Andhra Pradesh: ఆరు నెలలకే నోబెల్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న బుడ్డోడు.. ఇంతకీ ఏం చేశాడనేగా
పుట్టిన ఆరు నెలలకు తల్లితండ్రులను గుర్తుపట్టడమే కొంత కష్టంగా ఉండే ఆ వయసులో చూసింది చూసినట్టు టక్కున గుర్తుపట్టేస్తున్నాడు ఈ బుడతడు ఆరు నెలలకే అపర మేధావిలాగా తయారైన ఈ బుడతడి వీడియోకి నోబెల్ వరల్డ్ రికార్డ్ అవార్డు లభించింది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలోని శాస్త్రి నగర్ కు చెందిన పవన్ కుమార్ సౌమ్య అనే దంపతుల కు 6 నెలల ప్రజ్వల్ అనే చిన్నారి ఉన్నాడు. ఈ బుడతడు తన తల్లి చూపించిన జంతువులు, పండ్లు, వాహనాలు, పక్షులు, కూరగాయలు, అంకెల ఫోటోలను టక్కున గుర్తిస్తుండడంతో తల్లి తన చిన్నారి వీడియోను తీసి నోబెల్ వరల్డ్ రికార్డ్ వారికి పంపించింది...
ఆరు నెలల వయసున్న ఓ బుడ్డోడు ఏం చేస్తుంటాడు. ఏముంది హాయిగా ఆడుకుంటూ, ఏ బెంగ లేకుండా ఉంటాడు అంటారా.? అయితే ఓ కుర్రాడు మాత్రం ఆరు నెలల వయసులోనే ఏకంగా నోబెల్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఆరు నెలల బుడ్డోడు ఏంటి.? నోబెల్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకోవడం ఏంటని.? ఆశ్చర్యపోతున్నారా.? అవును నిజమే ఆరు నెలల బుడ్డోడు అపర మేధావిలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు అంతలా ఏం చేశాడు, నోబెల్ వరల్డ్ రికార్డ్ ఎందుకు వరించింది.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
పుట్టిన ఆరు నెలలకు తల్లితండ్రులను గుర్తుపట్టడమే కొంత కష్టంగా ఉండే ఆ వయసులో చూసింది చూసినట్టు టక్కున గుర్తుపట్టేస్తున్నాడు ఈ బుడతడు ఆరు నెలలకే అపర మేధావిలాగా తయారైన ఈ బుడతడి వీడియోకి నోబెల్ వరల్డ్ రికార్డ్ అవార్డు లభించింది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలోని శాస్త్రి నగర్ కు చెందిన పవన్ కుమార్ సౌమ్య అనే దంపతుల కు 6 నెలల ప్రజ్వల్ అనే చిన్నారి ఉన్నాడు. ఈ బుడతడు తన తల్లి చూపించిన జంతువులు, పండ్లు, వాహనాలు, పక్షులు, కూరగాయలు, అంకెల ఫోటోలను టక్కున గుర్తిస్తుండడంతో తల్లి తన చిన్నారి వీడియోను తీసి నోబెల్ వరల్డ్ రికార్డ్ వారికి పంపించింది.
ఈ నెల 19న వీడియోను నోబెల్ ఓల్డ్ రికార్డు సంస్థకు పంపగా ప్రజ్వల్ వీడియోలు చూసిన సదరు సంస్థ ప్రతినిధులు ఆ చిన్నారికి 29వ తేదీన ఆన్ లైన్‌లో నోబెల్ వరల్డ్ రికార్డ్ అవార్డును పంపించారు. ఆరు నెలలకే ఈ అవార్డు సాధించిన బుడతడి అమోఘమైన తెలివితేటలు చూసి చుట్టుపక్కల వారందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆరు నెలలకే వరల్డ్ రికార్డ్ సాధించాడంటే ఈ బుడతడు రాను రాను మరిన్ని రికార్డులు కొల్లగొడతాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తమ చిన్నారికి వచ్చిన ఈ అవార్డుతో తల్లిదండ్రులు మంచి జోష్ లో ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..