Spirituality News: సూర్యోదయ సమయంలో నిద్ర లేవమని పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా..
తెల్లవారు జామున నిద్ర లేచి స్నానాదికార్యక్రమాలు పూర్తి చేసుకుని స్వచ్ఛమైన మనసుతో సూర్యభగవానుడికి నమస్కరించాలి. సంవత్సరం పొడవునా సూర్యుడు ప్రకాశిస్తూనే మానవ మనుగడకు జీవాన్ని పోస్తాడు. ఆయన మనకు ఇచ్చే శక్తి రోజంతా మనకి సరిపోతుంది. సూర్య కిరణాలు తాకితే శరీరం ఆత్మ ఉత్సాహాన్ని పొందుతుంది.
కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా నిద్రపోయే సమయం, మేల్కొనే సమయంలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పటి కంటే రెండు మూడు తరాల ముందు పెద్దలు తెల్లవారు జామున నాలుగు గంటలకు నిద్ర లేచి.. సాయంత్రం 7 గంటల సమయంలోనే నిద్రపోయేవారు. అయితే మారిన కాలంలో భాగంగా ఆలోచనలు, అలవాట్లలో వచ్చిన మార్పులతో నిద్రపోయే సమయం, నిద్ర లేచే సమయంలో మార్పులు వచ్చాయి. అందుకనే నేటి తరం వారు ఉదయం మంచి నిద్ర పొందే సమయంగా భావిస్తున్నారు. అలాంటి ఆనందాన్ని త్వరగా నిద్ర లేచి పోగొట్టుకోవడం మూర్ఖత్వం కాదా అని భావిస్తారు. అయితే సూర్యోదయం అయిన తర్వాత కూడా మీరు ప్రశాంతంగా నిద్రపోతే ఏమి జరుగుతుంది? పెద్దలు త్వరగా ఎందుకు నిద్ర లేవాలని భారతీయులు ఎందుకు చెప్పారు అందులోని నిజ నిజాలు ఏమిటో తెలుసుకుందాం..
సూర్యోదయం సమయంలో మేల్కోవడం.. ప్రపంచంలో తెలివైన జంతువు మనిషి. అయితే తెలివితేటలు లేకుండా ప్రవర్తించే వాడు కూడా మనిషే. రూల్స్ పాటించడం మనకోసం కాదు.. పక్కవారి కోసం అని ఆలోచించే వాడు కూడా మనిషే.
సూర్యనారాయణ మూర్తిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజిస్తారు. ప్రపంచానికి చీకటిని పారద్రోలి వెలుగుని అందించేవాడు సూర్యుడు. అందరికీ ఉత్సాహాన్ని, తేజస్సును అందించే సూర్యభగవానుడు భూమిని తాకేవేళ ఆయనకు స్వాగతం పలకడానికి మనం సిద్ధపడాలి. సూర్యోదయ సమయంలో సూర్యభగవానుడుకి నమస్కారం చేస్తూ అర్ఘ్యం సమర్పించడం అత్యంత శ్రేష్టమని.. శారీరక, మానసిక ఆరోగ్య కరమని హిందువుల నమ్మకం.
తెల్లవారు జామున నిద్ర లేచి స్నానాదికార్యక్రమాలు పూర్తి చేసుకుని స్వచ్ఛమైన మనసుతో సూర్యభగవానుడికి నమస్కరించాలి. సంవత్సరం పొడవునా సూర్యుడు ప్రకాశిస్తూనే మానవ మనుగడకు జీవాన్ని పోస్తాడు. ఆయన మనకు ఇచ్చే శక్తి రోజంతా మనకి సరిపోతుంది. సూర్య కిరణాలు తాకితే శరీరం ఆత్మ ఉత్సాహాన్ని పొందుతుంది. సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి అని పెద్దలు చెప్పడంలో ఇదొక కారణం అయితే.. ఇందులో మరో కోణం కూడా ఉంది.
ఉదయాన్నే నిద్రలేచి ఏమి చేయాలో మీరే ప్రశ్నించుకోవాలి. రోజు ఎలా జరుగుతుందని చింతించకుండా ఈ రోజు నేను ఏమి చెయ్యాలి అనేది ముందే నిర్ణయించుకోవాలి. సూర్యోదయం తర్వాత పనులు ప్రారంభించాలి. సమయాన్ని వినియోగించుకోవడం మనిషి కర్తవ్యం. అందుకే “బ్రాహ్మీ ముహూర్తం ఉత్తిష్ఠేత్ స్వస్థో రక్షార్థం ఆయుష: తత్ర సర్వార్థ శాంత్యర్థం స్మరేచ్చ మధుసూదనం” అన్నారు పెద్దలు. అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వలన ఆయుష్షు పెరుగుతుందని, రోగాలను దూరం చేస్తుందని పెద్దల ఉవాచ.
ఎవరైనా ఉదయం లేచి ఏమి చేయాలని అడిగితే, ‘ఏమీ చేయవద్దు’ అని చెప్పండి. లేచి కూర్చోండి. కొంత సమయం తరువాత, నేను ఎవరు .. నేను ఏమి చేయాలి అనే ఆలోచన స్వయంచాలకంగా వస్తుంది. కనుక లేచి మీ పనులు మీరు చేసుకోమని చెప్పండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)