AP News: ఏపీలో ‘సాగు..తున్న’ యుద్ధం! పోలవరం పాపం ఎవరిది? విపక్షాల విమర్శలు రాజకీయమేనా?

ప్రతిపక్షం విమర్శలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఏపీ జలవనవరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. నాటి టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దితూ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు అంబటి రాంబాబు. పోలవరం విషయంలో పాపమంతా కూడా చంద్రబాబుదే అన్నారు. పాత అంచనాలు అంగీకరించడం నుంచి డయాఫ్రం వాల్‌ డిజైన్‌ లోపాల వరకూ టీడీపీ చేసిన తప్పుల వల్లే ఆలస్యం అయిందన్నారు మంత్రి అంబటి.

AP News: ఏపీలో 'సాగు..తున్న' యుద్ధం! పోలవరం పాపం ఎవరిది? విపక్షాల విమర్శలు రాజకీయమేనా?
Ap Politics
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 29, 2023 | 7:06 PM

ఏపీలో ఇప్పుడు పొలిటికల్‌ లెక్కలు మారాయి. మిస్సింగ్‌ కేసులు.. దొంగ ఓట్ల దుమారం పోయి తాజాగా ప్రాజెక్టుల చుట్టూ రాజకీయం నడుస్తోంది. వరుసగా మూడు రోజుల పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు. దీనికి తనదైన శైలి వ్యాఖ్యలు జోడించి మరీ కౌంటర్‌ ఇచ్చారు ఇరిగేషన్ మినిస్టర్‌ అంబటి రాంబాబు. మొత్తానికి ఏపీలో అంకెల చుట్టూ రాజకీయం చక్కర్లు కొడుతోంది. నిన్నమొన్నటిదాకా జనసేన, వైసీపీ మధ్య మిస్సింగ్‌ లెక్కల పంచాయితీ నడిస్తే ఇప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య సాగునీటి ప్రాజెక్టులు వాటిపై పెట్టిన ఖర్చులపై మాటలమంటలు రాజుకున్నాయి.

వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మరీ లెక్కలేసి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్ ద్వారా టార్గెట్‌ చేశారు చంద్రబాబునాయుడు. రాయలసీమ, కోస్తాంధ్రలకు ద్రోహం చేయడంతో పాటు.. అటు మణిహారం అయిన పోలవరం ప్రాజెక్టును మధ్యలో అపేశారని ఆరోపించారు చంద్రబాబు. లెక్కలు చెప్పడమే కాదు.. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకూ ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రత్యేక కార్యాచరణకు కూడా పిలుపునిచ్చింది టీడీపీ.

ప్రతిపక్షం విమర్శలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఏపీ జలవనవరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. నాటి టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దితూ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు అంబటి రాంబాబు. పోలవరం విషయంలో పాపమంతా కూడా చంద్రబాబుదే అన్నారు. పాత అంచనాలు అంగీకరించడం నుంచి డయాఫ్రం వాల్‌ డిజైన్‌ లోపాల వరకూ టీడీపీ చేసిన తప్పుల వల్లే ఆలస్యం అయిందన్నారు మంత్రి అంబటి. అధికారంలో ఉప్పప్పుడు నిధుల అనుసంధానం చేసిన చంద్రబాబు ఇప్పుడు నదుల అనుసంధానం గురించి మాట్లాడుతున్నారన్నారు మరో మంత్రి రోజా. ప్రాజెక్టులపై జరుగుతున్న యుద్ధంలో ఎవరిది వాస్తవం? మరెవరిది రాజకీయ ప్రయోజనం? సాగుతున్న యుద్ధంలో నిజాలు బయటపడతాయా? రాజకీయాలకు పరిమితం అవుతుందా?