West Godavari: 96 ఏళ్ల వయసులో సెంచరీ కొడతానంటున్న బామ్మ.. బ్యాట్‌ పట్టిందంటే దుమ్ము దుమారమే..!

Nidamarru: ఆ గ్రామం లో అత్యంత పెద్ద వయసు వ్యక్తి ఈమే. దాదాపు 50 ఏళ్ల క్రితమే రాత్రి భోజనం మానేసింది. కేవల టిఫిన్ మాత్రమే తింటుంది. ఇప్పటికీ కంటి చూపు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి ఆ కుటుంబంలో నాలుగు తరాల వారిని చూసింది. ప్రతి రోజు ఆమె ఉంటున్న వీధిలో అటూ ఇటూ నాలుగు కిలోమీటర్లు నడుస్తుంది. ఈమె ఆరోగ్యం పై అక్కడి ప్రజల్లో రోజు చర్చ నీయాంశంగా మారుతుంది.

West Godavari: 96 ఏళ్ల వయసులో సెంచరీ కొడతానంటున్న బామ్మ.. బ్యాట్‌ పట్టిందంటే దుమ్ము దుమారమే..!
Grandma Playing Cricket
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 31, 2023 | 8:28 AM

ఏలూరు,జులై31: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ పెద్దవాళ్లు మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులంటూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. మనమల్ని, మనుమరాళ్లను ఎత్తుకుని ఆడించాలని ఉన్నా శరీరం సహకరించడం లేదంటారు. మరికొందరికైతే చాదస్తం పెరిగి పిల్లలు ఆడుకుంటున్నా అల్లరి చేస్తున్నారంటూ తిట్టి పోస్తుంటారు. కాని ఇదిగో ఈ బామ్మను చూడండి. పేరు దొంగ సుబ్బమ్మ. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం, అడవికొలను గ్రామం. ఈమె వయసు 96 ఏళ్ళు అయినా రోజూ వాకింగ్ చేస్తుంది. కళ్లద్దాలు అవసరం లేదు. చక్కగా పిల్లలతో ఆటలాడుకుంటుంది. ఇప్పటికీ ఎటువంటి అనారోగ్యం లేదు. ఈరోజు ల్లో ఎక్కువ మందిలో కనిపించే షుగర్, బీపీ వంటి సమస్యలు అసలే లేవు.. అందరిలాగ అన్ని ఆహార పదార్దాలు తింటుంది.

ఒంటిపూట భోజనం..

సుబ్బమ్మ ఆహార నియమాలు పాటిస్తుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ ఈమె ఆహారపు అలవాట్లు. ఉప్పు కారం అందరిలానే తింటుంది. ఈమెకు పిల్లలు లేరు. దాదాపు 40 ఏళ్ళ క్రితమే భర్త చనిపోయాడు. చిన్నప్పటి నుంచి పెంచిన ఇద్దరు మేనళ్లులు వద్ద ఉంటుంది. ఆమె పెంచిన మేనళ్లుల్లు వయసుకుడా 60 దాటిపోయింది. ఆ గ్రామం లో అత్యంత పెద్ద వయసు వ్యక్తి ఈమే. దాదాపు 50 ఏళ్ల క్రితమే రాత్రి భోజనం మానేసింది. కేవల టిఫిన్ మాత్రమే తింటుంది. ఇప్పటికీ కంటి చూపు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి ఆ కుటుంబంలో నాలుగు తరాల వారిని చూసింది. ప్రతి రోజు ఆమె ఉంటున్న వీధిలో అటూ ఇటూ నాలుగు కిలోమీటర్లు నడుస్తుంది.

ఈమె ఆరోగ్యం పై అక్కడి ప్రజల్లో రోజు చర్చ నీయాంశంగా మారుతుంది. ఇంత పెద్ద వయస్సులో ఆమె క్రికెట్ కూడా ఆడుతుండటం చూసి పిల్లలు సైతం మేము నీతో పోటీ పడలేం అంటున్నారట. ఆమె తన ముది మనుమలతో సమయం. చిక్కినప్పుడల్లా ఆడుతుంది.

ఇవి కూడా చదవండి

మనిషి జీవితానికి ఇంతకంటే ఏం కావాలి. ఆరోగ్యం, సంతోషం రెండూ సుబ్బమ్మకు దండిగా ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?