Andhra Pradesh: ఈజీగా పని అయిపోతుందని ఆశపడ్డాడు.. కట్ చేస్తే కోటి రూపాయలు మటాష్..
Tadepalli News: తాడెపల్లిలో ఉండే రంగస్వామి ఈ ఆపరేషన్ కోసం డిలైట్ డాబా వెనుక బజార్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అక్కడికే క్యాష్‌తో రావాలని శివకు చెప్పాడు. ఈ నెల 9వ తేదీన శివ కోటి రూపాయల రెండు వేల నోట్లను తీసుకొని డిలైట్ డాబా వెనుక బజార్ ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో బాక్సుల్లో సర్ది ఉన్న 500 రూపాయల నోట్లను చెక్ చేసుకున్నాడు. తన వద్ద నున్న నోట్లు ఇచ్చే సమయంలో పోలీస్ జీప్ సైరన్ మోగింది. వెంటనే రంగస్వామి
తాడేపల్లి, జులై 29: తని పేరు రంగస్వామి.. నేరాలు చేయడంలో దిట్ట. రంగస్వామిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన రంగస్వామి కొద్ది నెలల కిందట తన మకాం తాడేపల్లికి మార్చాడు. ఆ సమయంలో ఖాళీగా ఉన్న రంగసామీ ఎవరు దొరుకుతారా? అని ఎదురు చూశాడు.
బంగారం వ్యాపారితో పరిచయం..
అమాయకులైన వారి కోసం ఎదురుచూస్తున్న సమయంలో తెనాలికి చెందిన బంగారం వ్యాపారి శివ పరిచయం అయ్యాడు. ఇక 2000 రూపాయల నోటు మార్పిడికి ఆర్బీఐ ఇచ్చిన అవకాశాన్ని తనకు అవకాశంగా మల్చుకున్నాడు. రంగస్వామి తన మాస్టర్ బ్రెయిన్‌కు పని పెట్టాడు. శివ వద్దకు వెళ్ళి కోటి రూపాయలకు సమానమైన రెండు వేల నోట్లు ఇస్తే రూ. 80 లక్షల రూపాయలకు సమానమైన 500 రూపాయల నోట్లు ఇస్తారని నమ్మబలికాడు. రంగస్వామిని నమ్మిన శివ.. క్యాష్ తీసుకొని ఎక్కడికి రావాలని అడిగాడు.
తాడేపల్లిలో మకాం…
తాడెపల్లిలో ఉండే రంగస్వామి ఈ ఆపరేషన్ కోసం డిలైట్ డాబా వెనుక బజార్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అక్కడికే క్యాష్‌తో రావాలని శివకు చెప్పాడు. ఈ నెల 9వ తేదీన శివ కోటి రూపాయల రెండు వేల నోట్లను తీసుకొని డిలైట్ డాబా వెనుక బజార్ ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో బాక్సుల్లో సర్ది ఉన్న 500 రూపాయల నోట్లను చెక్ చేసుకున్నాడు. తన వద్ద నున్న నోట్లు ఇచ్చే సమయంలో పోలీస్ జీప్ సైరన్ మోగింది. వెంటనే రంగస్వామి పోలీసులు వచ్చారంటూ హాడావుడి చేయడం ప్రారంభించాడు. శివ వద్ద నున్న రెండు వేల రూపాయల నోట్లను తీసుకొని అక్కడ నుండి పారిపోయాడు. కొద్ది సేపటి తర్వాత పోలీస్ సైరన్ ఆగిపోయింది. శివలో అనుమానం పెరిగిపోయింది.
నకిలీ 500 నోట్లు..
అనుమానం వచ్చిన శివ వెంటనే 500 రూపాయల నోట్లను చెక్ చేసుకున్నాడు. ఒక్కో కట్టలో పై నోటు కింద నోటు మాత్రమే ఒరిజినల్‌వి ఉంచి, మిగిలినవి నకిలీ నోట్లు పెట్టినట్లు గుర్తించాడు. అందుకే రంగస్వామి హాడావుడిగా పారిపోయినట్లు గుర్తించాడు. తాను మోస పోయినట్లు తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు.
అప్పటికే రంగస్వామి తన భార్య భార్గవి, కూతురు, అత్తతో కలిసి చెన్నైకి వెళ్లిపోయాడు. అక్కడి నుండి తిరిగి హైదరాబాద్‌కు పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ర్యాప్ గ్యాంగ్స్..
బాపట్ల మండలం స్టువర్ట్ పురంలో గతంలో ఈ తరహా మోసాలు జరిగేవి. బంగారం తక్కువ ధరకు ఇస్తామని ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులను నమ్మించి స్టువర్ట్ పురం పిలిపించేవారు. డబ్బు మార్పిడి చేసుకుంటున్న సమయంలో ఈ గ్యాంగ్స్ కు చెందిన వారే పోలీసులు డ్రెస్సుల్లో వచ్చి వ్యాపారుల వద్ద నుండి డబ్బులు తీసుకొని పారిపోయేవారు. అయితే పోలీసులు ఉక్కుపాదం మోపటంతో ర్యాప్ గ్యాంగ్స్ అకృత్యాలు తగ్గిపోయాయి.
అయితే అదే తరహా మోసం తాడేపల్లిలో జరగడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పోలీసులు ఇప్పటి వరకూ నిందితులను పట్టుకోకపోవటం పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగస్వామికి రాజకీయ నాయకుల అండదండలున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..