Andhra Pradesh: మీసం మెలివేస్తున్న తెలుగువాడి కోడి… గోదావరి పందెం కోడి కోసం థాయ్‌లాండ్ నుంచి వచ్చారు.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..

Eluru: ఈ పుంజు ని కొనుక్కోవడం కోసం థాయిలాండ్ నుంచి నలుగురు ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి దానికోసం పోటీపడడంతో ఈ విషాయం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పుంజుని అమ్మడాని కి ఇష్టపడని రత్తయ్య ఇష్టం లేదని వారికి చెప్పడంతో అతని వద్దనే థాయిలాండ్ వాసులు ..

Andhra Pradesh: మీసం మెలివేస్తున్న తెలుగువాడి కోడి... గోదావరి పందెం కోడి కోసం థాయ్‌లాండ్ నుంచి వచ్చారు.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..
Pandem Kodi
Follow us
B Ravi Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 29, 2023 | 8:44 PM

ఏలూరు,జులై 29: తింటే నేతి గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలంటారు. కాని కోడిపందాలు చూడాలంటే పశ్చిమ గోదావరి రావాలనేది ఇపుడు ట్రెండ్ . ఇది లోకల్ , నేషనల్ కాదు గ్లోబల్ టాక్. ఎందుకంటే రాయలసీమ పౌరుషం, గుంటూరు కారం, గోదావరి వెటకారం, ఉత్తరాంధ్ర తేజం వెరసి అన్ని కలిసిన మేలుజాతి నాటుకోళ్లు ఎపి హబ్ గా మారింది . తాజాగా నాటుకోళ్ల కోసం థాయ్ ల్యాండ్ వాసులు ఏలూరు జిల్లాకు వచ్చారు. ఇక్కడ ఒక పందెం కోడిని రూ.3లక్షలు చెల్లిస్తామని బేరమాడారు. అసలెందుకు ఇంత డిమాండ్ ఏలూరు కోళ్లకు వచ్చింది.

కోడిపుంజులు పెంపకమే ఓ ప్రత్యేకత

కోళ్లు పెంపకం ఎప్పటి నుంచో మనుషులకు అలవాటు. వీటి ద్వారా మనిషికి తినేందుకు కావాల్సిన గుడ్లు, మాసం లభిస్తాయి. కాని ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపుంజులు ప్రత్యేకంగా పెంచుతారు. వీటి కోసం పామాయిల్ , మామిడి ఇతర తోటల్లో మకాంలు ప్రత్యేకంగా వేస్తారు. మేలు జాతి కోడిని ఎంచుకుని వాటిని పెట్టలతో జాతి కలిపి అవి గుడ్లు పెట్టగానే ప్రత్యేకంగా ఇంక అవి ఏడాది వయస్సుకు రాగానే పహిల్వాన్ ను మల్లయుద్ధం కోసం తయారు చేసినట్లు పోటీకి రెడీ చేస్తారు.

ఇవి కూడా చదవండి

రత్తయ్య ఇపుడు పందెం పుంజుల స్టార్..

ఏలూరు జిల్లా లోని పందెం పుంజులకు మంచి గిరాకీ ఉంది.ఇక్కడ కోడి పుంజులను కొనేందుకు పందెం రాయుళ్లు ఎగబడతారు.అందునా లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో రత్తయ్య అనే ఆసమి పెంచే పుంజులకు మరింత గిరాకీ ఏర్పడింది. ఈయన దగ్గర కోడి పుంజులను కొనేందుకు థాయ్ ల్యాండ్ నుండి పందెం రాయుళ్లు ప్రత్యేకించి వచ్చారంటే ఈయన గారి కోడి పుంజులకు అంతర జాతీయ స్థాయిలో డిమాండ్ ఏమిటో అర్థం అవుతుంది. గత 20 ఏళ్లుగా రత్తయ్య అనే వ్వక్తి పందెం కోళ్ళ ను పెంచుతున్నారు. సంక్రాంతి మూడు రోజులు సాంప్రదాయ బద్దంగా జరిగే పందెలకు పుంజులను సిద్ధం చేసి అమ్ముతు ఉంటారు.ఇందులో చాలా రకాల పుంజుల జాతులు ఉంటాయి వాటిలో ముఖ్యమైన జాతులు. డేగ,కాకి,నెమలి,పర్ల,సేతువా పుంజులు.వీటి కోసం ఏకంగా లక్షలో డబ్బులు ఇచ్చి కొనుకుంటారు పందెం రాయుళ్లు.

ఇదే క్రమంలో గత సంక్రాతి కి గణపవరం లో 27 లక్షలకు పందెం జరగగా అ పందెంలో రత్తయ్య సిద్దం చేసిన పుంజు పందెం ని గెలిచింది. కొందరు ఈ పందెం జరిగినప్పుడు తీసిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో అది చూసిన థాయిలాండ్ వాసులు పుంజుల కోసం ఇండియా కు వచ్చారు. ఈ పుంజు ని కొనుక్కోవడం కోసం థాయిలాండ్ నుంచి నలుగురు ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి దానికోసం పోటీపడడంతో ఈ విషాయం చర్చనీయాంశంగా మారింది.  అయితే ఈ పుంజుని అమ్మడాని కి ఇష్టపడని రత్తయ్య ఇష్టం లేదని వారికి చెప్పడంతో అతని వద్దనే థాయిలాండ్ వాసులు మరొక పుంజు ని 3 లక్షలకు కొనుకున్నారు.వీటిని పెంచే విధానం పై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారని రత్తయ్య తెలిపారు.

పందెం పుంజులను ముందు నుండి రోజు ప్రత్యేక వ్యాయామం శిక్షణ తో పాటు పోషక ఆహారం ఇస్తామని తెలిపారు. ఉదయం పుంజులను నీటిలో ఈత కొట్టించి ఆవిరి పట్టి అనంతరం గుడ్డు,పాలు బాదం పిక్కలు,కైమా వంటి పోషక ఆహారం కొలత ప్రకారం అందిస్తామని అనంతరం పందెం లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు.పందెం పుంజులను జాతులను బట్టి ఒక్కొక పుంజు లక్ష నుండి పది లక్షలు పలుకుతుంది అని రత్తయ్య తెలిపారు.అంతేకాక పందెంలో ఏ జాతి పుంజు ఏ సమయంలో బాగా పోరాడుతుంది అని తెలిపే కుక్కుట శాస్త్రం కూడా ఉంది అని తెలిపారు.మొత్తానికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ మన ఏలూరు జిల్లా పందెం కోళ్లు కు డిమాండ్ పెరగడం తో పందెం రాయుళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?