Tirumala: ఘాట్ రోడ్ల ప్రమాదాల కట్టడికి టీటీడీ పక్కా ప్లాన్.. 6 ప్రమాదకరమైన మలుపులను బ్లాక్ స్పాట్లుగా గుర్తింపు

తిరుమల ఘాట్ రోడ్ ప్రమాదాలకు ఫుల్‌స్టాప్‌ పడేలా టిటిడి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యాక్సిడెంట్ నివారణ కొరకు మహాశాంతి యాగం నిర్వహించిన టిటిడి.. తగు చర్యలు చేపట్టింది. ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించిన పోలీసు యంత్రాంగం.. ప్రమాదాల కట్టడికి పక్కా ప్లాన్ రచించింది.

Tirumala: ఘాట్ రోడ్ల ప్రమాదాల కట్టడికి టీటీడీ పక్కా ప్లాన్.. 6 ప్రమాదకరమైన మలుపులను బ్లాక్ స్పాట్లుగా గుర్తింపు
Ttd Ghat Roads
Follow us
Surya Kala

|

Updated on: Jul 11, 2023 | 7:48 AM

ఘాట్ రోడ్లలో వరుస ప్రమాదాలపై ఫోకస్ చేసింది టీటీడీ. ఆథ్యాత్మిక కొండపై ప్రమాదాలాకు ఇక ఫుల్‌స్టాప్ పడేలా నివారణ చర్యలు చేపట్టింది. తరుచూ యాక్సిడెంట్స్ జరిగే ప్లేస్‌లో మరింత కట్టదిట్టమైన భద్రతా చర్యల కోసం సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు అధికారులు. తిరుమల ఘాట్ రోడ్ ప్రమాదాలకు ఫుల్‌స్టాప్‌ పడేలా టిటిడి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యాక్సిడెంట్ నివారణ కొరకు మహాశాంతి యాగం నిర్వహించిన టిటిడి.. తగు చర్యలు చేపట్టింది. ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించిన పోలీసు యంత్రాంగం.. ప్రమాదాల కట్టడికి పక్కా ప్లాన్ రచించింది. తరుచూ యాక్సిడెంట్స్ జరిగే ప్లేస్‌లో సెక్యూరిటీని పెంచడంతో పాటు నిఘా కట్టుదిట్టం చేసింది. ఇప్పుడు యాక్షన్ టీమ్‌లు, పోలీసు ఔట్ పోస్టులలో పాటు యాక్సిడెంట్ స్పాట్లలో సెక్యూరిటీని పెంచి పక్కా కార్యాచరణతో ప్రమాదాలకు చెక్ చెప్పాలని టిటిడి భావిస్తుంది.

ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రమాదాలతో రక్తసిక్తమవుతున్నాయి తిరుమల రహదారులు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే రెండో ఘాట్ రోడ్డు, తిరుమల నుంచి తిరుపతికి చేరే మొదటి ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరెండు మార్గాల్లో నెలకు సగటున 15కు పైగా ప్రమాదాలు జరిగినట్లు ఘనాంకాలు చెబుతున్నాయి. గత 6 నెలల్లో ప్రమాదాల సంఖ్య దాదాపు సెంచరీకి చేరింది. ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడగా వందలాది మంది యాత్రికులు గాయాలతో బయట పడ్డారు. మొదటి ఘాట్ రోడ్ లో దాదాపు 58 మలుపులు ఉండటం వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. 6 చోట్ల అత్యంత ప్రమాదకరమైన మలుపులు ఉండడంతో బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు అధికారులు. ఈవరుస ప్రమాదాలపై టీటీడీ ఫోకస్ చేసింది. కోవిడ్ తర్వాత సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో పాటు ఘాట్ రోడ్ ప్రయాణంపై అవగాహన లేకపోవడంతో యాక్సిడెంట్స్‌ జరుగుతున్నట్లు గుర్తించారు టిటిడి

ఘాట్‌ రోడ్లల్లో యాక్సిడెంట్స్ జీరో పర్సెంటేజ్‌ కు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టారు. తిరుమలకు వచ్చే యాత్రికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదే విషయంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. ప్రమాదాల నివారణకు కార్యాచరణ తోపాటు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీతో ఉన్నస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించాలని సివిఎస్ఓ ను ఆదేశించారు. ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు వెంటనే వైద్య సేవలు అందేలా యాక్షన్ టీం సిద్దంగా ఉండాలని ఆదేశించారు. స్విమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసు ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కపిలతీర్థం పైభాగంలోని మాల్వాడి గుండం వద్ద రోలర్ పోస్టర్ బ్యారియర్ ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుమలలో ప్రీపెయిడ్ టాక్సీ సేవలు అందించేందుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని కూడా ఆదేశించారు ధర్మారెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..