Horoscope Today (20 July): మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఇలా..

Horoscope Today (20th July): జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు విశ్వసిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కించడంతో పాటు వాటికి పరిహారాలు కూడా సూచిస్తారు జ్యోతిష్య పండితులు. మరి 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today (20 July): మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఇలా..
Horoscope 20th July 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 21, 2023 | 8:42 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): చిన్నపాటి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు పురోగతి చెందుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు విజయవంతం కావచ్చు. ఉద్యోగంలో బాధ్యతలతో పాటు ఆదరణ కూడా పెరుగుతుంది. వృత్తి జీవితం మూడు పూవులు ఆరుకాయలుగా సాగిపోతుంది. వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి చక్కబడే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా కొనసాగుతుంది. దైవకార్యాలు లేక శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం ఏర్పడే అవకాశముంది. కొత్తగా ఒకటి రెండు ఉద్యోగావకాశాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగే అవకాశముంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయం ఆశించిన స్థాయిలో మెరుగుపడు తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవ కాశం ఉంది. డాక్టర్లకు, లాయర్లకు అవకాశాలు బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ నిపుణులకు  మంచి ఆఫర్లు అందుతాయి. మీ ఆలోచనలు, మీ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. వ్యాపారాలు వేగం పుంజు కుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ పరంగాను, కుటుంబ పరంగాను కొత్త బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. మానసి కంగా, శారీరకంగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశముంది. ఇతరులకు మేలు చేకూర్చే పనులు చేస్తారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశాజనకంగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు సహకరిస్తుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో అధికారులు సహచరుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యత లను పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు చాలావరకు పరవాలేదనిపిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, సామర స్యంగా ఉంటుంది కానీ కుటుంబంలో ఒకటి రెండు చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగపరంగా శుభవార్త వినడం జరుగుతుంది. వృత్తి జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వ్యాపారంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కు వగా పురోగతి చెందుతాయి. పెట్టుబడులు పెంచడానికి లేదా విస్తరించడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వితరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది పడటం జరుగు తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపా రంలో నష్టాల నుంచి బయటపడటం జరుగు తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావచ్చు. పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఊపు అందుకుంటాయి. కుటుంబంలో ఒకరి అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): అటు ఉద్యోగ వాతావరణం, ఇటు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతాయి. సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అయ్యే అవకాశముంది. కొత్త ఉద్యోగం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కుటుంబ పరంగా ఒకటి రెండు కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి అను కూలంగా ఉన్నప్పటికీ ఇతరులకు వాగ్దానాలు చేయటం, హామీలు ఉండటం శ్రేయస్కరం కాదు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యో గాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాలలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవకార్యాలలో లేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది.  ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

Note: ఇక్కడ ఇచ్చిన జ్యోతిష్య సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని ఇక్కడ అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.