Krishna River: పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ.. శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ..

కృష్ణమ్మ బిరబిరా పరవళ్లు తొక్కుతూ పయనిస్తోంది. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతోపాటు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజి ఎగువన కురిసిన వర్షాలతో మున్నేరు, కట్టలేరు, బుడమేరు, పాలేరు నుంచి వరద కొనసాగుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు కాగా.. కొద్దిరోజులుగా అదే స్థాయిలో కొనసాగుతోంది. నాగర్జునసాగర్‌కు దిగువన, పులిచింతల ఎగువన కురిసిన వర్షాలతో పులిచింతల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది.

Krishna River: పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ.. శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ..
Srisailam Project
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 30, 2023 | 6:06 AM

రెండు రోజులుగా వరద నీరు చేరుతుండటంతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్రతో కలిసి శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజ్‌కు నీటి ప్రవాహం భారీగా పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో కృష్ణ, గోదావరి నదులు పొంగిపోర్లుతున్నాయి. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. గోదావరి బేసిన్‌తో పోలిస్తే మాత్రం.. కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో జురాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌లకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే.. కృష్ణమ్మ బిరబిరా పరవళ్లు తొక్కుతూ పయనిస్తోంది. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతోపాటు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజి ఎగువన కురిసిన వర్షాలతో మున్నేరు, కట్టలేరు, బుడమేరు, పాలేరు నుంచి వరద కొనసాగుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు కాగా.. కొద్దిరోజులుగా అదే స్థాయిలో కొనసాగుతోంది. నాగర్జునసాగర్‌కు దిగువన, పులిచింతల ఎగువన కురిసిన వర్షాలతో పులిచింతల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా పెరగడంతో మొత్తం అన్ని గేట్లు ఎత్తి వేసి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేశారు.

జూరాల ప్రాజెక్టు 31 గేట్లు ఎత్తి నీరు విడుదల..

ఇక.. జూరాల ప్రాజెక్టు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో కృష్ణానది ఉరకలేస్తోంది.దాంతో.. జూరాల ప్రాజెక్టుకు వరద భారీగా చేరుకుంటుంది. జూరాల ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317కు చేరుకోవడంతో 31 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అటు.. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు భారీగా వరద పోటెత్తుతోంది. దాంతో.. 25 గేట్లు ఎత్తి నీటిని దిగువకు పంపుతున్నారు అధికారులు. నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం దగ్గర కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. రాత్రి సంగమేశ్వర ఆలయం జలాధివాసం నిర్వహించారు. గంగమ్మకు సారె సమర్పించి గర్భాలయంలో పూజలు చేశారు పండితులు. ఇక.. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. పైనుంచి భారీగా వరద నీరు చేరుకోవడంతో జలకళను సంతరించుకుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత 836 అడుగులుగా ఉంది. దాంతో.. శ్రీశైలం డ్యామ్‌ నిండడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కృష్ణమ్మ మరింతగా పరవళ్లు తొక్కితే మాత్రం శ్రీశైలం నిండే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి