AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: షూటింగ్ సైట్‌కి పిల్లలతో వచ్చిన చిరుతపులి…! ఫిల్మీం సిటీలో కలకలం.. షాకింగ్ వీడియో వైరల్‌..

ఇక్కడ గతంలో కూడా చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఈ స్థలం అటవీ ప్రాంతంలోకి రానప్పటికీ ఇప్పుడు చిరుతపులి సంచారం ఎందుకు పెరిగిపోయిందో చాలామందికి అర్థం కావడం లేదని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే సినీ పరిశ్రమలోని 1000 మందికి పైగా ఉద్యోగులు సమ్మెకు దిగడం ఖాయమన్నారు.

Watch: షూటింగ్ సైట్‌కి పిల్లలతో వచ్చిన చిరుతపులి...! ఫిల్మీం సిటీలో కలకలం.. షాకింగ్ వీడియో వైరల్‌..
Leopard
Jyothi Gadda
|

Updated on: Jul 28, 2023 | 8:23 AM

Share

ఓ చిరుత తన పిల్లలతో షూటింగ్ సెట్‌లోకి ప్రవేశించింది. దాంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ ఘటన ముంబయిలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో చోటు చేసుకుంది. ఫిల్మీం సిటీలో ఓ సీరియల్ షూటింగ్ జరుగుతుండగా చిరుత తన పిల్లలతో కలిసి ప్రాంగణంలోకి ప్రవేశించింది. ఈ షాకింగ్ వీడియో అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. ముంబైలోని గోరెగావ్ ఫిల్మ్ సిటీలో మరాఠీ సీరియల్ ‘శుక్ మహంజే నహీ కై అస్త్ర’ షూటింగ్ జరుగుతోంది. అప్పుడు సినిమా తీస్తున్న వాళ్లకి ఓ షాకింగ్‌ సీన్‌ కనిపించింది. ఓ చిరుతపులి తన పిల్లలతో షూటింగ్ సైట్‌కి రావడం చూసి వెంటనే కేకలు వేస్తూ పరుగులు తీశారు.

షూటింగ్‌లో పాల్గొన్న వ్యక్తులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. జూలై 26న కోరెగావ్ ఫిల్మ్ సిటీలో మరాఠీ సీరియల్ షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్‌లో 200 మందికి పైగా పాల్గొన్నారు. ఈ క్రమంలో 4 గంటల సమయంలో ఓ చిరుతపులి తన పిల్లలతో కలిసి షూటింగ్ సైట్‌లోకి ప్రవేశించింది. విడుదలైన వీడియోలో ఇది చూసిన వారంతా కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఈ వీడియోను స్మాల్ స్క్రీన్ యాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామలాల్ గుప్తా షేర్ చేశారు.

ఈ ట్వీట్‌ను పోస్ట్ చేసిన అనంతరం.. గత 10 రోజుల్లోనే ఇలాంటి 4-5 ఘటనలు జరిగాయన్నారు. షూటింగ్‌కి వచ్చే వారు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కూడా సురేష్ అన్నారు. రోజురోజుకూ ఇదే సమస్య ఎదురవుతున్నదని సురేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే సినీ పరిశ్రమలోని 1000 మందికి పైగా ఉద్యోగులు సమ్మెకు దిగడం ఖాయమన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నెల18న కూడా ఇదే తరహాలో షూటింగ్ జరిగింది. అప్పుడు కూడా చిరుతపులి సంచారాన్ని గుర్తించారు. ఆ సమయంలో షూటింగ్ సైట్‌లో 200 మందికి పైగా ఉన్నారు. ఆ రోజు అక్కడే ఉన్న ఓ కుక్కపై చిరుతపులి దాడి చేసిందని సమాచారం. ఇకపోతే, ఈ ఫిల్మీం సిటీ ఉన్న ప్రదేశం సంజయ్ గాంధీ పార్క్ సమీపంలో ఉంది. ఇక్కడ గతంలో కూడా చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఈ స్థలం అటవీ ప్రాంతంలోకి రానప్పటికీ ఇప్పుడు చిరుతపులి సంచారం ఎందుకు పెరిగిపోయిందో చాలామందికి అర్థం కావడం లేదని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..