AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి.. ఔషధ పంట పండిస్తూ ఏడాదికి రూ. కోట్లు సంపాదిస్తున్న యువకుడు

ఔషధ మొక్కల పెంపకం ద్వారా మంచి సంపాదన వస్తుండడంతో.. ఏకంగా ఓ యువకుడు తన  ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు. కలబంద సాగు కోసం ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదులుకుని గ్రామానికి వచ్చి రైతుగా సేద్యం చేయడం ప్రారంభించిన అలాంటి ఒక రైతు గురించి ఈ రోజు మనం  తెలుసుకుందాం.. 

Success Story: ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి.. ఔషధ పంట పండిస్తూ ఏడాదికి రూ. కోట్లు సంపాదిస్తున్న యువకుడు
Success Story
Surya Kala
|

Updated on: Jul 23, 2023 | 2:46 PM

Share

వ్యవసాయం చేయడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు తప్పవు.. పంట దిగుబడి రాదు.. వచ్చిన దిగుబడికి తగిన గిట్టుబాటు ధర ఉండదని ఎక్కువమంది అనుకుంటారు. అయితే సాంప్రదాయ పంటలకు బదులు ఔషద మొక్కలు శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే లక్షల్లో కాదు ఏకంగా కోట్లలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఔషధ మొక్కల పెంపకం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్న రైతులు అనేక మంది మన దేశంలో  ఉన్నారు. ఔషధ మొక్కల పెంపకం ద్వారా మంచి సంపాదన వస్తుండడంతో.. ఏకంగా ఓ యువకుడు తన  ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు. కలబంద సాగు కోసం ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదులుకుని గ్రామానికి వచ్చి రైతుగా సేద్యం చేయడం ప్రారంభించిన అలాంటి ఒక రైతు గురించి ఈ రోజు మనం  తెలుసుకుందాం..

రైతుగా మారిన ఇంజనీర్ పేరు హరీష్ ధందేవ్. రాజస్థాన్ నివాసి. హరీష్ ధందేవ్ మొదటి ప్రభుత్వ ఇంజనీర్.  జైసల్మేర్ మున్సిపల్ కౌన్సిల్‌లో జూనియర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతని మనస్సు ఉద్యోగం చేయడంలో నిమగ్నమై లేదు. అందుకే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి గ్రామానికి వచ్చి కలబంద సాగు మొదలు పెట్టాడు. ఈ నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం కలబంద అమ్మి లక్షాధికారి కాదు ఏకంగా కోటీశ్వరుడయ్యాడు.

కలబంద వ్యవసాయం 

ఇవి కూడా చదవండి

తాను ఓ రోజు ఢిల్లీలో వ్యవసాయ ఎగ్జిబిషన్‌కు వెళ్లానని హరీష్ ధందేవ్ చెప్పాడు. ఎగ్జిబిషన్‌కు వెళ్లిన తర్వాత తనకు ఉద్యోగం అంటే మరింత విరక్తి కలిగిందని చెప్పాడు హరీష్ ధందేవ్. దీంతో తన వ్యవసాయ కలను నెరవేర్చుకునేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనంతరం జైసల్మేర్‌లోని స్వగ్రామానికి వచ్చిన తర్వాత 120 ఎకరాల్లో కలబంద సాగును ప్రారంభించాడు. వాస్తవానికి రాజస్థాన్‌లోని చాలా మంది రైతులు మిల్లెట్, మొక్కజొన్న, గోధుమ వంటి సాంప్రదాయ పంటలను సాగు చేస్తారు. అయితే హరీష్ ధందేవ్ మాత్రం తాను సాంప్రదాయ పంటలకు బదులు ఔషధ పంటలు పండించాలని నిర్ణయించుకున్నాడు. నేడు కలబంద సాగు చేస్తూ రైతుగానే కాదు పారిశ్రామికవేత్తగా కూడా మారాడు.

కలబంద పంటను నేరుగా కొనుగోలు చేసే వ్యాపారులు 

విశేషమేమిటంటే హరీష్ ధందేవ్ అలోవెరాలోని బార్బీ డెనిస్ అనే ఒకే ఒక రకాన్ని మాత్రమే పండిస్తున్నాడు.  ఈ రకమైన అలోవేరాకు హాంకాంగ్, బ్రెజిల్, అమెరికాలో ఫుల్ డిమాండ్ ఉంది. బార్బీ డెనిస్ కలబందను లగ్జరీ కాస్మెటిక్స్ ఉత్పత్తులలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. దీంతో వ్యాపారులు హరీష్ ధందేవ్ పొలాల్లో పండించిన కలబంద పంటను నేరుగా కొనుగోలు చేస్తున్నారు.

వార్షిక టర్నోవర్ 2-3 కోట్లు

జైసల్మెర్సే జిల్లాలోనే నేచురల్‌ ఆగ్రో పేరుతో హరీష్‌ సొంతంగా కంపెనీని ప్రారంభించాడు. 80 వేల కలబంద మొక్కలతో వ్యవసాయం ప్రారంభించాడు హరీష్. ఇప్పుడు ఆయన పొలంలో లక్షల్లో కలబంద మొక్కలు నాటారు. హరీష్ ధందేవ్ తన పొలంలో పండిస్తున్న అలొవెరాను పతంజలికి అధికారిక సరఫరాదారు. దీని వల్ల అతని కంపెనీ చాలా లాభపడుతోంది. ఇప్పుడు ధన్‌దేవ్ గ్లోబల్ గ్రూప్‌ను నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా అలోవెరాను ఎగుమతి చేస్తూ మిలియనీర్ రైతుగా మారాడు. ఇప్పుడు హరీష్ ధందేవ్ వార్షిక టర్నోవర్ రూ.2-3 కోట్లకు చేరుకుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..