AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒరేయ్‌.. అది బైక్‌రా బాబు.. సైకిల్‌ ఎక్కి తొక్కినట్టుగా వాడేస్తున్నావ్‌ జర భద్రం..!

దీనిపై  పోలీసులు కూడా నిఘా వేసి చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు కోరారు. అదే సమయంలో ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారు అనే వివరాలు తెలియరాలేదు. వీడియోలో బైక్ నంబర్ కూడా కనిపించడం లేదు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లోనే మిలియన్ల మంది వీక్షణలు, లైక్‌లను సంపాదించింది.

Viral Video: ఒరేయ్‌.. అది బైక్‌రా బాబు.. సైకిల్‌ ఎక్కి తొక్కినట్టుగా వాడేస్తున్నావ్‌ జర భద్రం..!
Boy Riding Bike
Jyothi Gadda
|

Updated on: Jul 28, 2023 | 8:50 AM

Share

ఈ ప్రపంచం ఎంతో చిలిపి ప్రపంచం. చిత్ర విచిత్రమైన ఘటనలు, సంఘటనలు అనేకం వెలుగు చూస్తుంటాయి. ఏదైనా సరదా.., ఫన్నీ ఇన్సిడెంట్‌తో మీరు ప్రశాంతత పొందాలనుకుంటే.. Instagramతో సహా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లకు వెళితే చాలు..మీరు ఊహించలేని సంఘటనల వీడియోలు వేలల్లో ఉన్నాయి. అలాంటిదే ఇక్కడ కూడా ఓ చిన్న కుర్రాడు బైక్‌ని సైకిల్‌ తొక్కినట్టుగా పరిగెత్తిస్తున్నాడు.

భారత ప్రభుత్వ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం పిల్లలు డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. నిబంధనలు ఉల్లంఘించి ఏదైనా ప్రమాదానికి కారణమైతే పిల్లల తల్లిదండ్రులను శిక్షిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కనిపించడం లేదు. పిల్లలు కూడా డ్రైవింగ్‌ను హాబీగా భావించి రోడ్డుపై క్రమరహితంగా డ్రైవ్ చేస్తున్నారు. ఈ వీడియోలో కూడా ఒక చిన్న కుర్రాడు బైక్‌తో స్టంట్‌ చేస్తూ కనిపించాడు. వాడు సరిగ్గా బైక్ ఎత్తు కూడా లేడు.. కానీ, బైక్ స్టార్ట్ చేసి పరుగెత్తి మరీ బైక్ ఎక్కాడు. అతను నిలబడి ఎక్కలేడు. ఎందుకంటే కాళ్లు అందవు. అందుకే అతడు తెలివైన ఆలోచన చేశాడు. టెక్నిక్‌తో బైక్‌ స్టార్ట్‌ చేసి ఎక్కి కూర్చున్నాడు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో బుడ్డొడు సైకిల్ తొక్కినట్లు బైక్ నడుపుతున్నాడు. ఇందులో మరో తమాషా ఏంటంటే.. ఆ చిన్నారి ఒక్కడే బైక్‌పై వెళ్లటం లేదు.. అప్పటికే ఆ బైక్‌పై మరో చిన్న పిల్లవాడు కూడా కూర్చున్నాడు. ఈ వీడియో కామెడీ లాగా ఉంది. అయితే ప్రమాదం జరిగినప్పుడే ఆ విషాదం అర్థమవుతుంది. ఇలాంటి వీడియోలు తీసి లైక్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా అది తప్పుడు సంకేతంగానే పరిగణించబడుతుంది.

దీనిపై  పోలీసులు కూడా నిఘా వేసి చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు కోరారు. అదే సమయంలో ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారు అనే వివరాలు తెలియరాలేదు. వీడియోలో బైక్ నంబర్ కూడా కనిపించడం లేదు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లోనే మిలియన్ల మంది వీక్షణలు, లైక్‌లను సంపాదించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
కళ్యాణ్ ప్రైజ్ మనీలో భారీ కోత.. రూ.35 లక్షలు కాదు వీడియో
కళ్యాణ్ ప్రైజ్ మనీలో భారీ కోత.. రూ.35 లక్షలు కాదు వీడియో