- Telugu News Photo Gallery Cinema photos Radhe Shyam Fame Riddhi Kumar Beautiful Photos goes viral telugu cinema news
Radhe Shyam: రాధేశ్యామ్ బ్యూటీ రిద్ధి కుమార్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.. తెలుగులోనే ఫస్ట్ మూవీ చేసింది..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఇందులో యంగ్ హీరోయిన్ రిద్ధి కుమార్ కీలకపాత్రలో నటించింది. ఈ సినిమాతో రిద్ధి కుమార్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చారడేసి కళ్లు.. చూడచక్కని రూపంతో ప్రేక్షకులను కట్టిపడేసింది రిద్ధి.
Updated on: Jul 10, 2023 | 5:39 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఇందులో యంగ్ హీరోయిన్ రిద్ధి కుమార్ కీలకపాత్రలో నటించింది.

ఈ సినిమాతో రిద్ధి కుమార్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చారడేసి కళ్లు.. చూడచక్కని రూపంతో ప్రేక్షకులను కట్టిపడేసింది రిద్ధి.

ఈ హీరోయిన్ లవర్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. రిద్ధి కుమార్ కేరళ కట్టి.

రాజ్ తరుణ్ నటించిన లవర్ చిత్రం మొదటి సినిమా కాగా.. ఆ తర్వాత అనగనగా ఓ ప్రేమకథ చిత్రంలో కనిపించింది.

ప్రణయ మీనుకలుడే కాదల్, దండం వంటి సినిమాలతో తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ భాషలలో నటించారు.

రిద్ధి కుమార్ తండ్రి ఆర్మీలో వర్క్ చేస్తుండగా.. తల్లి అడ్వకేట్. ఆమె మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు.

తత్వశాస్త్రంలో బ్యాచిలర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రిద్ధి ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.





























