AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి తమ్ముడినే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి..! తిట్టిపోస్తున్న నెటిజన్లు..

ఇది తప్పుడు బంధం అని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వారిద్దరూ తమ ప్రేమను వదులుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో ఎట్టకేలకు వారి కుటుంబం అంగీకరించింది. ఈ వింత పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వీరి బంధంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Jyothi Gadda
|

Updated on: Jul 29, 2023 | 4:40 PM

Share

ప్రేమకు, కులం, మతం, వయస్సు, అందం, బంధం అనే అంశాలకు ఎలాంటి అడ్డంకులు కావానేది ఎంత నిజమో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ వింత పెళ్లి నిరూపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా తాజుద్దీన్‌పూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన కూతురి వరసైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇది వింటే మీరు షాక్ అవుతున్నారు కాదా..? కానీ, నిజమే..ఒక వ్యక్తి తన సోదరుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించగా, ఎట్టకేలకు ఇరువురు బంధువుల సమక్షంలో ఆలయంలో వివాహం చేసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుభమ్ అనే వ్యక్తి తన అన్న కూతురు రియాను స్థానిక హనుమాన్ దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. తామిద్దరం గత మూడేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నామని, విడిపోలేమని, అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని సుభమ్, రియా తల్లిదండ్రులకు చెప్పారు. ఇది విన్న కుటుంబ సభ్యులు మొదట షాక్‌కు గురయ్యారు. కుటుంబసభ్యులు మొదట వ్యతిరేకించారు. ఇది తప్పుడు బంధం అని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వారిద్దరూ తమ ప్రేమను వదులుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో ఎట్టకేలకు వారి కుటుంబం అంగీకరించింది. ఈ వింత పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వీరి బంధంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది మతానికి, హిందూ ఆచారాలకు విరుద్ధమని, అన్నయ్య కూతురు తన సొంత కూతురిలాంటిదని ఖండిస్తున్నారు. అంతేకాదు ఈ పెళ్లిని స్థానికులు ‘పాపం’గా అభివర్ణించారు. ఏది ఏమైనా ఇద్దరూ తమ ఇష్టానుసారం పెళ్లి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని