Horoscope Today (July 19): ఇంటా బయటా మరింత ఒత్తిడి పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

Horoscope Today (19th July): జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించేవారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కించడంతో పాటు వాటికి పరిహారాలు కూడా సూచిస్తారు జ్యోతిష్య పండితులు. మరి 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (July 19): ఇంటా బయటా మరింత ఒత్తిడి పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope 19th July 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 19, 2023 | 6:13 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో మీరు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే, బరువు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లకు, లాయర్లకు తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. సంపాదన పెరిగే అవకాశం ఉంది. తొందరపాటుతనం, దూకుడు తనం తగ్గించుకోవడం మంచిది. అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేస్తారు.

వృషభం (కృత్తిక, రోహిణి, మృగశిర 1,2): బాగా దగ్గర బంధువులకు ఒక శుభకార్యం విషయంలో సహకరించడం జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగ అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఇంటిలో కుటుంబ సభ్యుల నుంచి ఆనందం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్త ఒకటి వింటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ పరంగా కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అధికారులతో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. వృత్తి, వ్యాపారాలలో కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో నియమాలను పాటించడం మంచిది. ఆదాయం చాలావరకు మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత మంచిది. కుటుంబ వ్యవహారాలలో నిర్లక్ష్యం పనికిరాదు. ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన పనులను పూర్తి చేయాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో కొద్దిగా ఒత్తిడి ఉన్నా ఆశించిన సంపాదనకు ఏమాత్రం లోటు ఉండదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడటం జరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఇత రుల పనుల మీద సమయం వృథా చేసుకోవద్దు. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. సహాయ లేదా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితం అనుకూలంగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. చిన్న పనికి కూడా ఒకటికి రెండు సార్లు తిరగ వలసి వస్తుంది. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. డాక్టర్లకు, లాయర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లల వల్ల ఆనందం పొందుతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సమయం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, మంచి ప్రయత్నాలను చేపట్టడం వల్ల శుభ ఫలి తాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగా లలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలకు సంబంధించిన ఒత్తిడి బాగా తగ్గుతుంది. వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ సమస్యలు చాలా వరకు చక్కబడతాయి. వృత్తి జీవితం సాఫీగా సాగి పోతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగే అవకాశముంది. తోబుట్టువులు బాగా కలిసి వస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యక్తి గతంగా కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగటం వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు పర్వాలేదని పిస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో అవరోధాలు ఏర్పడతాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరికి సహాయం చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. రావలసిన డబ్బు, మొండి బాకీలు వసూలవుతాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రశాంత, సానుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు గడిస్తారు. ప్రతి చోటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి.

Note: ఇక్కడ ఇచ్చిన జ్యోతిష్య సమాచారం పూర్తిగా వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని ఇక్కడ అందించామని గమనించగలరు.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే