెళ్లేలా చేస్తుంది. ఆ తర్వాత మీ చేతులను శుభ్రమైన నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.

పాలిథిన్ బ్యాగ్: చాలా సార్లు ఇంట్లో చేతి తొడుగులు అందుబాటులో ఉండవు, ఈ సందర్భంలో మీరు పాలిథిన్ సహాయం తీసుకోవచ్చు. మీరు కూరగాయలు తెచ్చే పాలిథిన్ బ్యాగ్‌ని ఉపయోగించవచ్చు. దీని కోసం చేతిని పాలిథిన్ కవర్‌లో ఉంచి దానిపై కొంచెం నూనె రాయండి. ఆ తర్వాత బ్యాంగిల్స్‌ను ధరించండి. ఇలా చేస్తే మరింత సులభంగా మీరు గాజులు వేసుకోగలుగుతారు. ఇది అస్సలు బాధపెట్టదు.

ఆడవారు గాజులను ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా మట్టి గాజులంటే చాలా మందికి ఇష్టం. మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది. మట్టి గాజులను ధరించటం వల్ల ఆడవారికి శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

అంతేకాదు..మట్టిగాజులతో ఆరోగ్య పరమైన లాభాలు కూడా అనేకం ఉన్నాయి. మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా మట్టి గాజులు నివారించగలవు. ఆడవాళ్లకు గాజులు అందంతో మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.





























