- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: bad qualities that One should not have or else he or she would never get success in Life
Chanakya Niti: విజయం కోరుకునే వ్యక్తిలో ఉండకూడని చెడు లక్షణాలు.. ఉంటే అపజయాలు తప్పవంటున్న చాణక్య..
Chanakya Niti: మనిషి తన జీవితంలో విజయాలను సాధించాలంటే అతనికి పట్టుదల, కృషి, తాపత్రయం వంటి అనేక లక్షణాలు ఉండాలి. అయితే విజయానికి ఈ లక్షణాలు ఉండడం ఎంత ముఖ్యమో.. కొన్ని రకాల లక్షణాలు ఉండకపోవడం కూడా అంతే ముఖ్యమని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. జీవితానికి సంబంధించి అనేక నీతి సూత్రాలను బోధించిన చాణక్యుడు విజయం సాధించాలనుకునే వ్యక్తిలో ఏయే లక్షణాలు ఉండకూడదని సూచించాడంటే..
Updated on: Jul 20, 2023 | 5:08 PM

చాణక్యుడి నీతిలో స్త్రీ ప్రభావం పురుషుడి విజయానికి దోహదపడుతుందని.. ఆమె గుణాలు ఆమె భర్త ఆనందాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. ఈ లక్షణాలు కుటుంబంలో సుఖ, సంతోషాలతో ఉన్న వాతావరణాన్ని సృష్టిస్తాయి. స్త్రీకి ఈ ఐదు గుణాలు ఉంటే భర్త విజయం సాధిస్తాడని చాణక్యుడి చెప్పాడు.

సహనం అనే గుణం ఉన్న స్త్రీ తన భర్తకు ఎదురైన కష్టాల్లో, నష్టాల్లో అతనికి అండగా నిలుస్తుంది. సహనంతో భర్తకు ఎదురైన కష్టాలను అధిగమించడంలో సహాయపడుతుంది. బాధలు త్వరగా తీరిపోయేలా చేస్తుంది. అటువంటి సహనం కలిగిన స్త్రీ దొరికిన భర్త అదృష్టవంతుడు.



దేవుడి పట్ల భక్తివిశ్వాసాలను కలిగిన స్త్రీ .. భర్తకు అదృష్టవంతురాలిగా పరిగణించబడుతుంది. దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం, భక్తి భర్త అడుగుజాడలను నడిపిస్తుంది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భార్య దారి తప్పకుండా ఈ గుణం కాపాడుతుంది. దేవుడిమీద భయ భక్తులున్న భార్య దొరికిన వ్యక్తి జీవితం శాంతివంతంగా ఉంది. సదా విజయాన్ని పొందుతాడు.





























