Marriage Astrology: వైవాహిక జీవితంలో అనూహ్య మార్పులు.. వారు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ! మీ రాశికి ఎలా ఉందంటే..?
Marriage Life Astrology: ఈ నెల 24వ తేదీ నుంచి శుక్ర గ్రహం వక్రించడం జరుగుతుంది. ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న శుక్ర గ్రహం వక్రగతి ప్రారంభించి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కర్కాటక రాశిలో ఈ గ్రహం సెప్టెంబర్ నాలుగవ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తరువాత మళ్లీ సింహ రాశిలోకి ప్రవేశిస్తుంది.
ఈ నెల 24వ తేదీ నుంచి శుక్ర గ్రహం వక్రించడం జరుగుతుంది. ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న శుక్ర గ్రహం వక్రగతి ప్రారంభించి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కర్కాటక రాశిలో ఈ గ్రహం సెప్టెంబర్ నాలుగవ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తరువాత మళ్లీ సింహ రాశిలోకి ప్రవేశిస్తుంది. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగార జీవితం, సుఖ సంతోషాలకు శుక్రుడు కారకుడు. వక్రగతిలో ఉన్న శుక్రుడు ఈ లక్షణాలను పెంచి పెద్ద చేయటం, లేదా భారీగా మార్పులు చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. శృంగార జీవితానికి కారకుడైన శుక్ర గ్రహం వక్రగతి పట్టడం ఏమంత మంచిది కాదు. మేషరాశి నుంచి మీన రాశి వరకు వివిధ రాశుల వారి జీవితంలో మార్పులు తీసుకురావ డానికి శుక్ర గ్రహం కారణం అవుతుంది.
- మేషం: ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో శుక్ర గ్రహం వక్రించటం జరుగుతోంది. దీనివల్ల ప్రేమ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులకు అవకాశం ఉంది. ఇంతవరకు తాము ప్రేమిస్తున్న వ్యక్తుల పట్ల అభిప్రాయం మారటానికి, ప్రేమ వ్యవహారం నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రేమికులతో అపార్ధాలు, విభేదాలు తలెత్తకుండా చూసుకోవాల్సి ఉంది. జీవిత భాగస్వామి పట్ల విపరీతంగా ప్రేమ పెరగటం, కొద్దిగా అతిగా వ్యవహరించటం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి.
- వృషభం: ఈ రాశి వారికి శుక్ర గ్రహం రాశి అధిపతి. ఈ గ్రహం వక్రగతి పట్టడం వల్ల అనవసర పరిచ యాలు లేదా వివాహేతర సంబంధాలు ఏర్పరచు కోవడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగ స్వామి పట్ల విముఖత ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమించిన వ్యక్తులకు దూరం కావటం లేదా వారిని దూరంగా ఉంచడమో జరుగుతుంది. ప్రేమించిన వ్యక్తి ద్వారా మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ప్రేమ వ్యవహారా లలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
- మిథునం: ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో శుక్ర గ్రహం వక్రగతి పట్టడం వల్ల కుటుంబ సంబంధాలు కొద్దిగా ఇబ్బందికి లేదా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వకపోవడం మంచిది. ప్రేమించిన వ్యక్తితో అతిగా వ్యవహరించే సూచ నలు ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. దాంపత్య జీవితంలో ఇతరులు తలదూర్చకుండా చూసు కోవలసిన అవసరం ఉంది.
- కర్కాటకం: ఈ రాశిలో శుక్ర గ్రహం వక్రించి సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో సమస్యలు లేదా ఇబ్బం దులు తలెత్తే అవకాశం ఉంది. వీలైనంతవరకు అప్రమత్తంగా ఉండటం మంచిది. ప్రేమ వ్యవహా రాలలో ఉన్నవారు అభిప్రాయాలు మార్చుకోవ డానికి అవకాశం ఉంది. ప్రేమలో విషయంలో పోటీ వచ్చే అవకాశం ఉంది. దాంపత్య జీవి తంలో ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. కోప తాపాలను తగ్గించుకోవడం మంచిది. శృంగార జీవితానికి అతిగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.
- సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో అంటే శయన స్థానంలో శుక్ర గ్రహం వక్రగతి పట్టడం వల్ల సుఖ సంతోషాలు మరీ ఎక్కువ కావటమో, అసలు ఏదీ లేకపోవడమో జరుగుతుంది. సాధారణంగా దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. ఎడ బాటు ఏర్పడుతుంది. ఒకరిని వదిలి ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.
- కన్య: ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో అనవసర పరి చయాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహా రాలు దారి తప్పడం కూడా జరుగుతుంది. శృంగార జీవితంలో వికృత చేష్టలు పెరగటం, హద్దులు దాటడం వంటివి జరగవచ్చు. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఆధిపత్య ధోరణితో వ్యవహ రించే అవకాశం ఉంది. ప్రేయసి లేదా ప్రేమికుడిని ఎంపిక చేసుకోవడంలో పొరపాటు పడే అవకాశం కూడా ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
- తుల: ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్ర గ్రహం వక్రగతి పట్టడం వల్ల ఈ రాశి వారు తప్పకుండా వ్యసనాలకు గాని, అనవసర పరిచయాలకు గాని అలవాటు పడే అవకాశం ఉంది. సుఖ సంతోషా లను ఎంపిక చేసుకోవడంలో తప్పుదోవ పట్టడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో మితిమీరి వ్యవహరించడానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో మోతాదును మించిన శృంగారం చోటు చేసుకుంటుంది. దాంపత్య జీవితం తప్పకుండా ఒత్తిడికి లోనవుతుంది.
- వృశ్చికం: ఈ రాశి వారు ప్రేమ జీవితంలో మోసపోవడం గాని, ఇతరుల జోక్యం ఎక్కువ కావడం గాని, ప్రేమ వ్యవహారం అకస్మాత్తుగా లేదా అర్ధాంత రంగా బహిర్గతం కావడం కానీ జరుగుతుంది. దీనివల్ల మనస్థాపం చెందే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సుఖాంతం కాకపోవచ్చు. ఈ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు హద్దులు దాటవచ్చు. శృంగార జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది.
- ధనుస్సు: ప్రేమ జీవితంలోనూ, దాంపత్య జీవితంలో ను కొన్ని అసాధారణ మార్పులు చోటు చేసుకో వచ్చు. ప్రేమ జీవితాన్ని ఎంపిక చేసుకోవడంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. లేదా ప్రేమిం చిన వ్యక్తి విషయంలో దురభిప్రాయాలు ఏర్పర చుకునే సూచనలు ఉన్నాయి. ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. శృంగార జీవితంలో ప్రయోగాలు చేయటం జరుగుతుంది. అనవసర పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర గ్రహం వక్రగతి పట్టడం వల్ల ప్రేమ వ్యవహారాలు అకస్మాత్తుగా బయటపడే సూచనలు ఉన్నాయి. ప్రేమికుడు లేదా ప్రేయసి పట్ల అభిప్రాయాలు, ఆలోచనలు మారే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమికుడు లేదా ప్రేయసి విషయంలో తప్పుడు సమాచారం అందే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండటం మంచిది. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు పెరిగే అవకాశం ఉంది. సుఖ సంతోషాలు తప్ప కుండా పెరగటం జరుగుతుంది.
- కుంభం: శుక్రుడి వక్రగతి వల్ల ఈ రాశి వారికి అటు ప్రేమ జీవితంలోనూ, ఇటు వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితో అపార్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇతరుల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరగటం జరుగుతుంది. శృంగార జీవితానికి, సుఖసంతోషాలకు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. వివాహేతర సంబంధాలు, అనవసర పరిచయాలతో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు. అపార్ధాలకు విభేదాలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించడం మంచిది.
- మీనం: ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలలో ఘన విజయం లభించే అవకాశం ఉంది. ప్రేమ భాగ స్వామి పట్ల మోతాదును మించిన అనురాగం అభిమానం ఏర్పడటం జరుగుతుంది. శృంగార జీవితానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సూచనలు ఉన్నాయి. దాంపత్యం జీవితంలో కూడా మితిమీరిన అన్యోన్యత ఏర్పడుతుంది. సుఖ సంతోషాల కోసం కొత్త స్థలాలు కొత్త ప్రదేశాలకు వేట మొదలవుతుంది. విహారయాత్రలు వినోదయాత్రలు చేపట్టడం జరుగుతుంది.
Note: ఇక్కడ ఇచ్చిన జ్యోతిష్య సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని ఇక్కడ అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.