AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price: డబుల్ సెంచరీ కొట్టిన టమోటా.. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్‌లో రూ. 200..

మొన్నటిదాకా కొండెక్కి కూర్చున్న టమోటా రేటు ఇప్పుడు ఏకంగా అంతరిక్షాన్ని తాకింది. కిలో టమోటా రేటు 200 రూపాయలకు చేరుకుంది. రేటులో డబుల్ సెంచరీ కొట్టెయ్యడంతో టమోటాను చూస్తే జనం ఠారెత్తిపోతున్నారు. కొంతమంది కిచెన్‌లో టమాటో ఉపయోగించడం మానేశారు. అయితే చాలామంది ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు.  మాటల్లో వినిపిస్తోందే తప్ప మార్కెట్‌లో కనిపించడం లేదు టమోటా. దేశవ్యాప్తంగా రెండు నెలలుగా టమాటా దిగుబడి తగ్గి, కొరత పెరిగింది. ఈ నెల ప్రారంభంలో కిలో టమాట రూ.200 నుంచి రూ.230 వరకు విక్రయించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు..

Tomato Price: డబుల్ సెంచరీ కొట్టిన టమోటా.. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్‌లో రూ. 200..
Tomato Market
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 31, 2023 | 8:15 AM

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాట ధరలు కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.300కి చేరాయి. దీని ప్రభావం ప్రజల జేబుపై పడుతోంది. కొంతమంది కిచెన్‌లో టమాటో ఉపయోగించడం మానేశారు. అయితే చాలామంది ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు.  మాటల్లో వినిపిస్తోందే తప్ప మార్కెట్‌లో కనిపించడం లేదు టమోటా. దేశవ్యాప్తంగా రెండు నెలలుగా టమాటా దిగుబడి తగ్గి, కొరత పెరిగింది. ఈ నెల ప్రారంభంలో కిలో టమాట రూ.200 నుంచి రూ.230 వరకు విక్రయించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు కిలో రూ.130కి విక్రయించారు. టమాటా ధర మళ్లీ పెరిగి కిలో రూ.200కు విక్రయిస్తుండడంతో జనం షాక్ తిన్నారు. వివిధ జిల్లాల్లో హోల్‌సేల్‌పై రూ. 150 నుంచి రూ. 180.. చిల్లరగా టమాట రూ.200 వరకు విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారుల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో టమాటా ధర రూ.180కి చేరుకోగా.. బైంసా నగరంలో పలుచోట్ల రిటైల్ వ్యాపారంలో టమాటా ధర రూ.200కి చేరింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకే కాదు దేశవ్యాప్తంగా టమాటోకు పెట్టింది పేరు మదనపల్లి మార్కెట్‌‌. ఇక్కడ కూడా డబుల్ సెంచరీ కొట్టింది టమాటో. గత వారం మొదటి రోజు కిలో టమాటో రూ. 160 పలికిన ధర వారం చివరికి చేరుకోవడంతో 196కు చేరింది. అందులో ఏ గ్రేడ్ రకం మరింత ధర పలికింది. డిమాండ్‌కు తగినట్లుగా మదనపల్లి మార్కెట్‌కు టమాటో రాకపోవడంతో వచ్చిన బాక్సుల కోసం వ్యాపారులు పోటీ పడ్డారు.

పక్క రాష్ట్రాల నుంచి భారీ డిమాండ్..

ఇతర రాష్ట్రాల్లో టమాటలకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఒక్కసారిగా ధర పెరిగింది. ఇటీవల టమాట దిగుబడి బాగా పడిపోయింది. రైతులను లక్షాధికారులుగా మార్చేసింది. ఎకరం టమాటో సాగు చేస్తే  రూ. 20 లక్షల వరకు సంపాదించారు టమాటో రైతులు. ఇక బెజవాడ మార్కెట్‌లో టమోటా కనిపించడం లేదు. ఇంత ధర పెట్టలేమంటూ కొందరు వ్యాపారస్థులు వెనక్కి తప్పుకుంటున్నారు.

అల్లాడిపోతున్న సామాన్యులు

రైతు బజార్‌లో టమాటో భారీగానే కనిపిస్తోంది. అక్కడ తక్కువ ధరకు లభిస్తున్నా.. రిటైల్ మార్కెట్‌లో మాత్రం డబుల్ సెంచరీకి అమ్ముతున్నారు. మిగిలిన కూరగాయలు కొంటేనే టమాటో అమ్ముతామంటూ కొర్రి పెడుతున్నారు వ్యాపారస్థులు. కిచెన్‌లో కర్రీ అయిపోవాల్సిన టమోటా జనాన్ని ఇంకా వర్రీ చేస్తూనే ఉంది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే కిలో టమాట ధర రూ.200 ఉంటే, రీటైల్ మార్కెట్‌లో ధర ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే సామాన్యులకు భయమేస్తోంది.

మరో రెండు వారాలు పట్టొచ్చు..

టమాటా సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగినట్లు సమాచారం. దేశంలోని వర్షాధారిత ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నందున పరిస్థితి సద్దుమణిగేందుకు రెండు వారాలు పట్టవచ్చని రైతులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్‌ స్పీడు పెంచిన కింగ్‌డమ్..
అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్‌ స్పీడు పెంచిన కింగ్‌డమ్..
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
కేకేఆర్ ఇజ్జత్‌కే సవాల్.. గెలిస్తేనే నిలిచేది.. లేదంటే ప్యాకప్?
కేకేఆర్ ఇజ్జత్‌కే సవాల్.. గెలిస్తేనే నిలిచేది.. లేదంటే ప్యాకప్?
షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు..
షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు..
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే