Godavari: గోదారమ్మ మహోగ్రరూపం.. ధవళేశ్వరం దగ్గర విశ్వరూపం.. వీడియో.
గోదారమ్మ మహోగ్రరూపం దాల్చింది. రాజమహేంద్రవరం, ధవళేశ్వరం దగ్గర విశ్వరూపం చూపిస్తోంది. గంటగంటకూ వరద ప్రవాహం పెరిగిపోతోంది. దాంతో, పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర వరద ప్రవాహంలో..
గోదారమ్మ మహోగ్రరూపం దాల్చింది. రాజమహేంద్రవరం, ధవళేశ్వరం దగ్గర విశ్వరూపం చూపిస్తోంది. గంటగంటకూ వరద ప్రవాహం పెరిగిపోతోంది. దాంతో, పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర వరద ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ రాజమండ్రి, ధవళేశ్వరంలో మాత్రం అదే ఉధృతి ఉంటుందని అంచనా వేశారు. ఒకవేళ వరద ప్రవాహం మరింత పెరిగితే ఇవాళ మొదటి ప్రమాద హెచ్చరిక చేయనున్నట్టు ప్రకటించారు అధికారులు. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా వరద ఉధృతి మరింత పెరుగుతుందని హెచ్చరించింది. దాంతో, గోదావరి పరివాహక జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. వరద ఉధృతి తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదారమ్మ ఉగ్రరూపంతో ఇప్పటికే కోనసీమ లంక గ్రామాలు, అల్లూరి జిల్లా ఏజెన్సీ గూడాలు నీట మునిగాయ్!. కోనసీమ జిల్లాలో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయ్!. దాంతో, 42 మండలాల్లో రెస్క్యూ టీమ్స్‌ను మోహరించారు అధికారులు. .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

