AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పోలీస్ స్టేషన్‌లోనే వంటావార్పు.. తాజా కరివేపాకుతో ఖాకీలు చేసిన చికెన్‌ కర్రీ..

పోలీసులు వంట చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది పోలీస్ స్టేషన్‌లోనే పోయ్యి పెట్టి వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందించారు.

Watch: పోలీస్ స్టేషన్‌లోనే వంటావార్పు.. తాజా కరివేపాకుతో ఖాకీలు చేసిన చికెన్‌ కర్రీ..
Kerala Cops Cook Tapioca
Jyothi Gadda
|

Updated on: Jul 28, 2023 | 2:12 PM

Share

పోలీస్ స్టేషన్‌లో వంటావార్పు కార్యక్రమం జరుగుతోంది. అంతేకాదు పోలీసు సిబ్బంది ఖాకీ యూనిఫామ్‌లోనే వంటలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన తర్వాత, అది వైరల్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే ఈ ఘటనపై కేరళ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలోని పఠన్‌తిట్టలోని ఎలవంతిట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

పోలీసు అధికారి ఒకరు ఖాకీ యూనిఫారం ధరించి చికెన్ వండుతూ, పప్పు పులుసు, ఇతర స్థానిక ప్రసిద్ధ వంటకాలను తయారు చేస్తున్నారు. పోలీసుల వంటలకు సంబంధించిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో ఇప్పటికే 9 లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంటనే పోలీసులకు నోటీసు పంపారు. ఈ మొత్తం ఘటనపై జిల్లా పోలీసులు వివరణ కోరారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, పోలీసులు వంట చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు, పోలీస్‌ సిబ్బంది ఇలా పోలీస్ స్టేషన్‌లోనే వంట చేస్తారా- ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఈ వీడియోపై పలువురు ఎగతాళి చేశారు. చాలా మంది ఈ మొత్తం ఘటనను ఖండించారు. బాధ్యతా రహితంగా వ్యవహరించిన పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. ఇకపోతే, కొందరు ఈ వీడియో చూసిన పలువురు పోలీసు అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను చాలా మంది లైక్ చేశారు. వీడియోలో మలయాళంలో ఒక పాట ప్లే అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..