- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: without discipline success cannot be achieved follow these four rules of chanakya in telugu
Chanakya Niti: క్రమశిక్షణ లేని వ్యక్తి జీవితంలో విజయం దూరం.. సోమరితనం అతిపెద్ద శత్రువంటున్న చాణక్య
ఆచార్య చాణక్య గొప్ప వ్యూహకర్త. ఆర్థికవేత్త. నిజ జీవితంలో మనిషి ఎలా ప్రవర్తించాలో వివరిస్తూ అనేక పుస్తకాలు రాశారు. మానవ జీవితంలోని బంధాలు, రాజ్య పాలన, స్నేహం , శత్రుత్వం ఇలా అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు చాణక్య. ఈ విషయాలు నేటి మానవులకు ఉపయోగం అని పెద్దల విశ్వాసం.
Updated on: Jul 16, 2023 | 3:28 PM

చాణక్యుడి నీతి సూచించినట్లుగా ఈ లక్షణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్న వ్యక్తి జీవితం సుఖ వంతంగా సాగుతుంది. వైవాహిక ధర్మాలను అవలంబించడం వల్ల భార్యాభర్తల మధ్య శాశ్వతమైన, ఆనందకరమైన భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది.

ప్రశాంతమైన ప్రవర్తన కలిగిన స్త్రీ తన కుటుంబంలో సానుకూల మార్పులను తెస్తుంది. ఆమె ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎటువంటి పరిస్థితి ఎదురైనా తన ప్రశాంత చిత్తంతో దానిని ఎదుర్కొంటుంది. మితిమీరిన కోపం హానికరం కాబట్టి అనవసరమైన కోపాన్ని నివారించడం ప్రయోజనకరం.

ఆచార్య చాణక్యుడు ప్రకారం క్రమశిక్షణ లేని వారు జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు విజయవంతం కావాలంటే.. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని వృధా చేయకూడదు. సమయం వృధా చేయవద్దు. క్రమశిక్షణ లేకుండా జీవితంలో విజయం సాధించలేరని అన్నారు.

ఒక వ్యక్తి లక్ష్యాన్ని సాధించడానికి చాలాసార్లు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే వైఫల్యాలు ఎదురైనప్పుడు భయపడవద్దని సూచించారు. విజయాన్ని సాధించే సమయంలో అభ్యసన ప్రక్రియలో అపజయం కూడా ఒక భాగమని, జీవితంలో సరైన లక్ష్యాన్ని పెట్టుకుని దాని కోసం కృషి చేయాలని చెప్పాడు చాణక్య.

సోమరితనంతో చేయాల్సిన పనులను తరచుగా వాయిదా వేస్తారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని చాణక్యుడు సూచించాడు. విజయం సాధించాలంటే సోమరితనం విడనాడాలని అన్నారు. సోమరితనం ఉన్నవారికి విజయం ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పాడు. ఇంకా ఎవరికైనా సోమరితనాన్ని గొప్ప శత్రువుగా ఎత్తి చూపాడు.





























