Viveka Murder Case: ఇంకా ఇన్వెస్టిగేషన్ మిగిలే ఉందంటూ.. సీబీఐ ఫైనల్‌ ఛార్జిషీట్‌పై వైర్‌ వెబ్‌సైట్‌ సంచలన కథనం..

వైఎస్‌ కుటుంబ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. వైఎస్‌ ముత్తాత వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలు.. మొదటి భార్య లక్ష్మి.. రెండో భార్య మంగమ్మ..భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి మొదటిభార్య లక్ష్మీ కుటుంబానికి చెందినవాళ్లు.. రెండో భార్య మంగమ్మ కుటుంబానికి చెందినవాళ్లే వైఎస్‌ఆర్‌, అండ్‌ వైఎస్‌ వివేకా.. భాస్కర్‌రెడ్డికి, వివేకానందరెడ్డికి ముత్తాత ఒకరే అయినప్పటికీ వాళ్ల జేజమ్మలు వేరు.. కాబట్టి జగన్‌, అవినాష్‌.. సవతి మనవళ్లు.. అందుకే వీళ్లిద్దరి మధ్య..విభేదాలు ఉన్నాయని సీబీఐ ఛార్జ్‌ షీట్‌లో చెప్పింది.

Viveka Murder Case: ఇంకా ఇన్వెస్టిగేషన్ మిగిలే ఉందంటూ.. సీబీఐ ఫైనల్‌ ఛార్జిషీట్‌పై వైర్‌ వెబ్‌సైట్‌ సంచలన కథనం..
Viveka Murder Issue
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 23, 2023 | 4:29 PM

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై సీబీఐ ఫైనల్‌ చార్జిషీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 259 మంది సాక్షుల అభిప్రాయాలను సేకరించింది. వివేకా హత్యకు రాజకీయ కారణాలు, కుటుంబ విభేదాలే కారణమని చెప్పింది. అయితే వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ చాలా అంశాలను వదిలేసిందని ద వైర్‌ వెబ్‌సైట్‌ చెబుతోంది..అవేంటో ఇప్పుడు చూద్దాం..

సీబీఐ ఫైనల్‌ ఛార్జిషీట్‌పై వైర్‌ వెబ్‌సైట్‌ సంచలన కథనం..

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు.. ఏపీలో సంచలనం రేపుతోంది..ఈ ఉదంతంపై అధికార ప్రతిపక్షాల మధ్య ఎన్నో ఆరోపణలు, ఎన్నో మాటల యుద్ధాలు జరిగాయి.. ఇలాంటి పరిస్థితుల్లో..సీబీఐ ఫైనల్‌ ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ చేసింది. అయితే అందులో చాలా అంశాలు మిస్సయ్యాయని..సంచలన కథనాన్ని ప్రచురించింది ద వైర్‌ వెబ్‌సైట్‌..

ఇవి కూడా చదవండి

2019 మార్చి 15న వివేకా హత్య.. “సీబీఐ దర్యాప్తు జరపాలని జగన్‌ పిటిషన్‌”

2019 మార్చి 15 అర్ధరాత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు.. అప్పుడు ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు.. సాధారణ ఎన్నికలకు నెల ముందు వివేకా హత్య జరిగింది. టీడీపీ నేతలే వివేకాను చంపారని జగన్‌ ఆరోపించారు.. జగన్‌తో పాటు.. వివేకానంద కుటుంబ సభ్యులు..వివేకా హత్యపై సీబీఐ విచారణ జరగాలని పిటిషన్లు వేశారు.. అయితే అదే సమయంలో.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ..సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా జీవో జారీ చేశారు.. సీబీఐ దర్యాప్తు చేయాలని 2020 మార్చి 11న ఏపీ హైకోర్టు తీర్పు నిచ్చింది. కేసు నమోదుకు 120 రోజులు తీసుకున్న సీబీఐ.. 2021 అక్టోబర్‌లో మొదటి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

“జగన్ సీఎం అయ్యాక”

2020.. ప్రభుత్వం మారింది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అదే సంవత్సరం మార్చి 11న ఏపీ హైకోర్టు వివేకా హత్యకేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు తర్వాత.. కేసు నమోదుకు సీబీఐ 120 రోజులు తీసుకుంది. దర్యాప్తు షురూ చేసిన సీబీఐ 2021 అక్టోబర్లో మొదటి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.. ఎర్ర గంగిరెడ్డి, యాదవ్‌, శ్రీ ఉమాశంకర్‌ దస్తగిరి పేర్లను అందులో నమోదు చేసింది. హత్యకేసులో పలు ఆధారాలను ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌రెడ్డిలు చెరిపేశారని..హత్య, కుట్ర సహా పలు సెక్షన్లు పెట్టిన సీబీఐ.. దర్యాప్తును వైర్‌ వెబ్‌సైట్‌ అనేక ఎపిసోడ్‌లుగా వివరించింది. దర్యాప్తు పూర్తయ్యిందో లేదోనని వైర్‌ వెబ్‌సైట్‌ అనుమానం వ్యక్తం చేసింది.

“ఇంకా మిగిలే ఉన్న ఇన్వెస్టిగేషన్”

వివేకా హత్యకేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ల ప్రకారం దర్యాప్తు పూర్తయ్యిందో లేదో అనుమానమే అంటోది వైర్‌. ఎందుకంటే వాటిలోని చాలా అంశాలకు సమాధానం దొరకాల్సి ఉందని చెబుతోంది..వివేకా హత్య జరిగిన 1558 రోజుల తర్వాత సిబిఐ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది..ఫైనల్‌ ఛార్జ్‌షీట్‌ పరిశీలిస్తే..ఎన్నో అంశాలను సీబీఐ వదిలేసినట్లు తెలుస్తోందని వైర్‌ వర్షన్‌..సీబీఐ ఛార్జ్‌షీట్‌లోని 8వ పేజీలో 14వ పేరాలో.. హత్య కుట్ర వెనక ఉన్న ఉద్దేశాలపై వివరణ ఉంది..

“వివేకా హత్య కడప ఎంపీ సీటుకోసమేన్న సీబీఐ ఛార్జిషీట్‌”

వైయస్ కుటుంబ చరిత్ర అందరికీ తెలిసిందే.. వైఎస్ వివేకా హత్య కడప పార్లమెంట్ సీటు కోసమేనని సీబీఐ ఫైనల్‌ చార్జ్‌షీట్‌లో తేల్చేసింది. వివేకానంద రెడ్డి కడప ఎంపీ సీటును అవినాష్‌కు కాకుండా.. షర్మిలకు ఇప్పిస్తారేమోననే భయంతోనే వివేకాను హత్య చేశారని ఉంది. ఇంత పెద్ద సెన్సేషనల్ మర్డర్ కేసులో సీబీఐ తేల్చింది ఇదా అంటూ వైర్‌ వెబ్‌సైట్‌ కూలంకషంగా ఈ ఉదంతాన్ని స్కానింగ్‌ చేసి చెప్పింది.

“ఛార్జిషీట్‌లో వైఎస్‌ కుటుంబ మూలాల ప్రస్తావన”

2019లో ఎన్నికల కోసం వివేకా యాక్టివ్‌ అయ్యారట. ఛార్జ్ షీట్ లో సీబీఐ చెప్పిన పొలిటికల్ ఫేస్‌లపై వైర్‌ ఫోకస్‌ చేసింది. కొన్ని కారణాల వల్ల ఫైనల్ ఛార్జ్‌షీట్‌లో సీబీఐ వైఎస్‌ కుటుంబ మూలాలను ప్రస్తావించింది. ఛార్జ్‌షీట్‌లోని 16,23 పేరాల ప్రకారం.. 2017లో ఎమ్మెల్సీగా ఓడిపోయిన వివేకా.. 2019 ఎలక్షన్ల కోసం యాక్టివ్‌ అయినట్లు ఉంది.. కానీ కడప ఎంపీ టికెట్‌ను అవినాష్ బదులు షర్మిలకు కానీ.. తనకు కానీ.. విజయమ్మకు కానీ ఇవ్వాలని వివేకా చెప్పారు.. వైయస్ అవినాష్ సమర్ధుడు కాదంటూనే అవినాష్‌కు జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు..దీనిపై వైర్‌ వెబ్‌సైట్‌ ఏమంటోందంటే.. హత్యకు ముందు కొంతకాలం నుంచి వివేకా యాక్టివ్‌ పొలిటీషియన్‌ కాదు. హత్య జరిగిన సమయంలో..అంతకుముందు కొంత కాలం నుంచి వివేకా.. యాక్టివ్‌ పొలిటీషియన్‌ కాదని వైర్‌ అంటోంది. బట్ సీబీఐ మాత్రం వివేకా యాక్టివ్‌ పొలిటీషియన్‌ అని ఛార్జ్‌షీట్‌లో చెప్పింది..

సునీత స్టేట్మెంట్ లో కీలకం

2004 తర్వాత వివేకానంద రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. హత్యకు 15 సంవత్సరాలు ముందు మాత్రమే వివేకా పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నట్లు వైర్‌ చెబుతోంది. దీనికి వివేకా ఒక్కగానొక్క కుమార్తె సునీత ఇచ్చిన స్టేట్‌మెంట్లే ఆధారం. హత్య సమయానికే ..తన తండ్రి పాలిటిక్స్‌లో రిటైర్‌ అయినట్లు రెండుసార్లు సీబీఐకి స్టేట్‌మెంట్లు ఇచ్చారు సునీత.. 2011లో ఓడిపోయాక పాలిటిక్స్‌ నుంచి వివేకా రిటైర్డ్‌ హత్యకు ముందు 8 ఏళ్లపాటు పబ్లిక్‌ మీటింగ్‌ పెట్టని వివేకా.. విజయమ్మ చేతిలో ఓడిపోయాక వివేకాను పట్టించుకోని కాంగ్రెస్..2011లో విజయమ్మ చేతిలో ఓడిపోయాక..వివేక యాక్టివ్‌ పాలిటిక్స్‌ నుంచి రిటైర్‌ అయినట్లు సునీత స్టేట్‌మెంట్ ఇచ్చారు. 2019లో కడప ఎంపీ సీటు కోసం వివేకా సమర్థుడని చాలా మంది తనతో చెప్పినా..తన తండ్రి మాత్రం అప్పటికే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ఆమె స్టేట్‌మెంట్‌ ఇచ్చారట. హత్యకు ముందు..ఎనిమిదేళ్ల పాటు.. వివేకా ఎలాంటి పబ్లిక్‌ మీటింగ్‌ పెట్టలేదు.. 2011లో కాంగ్రెస్‌ నుంచి వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే తన ఆఫీసులో ప్రజలతో కలిశారు..ఆ తర్వాత విజయమ్మ చేతిలో  ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌ వివేకాను పట్టించుకోలేదు.

2019లో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అవినాష్‌ ఎంపీ

2014 ఎన్నికల్లో అవినాష్‌ మెజారిటీ 1.90లక్షల ఓట్లు.2019లో మార్చి 10న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 17నే అభ్యర్థుల వివరాలు ప్రకటించాల్సినప్పటికీ.. మృతి కారణంగా మార్చి 19 న అభ్యర్థుల లిస్టును ప్రకటించారు జగన్. ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే.. అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు.  2014 కడప ఎన్నికల్లో అవినాష్‌కు 1.90 లక్షల మెజారిటీ ఉంది. అలాంటప్పుడు అవినాష్‌ వీక్‌ కాండిడేట్‌ ఎలా అవుతాడని వైర్‌ ప్రశ్నిస్తోంది.

“2019 ఎన్నికల్లో అవినాష్‌ రెడ్డి మెజారిటీ 3.80 లక్షల ఓట్లు”

అవినాష్‌ ఎన్నికల రికార్డు పరిశీలిస్తే.. ఆయన బలమైన అభ్యర్థి అని వైర్‌ వ్యాఖ్యానిస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోను అవినాష్‌ రెడ్డి 3.80 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫ్యాక్షనిస్టు, సీనియర్‌ రాజకీయ నేత ఆదినారాయణ రెడ్డిని సైం ఓడించారు. మొదట కాంగ్రెస్‌లో ఉన్న ఆదినారాయణ రెడ్డి.. టీడీపీలోకి వచ్చి.. ఆ తర్వాత బీజేపీలో చేరారు.

“అవినాష్‌ కోసమే వివేకా ప్రచారం చేశారని సునీత భర్త స్టేట్‌మెంట్‌”

కడప ఎంపీ అభ్యర్థి అవినాషేనన్న వివేకా సోదరి విమల. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి సైతం అవినాష్ రెడ్డి ఎంపీ టికెట్ పై సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి ఎంపీ అభ్యర్థి అంటూ మర్డర్ కి ముందు అవినాష్ కోసమే వివేకా ప్రచారం నిర్వహించినట్టు రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. వివేకానంద రెడ్డి సోదరి విమల సైతం కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డేనని చెప్పినట్టు వైర్‌ అంటోంది. కడప ఎంపీ అభ్యర్థి అవినాషేనని.. అవినాష్‌ కోసమే వివేకానంద రెడ్డి ప్రచారం నిర్వహించారని.. వివేకా సోదరి విమల వైర్‌తో చెప్పారట. అనవసరంగా అవినాస్‌ను ఇబ్బంది పెడుతున్నారని విమల వైర్‌తో అన్నారట. సొంత కుటుంబ సభ్యులే.. వివేకా యాక్టివ్‌ పాలిటిక్స్‌ నుంచి రిటైర్‌ అయ్యారని చెబుతోంటే.. సీబీఐ మాత్రం వివేకా యాక్టివ్‌ పొలిటీషియన్‌ అని చెబుతోంది. కుటుంబ సభ్యులు చెబుతున్న వాటిని సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదని వైర్‌ అడుగుతోంది.

The Wire Viveka Two

వివేకా హత్య ఎపిసోడ్‌లో సీబీఐ చాలా అంశాలను విస్మరించిందని చెబుతున్న వైర్‌ ప్రతి అంశాన్ని ఫోకస్‌ చేసింది. ఛార్జిషీట్‌లో వైఎస్‌ కుటుంబం మూలాలను కూడా ప్రస్తావించింది సీబీఐ.. వైఎస్‌ ముత్తాత ఎవరు. అసలు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, వివేకానంద రెడ్డి.. జేజమ్మ ఎవరు.. ఇవన్నీ ఛార్జ్‌షీట్‌లో వివరించింది.

“2021లో జులైలో పార్టీ స్థాపించిన షర్మిల”

వివేకా హత్య జరిగిన రెండేళ్లకు.. షర్మిల..జగన్‌ నుంచి దూరమయ్యారు.. ఆ తర్వాత.. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిలతో విజయమ్మ కలిశారు. జగన్ షర్మిల మధ్య బేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ షర్మిల తో వివేకానంద రెడ్డి కడప సీటు గురించి మాట్లాడారా లేదా అనే దానికి ఎలాంటి ఆధారం లేదు. రాజ్యసభ సీటు విషయంలో అన్నాచెల్లెలి మధ్య అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. 2021 జులైలో హైదరాబాద్‌లో షర్మిల పార్టీని స్థాపించారు. అయితే..అన్నా చెల్లెలి మధ్య వివేకా ఏం చెప్పారన్నది ఎవరికీ తెలియదు. వివేకాకు కడప ఎంపీ టికెట్ పై ఎలాంటి అభిప్రాయాలున్నా..వాటిని జగన్‌ పట్టించుకోకపోయి ఉండొచ్చు.. ఏదేమైనా.. 2011 పరిణామాల తర్వాత.. వివేకానంద రెడ్డి ఆన్‌స్క్రీన్‌లో లేరని వైర్‌ ఒపీనియన్‌.

“వైఎస్‌ చనిపోయిన తర్వాత జగన్‌ ఓదార్పు యాత్ర కు అవకాశమివ్వని సోనియా”

అప్పట్లో కాంగ్రెస్‌తో నడిచిన వివేకా.. 2008లో అమెరికా నుంచి వచ్చిన నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆ స్థానం నుంచీ పోటీ చేసేందుకు..సోనియాగాంధీ..జగన్‌కు అవకాశం ఇవ్వలేదు.. అదే సమయంలో..వివేకా జగన్‌తో కాకుండా..కాంగ్రెస్‌నే సపోర్ట్‌ చేశారు..దీనికి బదులుగా వివేకాకు ఎమ్మెల్సీ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. అప్పటికే కడప ఎంపీ పదవికి రాజీనామా చేశారు జగన్..కడప ఎంపీ సీటుతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు..

ఈ రెండు స్థానాలపై వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కన్నేశారు.. 2008లోనే అమెరికా నుంచి వచ్చేసిన రాజశేఖర్‌ రెడ్డి..ఈ రెండిట్లో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని.. సోనియాగాంధీని కలవాలని..సునీతతో పాటు కుటుంబమంతా ఢిల్లీ వెళ్లారు. అయితే సోనియా గాంధీ అవకాశం ఇవ్వలేదు.. కానీ..పులివెందుల ఎమ్మెల్యే టిక్కెట్‌ను వివేకాకు ఇచ్చారు సోనియా.. అప్పటికే మంత్రిగా చేసిన వివేకా..వదిన విజయమ్మపై పోటీ చేశారు. వివేకాకు మద్దతుగా ఆయన కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్, మరో అల్లుడు శివప్రకాష్ మద్దతు తెలిపారు. అయితే వదిన చేతిలో ఓడిపోయిన వివేకాను ఆ తర్వాత కాంగ్రెస్‌ పక్కన పెట్టింది.

2017లో ఓటువేసిన ఓటర్‌ స్టేట్‌మెంట్‌ తీసుకోని సీబీఐ

సీబీఐ ఛార్జ్‌షీట్‌లోని 16, 21 పేరాల ప్రకారం.. 2017 ఎమ్మెల్సీ ఎలక్షన్లో శివశంకర్ రెడ్డి పోటీ చేయాలనుకున్నాడు. కానీ జగన్.. వివేకాకు టికెట్ ఇవ్వడంతో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కలిసి వివేకాను ఓడించారనేది సిబిఐ అభియోగం. తన ఓటమికి ఈ ముగ్గురే కారణమని..వివేకానందరెడ్డి ఈ ముగ్గురినీ తిట్టినట్లు ఛార్జ్‌షీట్‌లో చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతే..రాయలసీమ ప్రాంతంలో సాధారణంగానే ఉద్విగ్న పరిస్థితులు ఉంటాయి. రాయలసీమ ప్రాంతంలో అధికారమే సర్వంగా భావిస్తారు. కానీ సీబీఐ ఛార్జిషీట్‌లో 2017లో ఓటు వేసిన ఏ ఒక్క ఓటర్ స్టేట్మెంటూ తీసుకోలేదు. దాదాపు 800 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఏ ఒక్క ఓటర్ స్టేట్మెంట్ కూడా ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చలేదు..మరోవైపు వివేకానంద మీద గెలిచిన బీటెక్ రవిని సైతం సీబీఐ విచారించలేదు. కాబట్టి..వివేకా హత్యకు రాజకీయ ఉద్దేశ్యాలే కారణమంని సీబీఐ ఎలా చెబుతుందని వైర్‌ వెబ్సైట్‌ క్వశ్చన్.. ఇలాంటి ఆధారాలు లేకుండానే హత్యానేరం ఎలా మోపారు..

సీనియర్‌ లీడర్‌ తిట్టారని ఎవరైనా హత్య చేస్తారా..?

ఎన్నికల ముందు ఎవరైనా హత్యకు పాల్పడతారా..? 2014, 2019 ఎన్నికల్లో అవినాష్‌ మెజారిటీ లక్షల్లో.. ఎంతో అనుభవమున్న ఒక రాజకీయ నేత తిట్టారని..హత్య చేస్తారా..2019లో వివేకా హత్యకు గురయ్యారు. అప్పుడు ఎన్నికల హడావిడి…ఎన్నికలు ముందు పెట్టుకుని..ఎప్పుడో రెండేళ్ల కింద తమను తిట్టాడని..ఏ లీడర్‌ అయినా హత్యకు పాల్పడతారా.. 2014, 2019 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారనే విషయాన్ని సిబిఐ మరిచిపోయింది. సీబీఐ ఛార్జ్‌షీట్‌ ప్రకారం..భాస్కర్ రెడ్డి కుటుంబం ఎప్పుడో రాజకీయాల్లో ఉండాలని అనుకున్నారు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి వారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానివ్వలేదు. అదే టైమ్‌లో..తమ్ముడు వివేకా కుటుంబాన్ని రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు. దీంతో వైయస్ కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి, వివేకా కుటుంబాలే ఆధిపత్యం చెలాయించేవి.. ఇది అందరికీ తెలిసిన విషయమేనని వైర్‌ చెబుతోంది..

“Ys ఫ్యామిలీ ట్రీ గీసిన సిబిఐ “

వైఎస్‌ కుటుంబ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. వైఎస్‌ ముత్తాత వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలు.. మొదటి భార్య లక్ష్మి.. రెండో భార్య మంగమ్మ..భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి మొదటిభార్య లక్ష్మీ కుటుంబానికి చెందినవాళ్లు.. రెండో భార్య మంగమ్మ కుటుంబానికి చెందినవాళ్లే వైఎస్‌ఆర్‌, అండ్‌ వైఎస్‌ వివేకా.. భాస్కర్‌రెడ్డికి, వివేకానందరెడ్డికి ముత్తాత ఒకరే అయినప్పటికీ వాళ్ల జేజమ్మలు వేరు.. కాబట్టి జగన్‌, అవినాష్‌.. సవతి మనవళ్లు.. అందుకే వీళ్లిద్దరి మధ్య..విభేదాలు ఉన్నాయని సీబీఐ ఛార్జ్‌ షీట్‌లో చెప్పింది. భాస్కర్‌ రెడ్డి సోదరి కుమార్తె భారతిని జగన్‌ వివాహం చేసుకున్నాక..రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని.. ఈ పెళ్లితో విభేదాలు తగ్గాయని సీబీఐ అంటోంది..

‌”వైఎస్‌ మరణం తర్వాత అధికారం కోసం పాకులాడిన వివేకా”

రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వివేకాతో పాటు నర్రెడ్డి కుటుంబం అధికారం కోసం పాకులాడాయి. కానీ జగన్ వెంట నిలిచింది మాత్రం జగన్ భార్య భారతి, భాస్కర్ రెడ్డి కుటుంబం మాత్రమే. జగన్ జైల్లో ఉన్న సందర్భంలో.. పదేళ్ల కష్టకాలంలో వెన్నంటి నడిపించింది భాస్కర్‌ రెడ్డి కుటుంబమే..‌

“పాలిటిక్స్ నుంచి రిటైర్‌ అయ్యాక వివేకా”

ఎక్కువగా పులివెందులలోనే ఉండేవారు.. ఆయనకు హార్ట్‌ ఆపరేషన్‌ జరిగి ఆర్నెళ్లు కూడా కాకముందే.. హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తె దగ్గరికి వెళ్లిపోయింది వివేకా భార్య. సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే సునీత వివేకా దగ్గర ఉండేవారు..నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి వివేకాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి తరచూ కలుస్తుండేవారు..ఇదీ సీబీఐకి సునీత ఇచ్చిన వాంగ్మూలం.. 2011 నుంచి తన తండ్రితో తనకు అంత సఖ్యత లేదని సునీత సీబీఐకి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.. వివేకా రెండో భార్యనంటూ షమీం అనే మహిళ బయటకొచ్చాక..నాన్నతో దూరంగా ఉంటూ వచ్చాను.. ఏడాదిలో ఒకటి రెండు రోజులు మాత్రమే నా తండ్రిని కలిసేదాన్ని అంటూ సునీత ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఉంది. షమీం గురించి తెలిశాక..వివేకా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.

నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డి రెండు మూడు సార్లు బెదిరించినట్టు షమీం సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చింది. 2011లో అక్బర్ షేక్ గా పేరు మార్చుకున్న వివేకా..షమీంను తన భార్యగా ఇంట్లో వారికి పరిచయం చేశారు.. అప్పటి నుంచీ వివేకా కుటుంబంలో వివాదాలు తారస్థాయికి వెళ్లాయి. షమీం స్టేట్మెంట్ ప్రకారం వివేకా తనని బాగా చూసుకున్నారని చెప్పింది. 2018 హార్ట్ సర్జరీ తర్వాత షమీంతో పాటు తన కొడుకుకు ఏమి చేయలేకపోతున్నానని వివేక బాధ పడినట్లు షమీం ఇచ్చిన రికార్డుల్లో ఉంది. తన కొడుకుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తానని చెప్పారు.. ఒక ఇల్లు కట్టించడంతోపాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసి వ్యవసాయ భూమిని తన కొడుకు మీద రాస్తానని వివేక చెప్పినట్టు సీబీఐ ఎదుట షమీం స్పష్టం చేసింది. షమీం స్టేట్మెంట్ ప్రకారం వివేకా మరణానికి కొన్ని రోజులు ముందే..ఆయనకు చెక్ పవర్ తొలగించారు. దీంతో, వివేకా తీవ్ర ఆందోళనకు గురయ్యారు..

“చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వివేకా”

వివేకా కేర్ టేకర్ రాజశేఖర్ స్టేట్మెంట్ ప్రకారం..ఆర్ధిక ఇబ్బందులతో వివేకానంద రెడ్డి ఆందోళన చెందినట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల..దస్తగిరి సునీల్ యాదవ్ లతో వివేకా ఎక్కువగా వ్యాపార లావాదేవీలు నిర్వహించారు..ఫైనాన్షియల్‌ టెన్షన్స్‌తో..వివేకా మోతాదుకు మించిన మద్యాన్ని సేవించేవారు. కొన్ని సందర్భాల్లో ఎర్ర గంగిరెడ్డి పై తీవ్రంగా తిట్టేవారు.. వివేకా ఎంత తిట్టినా సరే.. గంగి రెడ్డి మాత్రం వివేకాతోనే తిరిగేవాడు. కొన్ని సందర్భాల్లో..ఫుల్‌ ప్రెజర్‌తో, టెన్షన్‌తో వివేకా నేలమీదే పడుకునేవారని..కేర్‌టేకర్‌ రాజశేఖర్‌ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు. వివేకా ఆర్థిక పరిస్థితి గురించి పులివెందులలో చాలామందికి తెలుసు. 8 మంది దగ్గర నుంచి సుమారు ఐదు కోట్ల రూపాయలు వివేక అప్పుగా తీసుకున్నారు. అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్టరీ కోసం నాలుగు కోట్లు వివేకా ఖర్చు పెట్టారని వైర్‌ వెబ్‌సైట్‌ డీటైల్డ్‌గా చెబుతోంది.

“క్రెడిట్‌ స్కోర్‌ కోసం నాన్నకు చెక్‌ పవర్‌ తీసేశామన్న సునీత”

తన తండ్రికి క్రెడిట్‌ స్కోర్‌ లేనందు వల్ల.. తమకు క్రెడిట్‌ కార్డు రావడం లేదని..అందుకే కొన్ని మార్పులు చేయాలనుకుని..నాన్నకు చెక్‌ పవర్‌ తీసేశాము.. అయినా తన తండ్రి పేరు మీద 50 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి.. తన తండ్రితో పాటు..తన భర్త నిర్వహిస్తున్న వ్యాపారాలకు తాను డైరెక్టర్‌గా ఉన్నానని సునీత సీబీఐకి చెప్పారు .అయితే, వివేకానంద తర్వాత తన భర్త పేరును డైరెక్టర్ హోదా నుంచి తొలగించారు సునీత.. వివేకాకు డబ్బు అవసరమైతే నర్రెడ్డి శివ ప్రసాద్ తో పాటు రాజశేఖర్ ఇచ్చేవారు. వివేక పేరు మీద ఉన్న 93 ఎకరాలను సునీత.. సౌభాగ్యమ్మ పేరు మీదకి మళ్లించారు. ఇక, షమీం డబ్బు కావాలని.. ఎప్పుడూ తమని సంప్రదించలేదని సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.

“డ్రైవర్‌ దస్తగిరి, వాచ్‌మెన్‌ రంగన్న స్టేట్‌మెంట్లోనే దర్యాప్తు”

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే..మొదటి నుంచీ వైయస్ ఫ్యామిలీ క్రిస్టియన్ రెడ్డీస్ గా కన్వర్ట్ అవ్వడంతో అటు టిడిపి ఇటు బిజెపి వారిపై విమర్శలు చేస్తూ వచ్చేది. వీరికి క్రిస్టియానిటీ నుంచీ ఫండ్స్ ఎక్కువగా వస్తున్నాయని విమర్శలు చేసేవారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. యుఎస్ పౌరుడు కావటంతో ఆ సమస్యను పక్కకు పెట్టారు. సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న అంశాలు.. చేసిన ఆరోపణలు చూస్తే కుటుంబ కలహాలు, ఎదుగుదల అడ్డుకోవడమే హత్యకు ప్రధాన కారణాలుగా సిబిఐ అభియోగాలు మోపింది.. కేసు మొత్తాన్ని సీబీఐ డ్రైవర్‌ దస్తగిరి..వాచ్‌మెన్‌ రంగన్న స్టేట్మెంట్లతోనే దర్యాప్తు చేసింది. కానీ వారు నిజం చెబుతున్నారని గ్యారంటీ ఏంటి.?? కేసు మొత్తాన్ని కుటుంబ విభేదాలు కేంద్రంగానే దర్యాప్తు చేసింది తప్ప వివేక హత్య లో బయట వారి ప్రమేయం ఏంటనేది సీబీఐ వెలికి తీయలేకపోయింది.ఎందుకు అనేది వైర్‌ వెబ్‌సైట్‌ ప్రశ్నిస్తోంది..సీబీఐ ఫైనల్‌ ఛార్జ్‌షీట్‌లోని అంశాలను ప్రస్తావించిన..వైర్ వెబ్‌సైట్‌ సెకండ్‌ ఎపిసోడ్‌లో మరిన్ని అంశాలతో వివరాలు చెబుతానంటోంది. థి వైర్ చెప్తున్న అనుమానాలకు సిబిఐ , సునీత ఎం చెపుతారో చూడాలి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఊరూరా తిరుగుతూ.. జోలెపట్టి బిక్షాటన చేసిన మాజీ మంత్రి..
ఊరూరా తిరుగుతూ.. జోలెపట్టి బిక్షాటన చేసిన మాజీ మంత్రి..
తెలంగాణలో కేదారనాథ్ తరహా ఆలయ నిర్మాణం
తెలంగాణలో కేదారనాథ్ తరహా ఆలయ నిర్మాణం
ఇలాంటి దరిద్రపు ఫోటోషూట్స్ చేస్తే.. ఊరుకుంటారా.! గూబ గుయ్యామందిగా
ఇలాంటి దరిద్రపు ఫోటోషూట్స్ చేస్తే.. ఊరుకుంటారా.! గూబ గుయ్యామందిగా
సూపర్ హిట్ బూమర్ అంకుల్.. తెలుగులోకూ వస్తున్నాడు..
సూపర్ హిట్ బూమర్ అంకుల్.. తెలుగులోకూ వస్తున్నాడు..
నన్ను కూడా లైంగికంగా వేధించారు! క్యాస్టింగ్ కౌచ్ పై హీరో కామెంట్స
నన్ను కూడా లైంగికంగా వేధించారు! క్యాస్టింగ్ కౌచ్ పై హీరో కామెంట్స
ఇట్స్‌ అఫీషియల్.! హార్దిక్‌ను వదిలి అర్థరాత్రి వెళ్లి పోయిన భార్య
ఇట్స్‌ అఫీషియల్.! హార్దిక్‌ను వదిలి అర్థరాత్రి వెళ్లి పోయిన భార్య
హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కత్తి పోట్లు.. వీడియో వైరల్..
హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కత్తి పోట్లు.. వీడియో వైరల్..
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..