Rakhi 2023: ఈ ఏడాది భద్ర కాల సమయంలో రాఖీ పండగ.. మీ సోదరుడికి రాఖీ కట్టడానికి శుభ సమయం ఎప్పుడంటే

హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ పండుగ ఈ సంవత్సరం ఆగస్టు 30 న జరుపుకోనున్నారు. అయితే రాఖీ పండగ రోజున భద్ర నీడ ఉండడంతో రాఖీ కట్టడంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. భద్ర కాల సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు. ఆగష్టు 30వ తేదీ ఉదయం 10.59 గంటల నుంచి రాత్రి 9.02 గంటల వరకు భద్ర కాలం ఉంది.

Rakhi 2023: ఈ ఏడాది భద్ర కాల సమయంలో రాఖీ పండగ.. మీ సోదరుడికి రాఖీ కట్టడానికి శుభ సమయం ఎప్పుడంటే
Raksha Bandhan
Follow us
Surya Kala

|

Updated on: Jul 17, 2023 | 6:53 PM

హిందూ మతంలో రాఖీ పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఈ పండుగ అన్న చెల్లెల మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున రాఖీ పండగను జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకి రక్షను కట్టి తమ సోదరుడి దీర్ఘాయువు కోసం దేవుడిని ప్రార్థిస్తారు. అదే సమయంలో సోదరులు తమ సోదరీమణులను జీవితాంతం కాపాడుతారని వాగ్దానం చేస్తారు. రాఖీ అనేది కేవలం పట్టు దారం మాత్రమే కాదు, తన సోదరిని కాపాడతానని సోదరుడు చేసిన వాగ్దానం. ఈ సంవత్సరం రాఖీ పండగను ఎప్పుడు జరుపుకోవాలి? రాఖీ కట్టడానికి శుభ సమయం ఎప్పుడు? ఈ రోజు తెలుసుకుందాం..

రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకుంటారంటే?  హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ పండుగ ఈ సంవత్సరం ఆగస్టు 30 న జరుపుకోనున్నారు. అయితే రాఖీ పండగ రోజున భద్ర నీడ ఉండడంతో రాఖీ కట్టడంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. భద్ర కాల సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు. ఆగష్టు 30వ తేదీ ఉదయం 10.59 గంటల నుంచి రాత్రి 9.02 గంటల వరకు భద్ర కాలం ఉంది. కనుక ఈ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం మంచిది కాదు.  అందుకే ఈ భద్ర కాల సమయం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడం శ్రేయస్కరం.

రాఖీ కట్టడానికి శుభ సమయం  ఈ సంవత్సరం ఆగష్టు 30 ఉదయం పౌర్ణమి గడియలు 10:59 నుండి ప్రారంభమై ఆగష్టు 31 ఉదయం 7:5 వరకు ఉంటుంది. ఆగష్టు 31 ఉదయానికి భద్ర కాలం ముగుస్తుంది. అందుకే రాఖీ కట్టడానికి ఈ సమయం బాగుంటుంది. ఆగష్టు 30వ తేదీ ఉదయం భద్ర కాల కారణంగా రాఖీ కట్టరు. మరోవైపు ఆగష్టు 30న రాఖీ కట్టాలనుకుంటే రాత్రి 9.15 గంటల తర్వాత శుభ ముహూర్తం మొదలవుతుంది. ఈ సమయంలో పండుగ  జరుపుకోవచ్చు. అయితే రాఖీని ఆగష్టు 30,  31 వ తేదీ రెండు రోజుల్లో అంటే రెండు రోజుల్లో కట్టవచ్చు. అయితే ఆగష్టు 31వ తేదీ ఉదయం 7.5 నిమిషాల వరకు మాత్రమే రాఖీ కట్టే శుభ సమయం ఉంటుందని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

సోదరుడికి రాఖీ ఎలా కట్టాలంటే  రక్షా బంధన్ రోజున సోదరి సోదరీమణులు ఇద్దరూ ఉపవాసం ఉండాలి. రాఖీ కట్టే ముందు సోదరీమణులు పూజా పళ్ళెం సిద్ధం చేసుకోవాలి. అందులో కుంకుమ, అక్షతలు, హారతి, స్వీట్లు మొదలైనవి ఉంచాలి. సోదరి మణికట్టుకు రాఖీ కట్టే ముందు తమ అన్న దమ్ములకు ముందు నుదుటిపై కుంకుమని పెట్టాలి. ఆపై కుడి చేతికి రాఖీ కట్టి.. సోదరుడికి స్వీట్లు తినిపించి.. ఆపై హారతినివ్వాలి. అన్న అయితే అక్షతలు వేసి దీవించమని కోరాలి. సోదరికి రాఖీ కట్టినందుకు ప్రేమతో తమ శక్తికి తగిన బహుమతిని ఇవ్వాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)