Adhika Sravana Masam 2023: అందుకోసం మరో 30 రోజులు ఆగాల్సిందే.. అధిక శ్రావణ మాసం అంటే శూన్య మాసమేనా..?
Adhika Sravana Masam 2023: ఆషాడం అవగానే శ్రావణం ఎంట్రీతో శుభకార్యాలను గ్రాండ్గా చేసుకునేందుకు జనం ఆసక్తితో ఉంటారు కానీ ఈ ఏడాది ఆషాడం ముగిసిన తర్వాత అధిక శ్రావణ మాసం వచ్చింది.. ఈ అధిక శ్రావణమాసం అంటే ఏమిటి..?
Adhika Sravana Masam 2023: ఆషాడం అవగానే శ్రావణం ఎంట్రీతో శుభకార్యాలను గ్రాండ్గా చేసుకునేందుకు జనం ఆసక్తితో ఉంటారు కానీ ఈ ఏడాది ఆషాడం ముగిసిన తర్వాత అధిక శ్రావణ మాసం వచ్చింది.. ఈ అధిక శ్రావణమాసం అంటే ఏమిటి..? అసలు శ్రావణమాసానికి అధిక శ్రావణ మాసానికి తేడా ఏంటి శుభకార్యాలు యధావిధిగా చేసుకోవచ్చా లేక శుభకార్యాలను నిలిపి వేసుకొని అసలైన శ్రావణమాసం కోసం మళ్లీ 30 రోజులు ఎదురు చూడాల్సిందేనా..!!
ఆషాఢ మాసంలో ఏ శుభకార్యాలు చేయకూడదు. దీంతో జనాలంతా శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. కానీ శ్రావణమాసం ఈసారి అధిక శ్రావణమాసమై వచ్చింది. దీంతో ఈ అధిక శ్రావణ మాసం విశిష్టత ఏంటి..? ఇందులో శుభకార్యాలు చేసుకోవచ్చా లేదా అన్న సందిగ్ధత హిందువులలో నెలకొంది. తెలుగు సంవత్సరాల పంచంగ గణన ప్రకారం సౌరమాన సంవత్సరానికి చాంద్రమాన సంవత్సరానికి 11 రోజుల తేడా ఉంటుంది. ఈ తేడానే మూడేళ్లకోసారి సరిచూచుకుంటే 30 రోజులు సౌరమాన సంవత్సరానికి ఎక్కువ ఉండడంతో ఈ 30 రోజులను అధికమాసంగా పరిగణిస్తారు. మూడేళ్లకోసారి అధికమాసం వస్తూ ఉంది. అయితే శ్రావణమాసం ఎంతో విశిష్టమైనది. ఆ శ్రావణమాసానికి ఈ అధికమాసం తోడవడం 19 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అలాంటి అధిక శ్రావణ మాసమే ఈ ఏడాది వచ్చింది. జూలై 18న ప్రారంభమైన అధిక శ్రావణమాసం ఆగస్టు 16 వరకు ఉండనుంది. ఆ తర్వాత అసలైన శ్రావణమాసం ప్రారంభమవుతుంది.
శ్రావణ మాసానికి అధిక శ్రావణ మాసానికి తేడా ఏంటి అన్న ప్రశ్న అందరి మదిలో ఉంది. అయితే జోడు శ్రావణమాసాలుగా అధిక శ్రావణమాసం ఆ తర్వాత అసలైన శ్రావణమాసం రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ అధిక శ్రావణ మాసాన్ని శూన్యమాసంగానే గుర్తించాలని పండితులు, ఆచార్యులు చెబుతున్నారు. సాధారణంగా శూన్య మాసాల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. అదే తరహాలో ఈ అధిక శ్రావణమాసం ఎంత విశిష్టమైనది అయినప్పటికీ శుభకార్యాలను చేయకూడదని పండితులు చెబుతున్నారు
శ్రావణమాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసంగా చెబుతుంటారు. అందుకే అధిక దైవ కార్యాలకు అధిక ఫలాలు ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ శ్రావణ మాసంలో చేసే దానాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవ అంతా రెట్టింపు ఫలితాలను ఇస్తాయని.. భక్తులంతా ఆధ్యాత్మిక సేవలో తరించాలని సూచిస్తున్నారు. పుణ్య కార్యాలకు అనువైనదిగా అధిక శ్రావణ మాసాన్ని పరిగణించాలని అంటున్నారు.
శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం అంటూ ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేక పూజలను చేస్తూ ఆ శివరూపాన్ని భక్తులు పూజిస్తుంటారు అధికమాసంలో నిజస్రావణ మాసంలా రథాలు గృహప్రవేశాలు పెళ్లిళ్లు ఉపనయనాలు వంటివి పాటించ కూడదు. ఆధ్యాత్మికవేత్తలకు ఆధ్యాత్మిక ధోరణితో ఉండేవారికి ఈ అధికమాసాన్ని ప్రత్యేక మాసంగా చెబుతుంటారు అందుకే ఎక్కువగా సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలని పండితులు చెబుతున్నారు. ఈ అధిక శ్రావణమాసం ఎవరైతే పుణ్య నది స్థానాలు జపహోమాలు పుణ్య దానాలు ఆచరిస్తారు వారికి సాధారణ మాసంలో వచ్చే ఫలితాల కంటే అధిక ఫలితం వస్తుందని ఈ అధికమాసంలో పుణ్యకర్మలు ఆచరించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు.
ఈ 30 రోజుల అధికమాసం ముగిసిన తర్వాత నిజ శ్రావణమాసం ప్రారంభం అవుతుంది. ఆ శ్రావణమాసంలో యధావిధిగా వ్రతాలు, గృహప్రవేశాలు, వివాహాలు, వాస్తు కర్మలు, దేవతా ప్రతిష్ట, యజ్ఞలు వంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు శుభకార్యాలకు నిజ శ్రావణ మాసమే అనువైనదిగా పంచాంగ కర్తలు చెబుతున్నారు.