Andhra Pradesh: ఆ గుడిలోకి ఆడవాళ్లకు నో ఎంట్రీ.. అనాదిగా వస్తున్న వింత ఆచారం.. ఎక్కడో తెలుసా..?

Anantapur: ఈ గుడిలోకి పూర్వం నుంచి మహిళలు ఆలయ ప్రవేశం చేయలేదు. అలా కాలక్రమంలో మహిళలు పూర్తిగా గుడి లోపలికి వెళ్ళి దర్శించుకోవడం మానేశారు....దీంతో అప్పటి నుంచి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదనే ప్రచారం సాగింది.... వాస్తవానికి ఈ నిబంధన వెనకాల గల కారణం..

Andhra Pradesh: ఆ గుడిలోకి ఆడవాళ్లకు నో ఎంట్రీ.. అనాదిగా వస్తున్న వింత ఆచారం.. ఎక్కడో తెలుసా..?
No Entry For Women
Follow us
Nalluri Naresh

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 28, 2023 | 9:35 AM

అనంతపురం,జులై 28: నార్పల మండలం గూగుడు శ్రీ కుళ్ళాయిస్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలోకి మహిళలు ప్రవేశించరు… ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ ఆలయంలోకి మహిళలు ఎవరూ వెళ్ళరు అనే ఆచారం ఉంది. కానీ గుడిలోకి మహిళలు రాకూడదు అనే నిబంధన మాత్రం లేదు. 13 సంవత్సరాల లోపు ఆడపిల్లలు లోపలికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకుంటారు. కాని 13 సంవత్సరాలు పైబడిన మహిళలు వారంతట వారే గుడిలోకి ప్రవేశించరు. ఆడవాళ్లు నెలసరి సమయాల్లో సాధారణంగానే ఏ గుడిలోకి వెళ్ళరు.

అలానే కుళ్ళాయిస్వామి గుడిలోకి కూడా పూర్వం నుంచి మహిళలు ఆలయ ప్రవేశం చేయలేదు. అలా కాలక్రమంలో మహిళలు పూర్తిగా గుడి లోపలికి వెళ్ళి దర్శించుకోవడం మానేశారు….దీంతో అప్పటి నుంచి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదనే ప్రచారం సాగింది…. వాస్తవానికి అలాంటి నిబంధన ఏమీ లేదు… అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మహిళలే గుడిలోకి రారు…. ఇక మాజీ మంత్రి శైలజనాథ్ మంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి గూగూడు గ్రామంలోని కుళ్ళాయి స్వామి గుడిలోకి దర్శనం చేసుకొని వెళ్ళిన తరువాత యాక్సిడెంట్ లో చెయ్యి విరిగింది. అందుకని అప్పటి నుండి మాజీ మంత్రి శైలజనాథ్ కూడా గుడి బయటే ఉండి దర్శనం చేసుకుంటారు తప్ప, గుడిలోకి ప్రవేశించరు.

వాస్తవానికి గూగుడు గ్రామంలోని దళితులు కూడా గుడిలోకి ప్రవేశించరు. ఇది కూడా అనాదిగా వస్తున్న అనవాయితీ మాత్రమే… దళితులు ప్రవేశించకూడదని ఎవరు ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కొన్ని ఏళ్ళుగా ఇక్కడి ఆచారం ప్రకారం మహిళలు, దళితులు ఆలయంలోకి ప్రవేశించరు. బయట నుంచే స్వామివారిని దర్శించుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..