AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇచ్చేవారి సంతోషం.. పుచ్చుకునే వారి నమ్మకం.. దేశంలో మరెక్కడా లేని భిన్నమైన పండుగ ప్రారంభం..

ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ‌, విదేశాల నుంచి ఆ మ‌తం, ఈ మ‌తం అని లేకుండా అంద‌రూ క‌లిసి వ‌చ్చి కోరిన కోర్కెల రొట్టెలు మార్చుకోవ‌డం శ‌తాబ్ధాల కాలం నుంచి ఆన‌వాయితీగా వ‌స్తోంది. చదువు రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, వివాహ రొట్టె ఇలా 12 రకాల కోర్కెలకు సంబంధించిన రొట్టెలు అక్కడ ప్రత్యేకం..

ఇచ్చేవారి సంతోషం.. పుచ్చుకునే వారి నమ్మకం.. దేశంలో మరెక్కడా లేని భిన్నమైన పండుగ ప్రారంభం..
Rottela Panduga
Ch Murali
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 29, 2023 | 7:56 PM

Share

నెల్లూరు లోని స్వర్ణాల చెరువు వద్ద పోటెత్తిన భక్తజనం.. కొందరు రొట్టెలు ఇస్తున్నారు.. కొందరు వారిచే రొట్టెలు తీసుకుంటున్నారు.. ఇచ్చేవారి కళ్ళలో ఆనందం కనబడుతోంది.. తీసుకునే వారి మనస్సు నిండా నమ్మకం.. అదే రొట్టెల పండుగ..మత సామరస్యానికి ప్రతీకగా జరిగే పండుగ ఇది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అక్కడకు భక్తులు క్యూ కడుతుంటారు.. అలా అని నిత్యం అక్కడ ఈ పండుగలు జరగవు.. ఏడాదిలో ఐదు రోజులు మాత్రమే ఈ వేడుకలు జరుగుతుంటాయి.

రొట్టెలు తింటే కోరిన కోర్కెలు తీరుతాయా… అంటే అవున‌నే అంటున్నారు అక్క‌డి భ‌క్తులు. కోరిన కోరిక‌లు కోరుకుంటూ రొట్టెలు ప‌ట్టుకునే వారు కొంద‌రైతే… కోరిక తీరిన తర్వాత రొట్టె వ‌దిలే వారు మ‌రి కొంద‌రు… ఇదేదో ఒక ప్రాంతానికి ప‌రిమిత‌మైన రొట్టెల పండుగ కాదు… దేశ‌, విదేశాల నుంచి ల‌క్ష‌లాది మంది భ‌క్తులు రొట్టెలు ప‌ట్టుకునేందుకు అక్క‌డికి వ‌స్తారు. భ‌క్తివిశ్వాల‌తో అమ‌ర‌వీరుల స‌మాధులను దర్శించుకొని రొట్టెలు మార్చుకుంటారు. మతసారస్యానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న రొట్టెల పండుగ నెల్లూరులో శనివారం నుంచి నుంచి ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది…

లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ పండుగ విశేషాలు ఓ సారి చూద్దాం. మ‌త‌సామ‌ర‌స్యానికి ప్ర‌తీక ఆ పండుగ‌.. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది.. ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ‌, విదేశాల నుంచి ఆ మ‌తం, ఈ మ‌తం అని లేకుండా అంద‌రూ క‌లిసి వ‌చ్చి కోరిన కోర్కెల రొట్టెలు మార్చుకోవ‌డం శ‌తాబ్ధాల కాలం నుంచి ఆన‌వాయితీగా వ‌స్తోంది. చదువు రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, వివాహ రొట్టె ఇలా 12 రకాల కోర్కెలకు సంబంధించిన రొట్టెలు అక్కడ ప్రత్యేకం.. ఏటికేడు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రులు కూడా రొట్టెల పండుగకు వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రొట్టెలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి..

ఇవి కూడా చదవండి

ఆగస్టు మూడవ తేదీ వరకు జరగనున్న ఈ రొట్టెల పండుగ లో గంధ మహోత్సవం ఎంతో ప్రత్యేకమైనది. ఆదివారం గంధ మహోత్సవం జరగనుంది. కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి 12 బిందెల్లో గంధాన్ని కలుపుకొని ఊరేగింపుగా తీసుకొస్తారు. అక్కడ కడప దర్గా పీఠాధిపతి చేతుల మీదుగా ప్రార్థనలతో అమరవీరుల సమాధులకు లేపనం చేస్తారు. ఇదంతా చూసేందుకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇందుకోసం నగరపాలక సంస్థ అన్ని ఏర్పాట్లు చేపట్టింది.. లక్షల సంఖ్యలో భక్తులు రానుండడంతో భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ