Andhra Pradesh: నేను బీజేపీలోనే ఉంటా, మా నాన్న వ్యాఖ్యలతో సంబంధం లేదు: బైరెడ్డి శబరి
బీజేపీ నేత, కేంద్రమంత్రి గట్కారిపై బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన కూతురు శబరి హాట్ కామెంట్స్ చేశారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గట్కరిని రాయలసీమ ద్రోహి అని రాయలసీమకు గట్కారి ఏమీ చేయలేదని చేసిన వ్యాఖ్యలపై బైరెడ్డి శబరి స్పందించారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి...
బీజేపీ నేత, కేంద్రమంత్రి గట్కారిపై బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన కూతురు శబరి హాట్ కామెంట్స్ చేశారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గట్కరిని రాయలసీమ ద్రోహి అని రాయలసీమకు గట్కారి ఏమీ చేయలేదని చేసిన వ్యాఖ్యలపై బైరెడ్డి శబరి స్పందించారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. తన తండ్రి రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పుకొచ్చింది.
తన తండ్రి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన తండ్రి రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలను తనపై ఆపొదించొద్దని చెప్పుకొచ్చిన శబరి.. తాను మాత్రం బీజేపీ పార్టీ కోసమే పని చేస్తున్నానని, పార్టీ కోసమే ఉంటానని స్పష్టం చేశారు. అంతేకాకుండా తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్న శబరి.. తాను రాజకీయం మొదలు పంట్టింది బీజేపీలోనేని, బతికున్నంత కాలం బీజేపీతోనే తన ప్రయాణం అని తేల్చి చెప్పారు. తాను పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తున్నా అని చెప్పకొచ్చాచరు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..