AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Cobra: వామ్మో..13 అడుగుల కింగ్ కోబ్రా.. ఆ రైతులు ఎలా పట్టుకున్నారో చూస్తే దిమ్మ తిరగాల్సిందే..

వరి నాట్లు ఉండడం, వర్షపు నీటి తో నిండి ఉండడం తో ఆ నాట్ల మధ్య వేగంగా కోబ్రా వెళ్తుండడం, క్షణాల్లో అనుసరిస్తున్న వారిపైకి బుసలు కొడుతూ ఎగబడడంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో ఇక లాభం లేదనుకుని సాహసం చేశారు ఆ యువకులు.

King Cobra: వామ్మో..13 అడుగుల కింగ్ కోబ్రా.. ఆ రైతులు ఎలా పట్టుకున్నారో చూస్తే దిమ్మ తిరగాల్సిందే..
King Cobra
Eswar Chennupalli
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 29, 2023 | 5:00 PM

Share

ఇదిగోండి, ఈ వీడియో చూడండి. పొలం లో, బురదలో, వరి పొలం లో పంట మధ్య శబ్దం చేయకుండా వెళ్తున్న ఈ పామును చూడండి. పాపం నిరంతరం పొలాల్లో నే ఉంటూ ఆ పోలాలనే తమ కన్న బిడ్డలుగా చూసుకునే ఈ అమాయక రైతులు పొరపాటున దానిపై కాలు వేసారంటే… ఇక అంతే సంగతులు… తల వరకు నిటారుగా లేచి బుస లు కొట్టి మరీ కాటేసెంత కసితో ఉన్న కొబ్రాల మధ్య ఆ రైతన్నల జీవితాలను ఒక్కసారి ఊహించుకుంటే

ఉమ్మడి విశాఖ జిల్లాలోని మాడుగల నియోజకవర్గంలోని చీడికడ మండలం తురువోలు గ్రామ పొలాల్లో రైతుల కంట పడిన కింగ్ కోబ్రా ఇది. ఇక్కడ ప్రధాన ఆదాయ వనరు పోలాలే. అందుకే గ్రామాల్లో రైతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు నిరంతరం ఆ పొలాలతో నే సహవాసం, వాటితోనే తమ మనుగడ అన్నట్టు ఉంటారు.

అలానే నిన్న పొలానికి వెళ్లిన ఒక రైతు కంటపడ్డ 13 అడుగుల కింగ్ కోబ్రా ఇది. కోబ్రా కనిపించడంతో భయబ్రాంతులకు గురైన ఆ రైతు తృటిలో దాని బారి నుంచి తప్పించుకుని, పక్క పొలాల్లో ఉన్న రైతులకు, కుటుంబ సభ్యులకు చెప్పడం తో వెంటనే స్థానికంగా ఉన్న స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడం తో అందరూ క్షణాల్లో అక్కడ వాలిపోయారు.

ఇవి కూడా చదవండి

అయితే ఆ పొలాల్లో దాన్ని పట్టుకోవడం అంత సులువైన పని కాకపోవడం తో చాలా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది వాళ్లకు. వరి నాట్లు ఉండడం, వర్షపు నీటి తో నిండి ఉండడం తో ఆ నాట్ల మధ్య వేగంగా కోబ్రా వెళ్తుండడం, క్షణాల్లో అనుసరిస్తున్న వారిపైకి బుసలు కొడుతూ ఎగబడడంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో ఇక లాభం లేదనుకుని సాహసం చేశారు ఆయువకులు. వేగంగా తప్పించుకుని కోబ్రా పారిపోయే ప్రయత్నం చేయడం తో నేరుగా దాని తోకపై పడి ఒడిసి తోక పట్టుకోబోగా అంతే వేగంతో అది ప్రతి దాడికి ప్రయత్నించింది. అయితే చాకచక్యంగా పట్టుకుని సమీపం లో ఉన్న అటవీ ప్రాంతం లో విడిచి పెట్టారు.

ఇటీవల కాలంలో వర్షాలు పెద్ద ఎత్తున పడి వరదలు రావడంతో అటవీ ప్రాంతాల నుంచి ఈ పెద్ద పెద్ద కోబ్రా లు కొట్టుకు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు