Hyderabad : చివరి నిజాం రాజు మనవడు అనారోగ్యంతో మృతి.. అతని పేరు, ఆస్తుల వివరాలు..!
నిజాం కుటుంబానికి చెందిన ప్రధాన అధికారి ప్రిన్స్ అజ్మెత్ జా, అతని తల్లి ప్రిన్సెస్ ఎస్రా షాహమత్ జా బంధువులు, స్నేహితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుడి బాగోగులు చూసుకుంటున్న అతని మేనల్లుడు హిమాయత్ అలీ మీర్జా అతడిని బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించగా అక్కడే తుది శ్వాస విడిచాడు.
హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ప్రిన్స్ షాహమత్ ఝా కన్నుమూశారు. 70ఏళ్ల షహమత్ ఝా కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొంతుతూ రాత్రి మృతి చెందారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు మోజం ఝాకు రెండవ భార్య అన్వరీ బేగం కుమారుడే ఈ షహమత్ ఝా. ఈయన ఇద్దరిని వివాహం చేసుకోవగా వారి నుంచి విడిపోయిన షహమత్ ఝా ఒంటరిగానే జీవించారు. అతనికి ఎలాంటి సంతానం లేదు. రెడ్‌హిల్స్‌లోని తన ఇంటిని విక్రయించిన తర్వాత బంజారాహిల్స్‌లోని తన సోదరి ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారు. అతను షాజీ అనే పెనుపేరుతో ఉర్దూలో కవిత్వం రాశాడు. నిజాం తన పేరు మీదుగా మోజమ్ జాహీ మార్కెట్ అని పేరు పెట్టాడు.
కాగా సోమవారం ఉదయం…అతని తాత ఉస్మాన్ అలీ ఖాన్ సమాధి సమీపంలో హైదరాబాద్ కోఠిలోని మస్జిద్-ఎ-జూడిలో అతనికి అంత్యక్రయిలు నిర్వహించనున్నారు నిజాం కుటుంబ సభ్యులు. ప్రిన్స్ షాహమత్ ఝా, నిజాం కుటుంబానికి చెందిన ప్రధాన అధికారి ప్రిన్స్ అజ్మెత్ జా, అతని తల్లి ప్రిన్సెస్ ఎస్రా షాహమత్ జా బంధువులు, స్నేహితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుడి బాగోగులు చూసుకుంటున్న అతని మేనల్లుడు హిమాయత్ అలీ మీర్జా అతడిని బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించగా అక్కడ తుది శ్వాస విడిచాడు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..