Vastu Tips: పూజగదిలో పొరపాటునైనా ఈ వస్తువులు ఉంచవద్దు.. గొడవలు, ఆర్ధిక ఇబ్బందులను పడతారు..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో కొన్ని ముఖ్యమైన విషయాలపై అత్యంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే.. ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం , సంపద  ఉంటుంది. అదే సమయంలో పూజగదిలో కొన్ని ప్రతికూల విషయాలు ఉంటె ఆ ఇల్లు పేదరికంతో ఇబ్బదులను పడుతుంది.   

Vastu Tips: పూజగదిలో పొరపాటునైనా ఈ వస్తువులు ఉంచవద్దు.. గొడవలు, ఆర్ధిక ఇబ్బందులను పడతారు..
Vastu Tips In Puja Room
Follow us
Surya Kala

|

Updated on: Jul 20, 2023 | 5:17 PM

వాస్తు శాస్త్రం ఇంట్లోని ప్రతి భాగం నిర్మాణానికి,  వస్తువుల ఏర్పాటుకు కొన్ని నియమాలను పేర్కొంది. ఈ నియమాలను ఛాదస్తం అంటూ సరిగ్గా పాటించకపోతే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల పురోగతి ఆగిపోతుంది. పేదరికం, వ్యాధి వంటి ఇబ్బందులు చుట్టుముడతాయి. అయితే ఇంట్లోని పూజ గది లేదా  ప్రార్థనా స్థలం చాలా ముఖ్యమైన ప్రదేశం. దేవతామూర్తులు కొలువై ఉండి పూజలను అందుకునే ఈ మందిర నిర్మాణం, ఏర్పాట్ల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది.

ఇంట్లో పూజగది ఉండడం వల్ల సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఈ పూజగది నిర్మాణంలో గందరగోళం కూడా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో పూజా స్థలానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు పూజగది వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం..

వాస్తుశాస్త్రం ప్రకారం కఠోరమైన రూపాన్ని కలిగి ఉన్న దేవుళ్ళ లేదా దేవతల చిత్రాలను లేదా విగ్రహాలను ఎప్పుడూ పూజా గదిలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు, మనస్పర్థలు పెరుగుతాయి. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. కనుక పూజా గృహంలో ఎల్లప్పుడూ దేవతలు సున్నితమైన రూపంలో చిరునవ్వుతూ ఉండి.. ఆశీర్వదించే విగ్రహాలు, లేదా పటాలు ఉండాలి.

ఇవి కూడా చదవండి

వాస్తుశాస్త్రం ప్రకారం  విరిగిన విగ్రహాలు లేదా చిరిగిన చిత్రాలను పూజగదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఈ లోపం గల విగ్రహాల వలన కలిగే నష్టం చాలా భారీగా ఉంటుంది. ఎల్లప్పుడూ మంచి, అందమైన విగ్రహాలు లేదా దేవుని చిత్రాలను ఉంచండి.

అనేక మంది తమ ఇంట్లోని పూజ గదిలో ఒకే దేవుడికి సంబంధించిన అనేక చిత్రాలు లేదా విగ్రహాలను పూజా మందిరంలో ఉంచుతారు. అయితే ఇలా ఎప్పుడూ చేయకూడదు. ముఖ్యంగా పూజా గదిలో పొరపాటున కూడా రెండు శివలింగాలను ఉంచకూడదు. బొటన వేలు కంటే ఎక్కువ సైజ్ ఉన్న శివ లింగం ఉన్న ఇంటిలోని సంతోషాన్ని, శ్రేయస్సు కోల్పోయి.. ఇబ్బందులు పడుతూ ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)