IND vs WI: ఇది గమనించారా.. తొలి వన్డేలో సందడి చేసిన శాంసన్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Suryakumar Yadav vs Sanju Samson: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది. తొలి వన్డేలో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బార్బడోస్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి.

Suryakumar Yadav vs Sanju Samson: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది. తొలి వన్డేలో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బార్బడోస్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. మీడియం పేసర్ ముఖేష్ కుమార్ తొలి క్యాప్ అందుకున్నాడు. కోహ్లి, గిల్, రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. ఆ తర్వాత 14వ ఓవర్ తొలి బంతికి ఇషాన్ కిషన్ క్యాచ్ మిస్ అవ్వగా, ఈ బంతికి హార్దిక్ పాండ్యా రనౌట్ అయ్యాడు. ఇలా ఎన్నో అంశాలు ఆకట్టుకున్నాయి. వీటిలో మరో ఆసక్తికర సీన్ కూడా కనిపించింది. బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ జెర్సీని ధరించి ఆడుతూ కనిపించాడు.
సంజూ శాంసన్ జెర్సీని ధరించిన సూర్యకుమార్..
టాస్‌కి ముందు వరకు అంతా సంజూ శాంసన్‌కు కచ్చితంగా అవకాశం వస్తుందని ఆశించారు. కానీ, ప్లేయింగ్ 11 ప్రకటించిన తర్వాత అందులో శాంసన్‌కు మరోసారి మొండిచేయి చూపించారు. దీంతో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భారత జట్టు ఫీల్డింగ్‌కి వచ్చిన సమయంలో సూర్యకుమార్ యాదవ్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ జెర్సీతో కనిపించాడు. అలాగే బ్యాటింగ్ చేసే సమయంలోనూ శాంసన్ జెర్సీని ధరించి కనినిపించాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో శాంసన్‌కు అవకాశం రాలేదు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో సూర్యకు అసలు వన్డే లిస్టులో లేడని, అందుకే జెర్సీ కూడా ఇవ్వలేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. శాంసన్‌కు ప్లేయింగ్ 11లో చేర్చేందుకు 100 శాతం అవకాశాలు ఉన్నా.. చివరి నిమిషయంలో సూర్యను ప్లేయింగ్ 11లో చేర్చి, శాంసన్ జెర్సీని ఇచ్చారంటూ బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కానీ, ఈ అవకాశాన్ని వినియోగించుకోని సూర్య.. మరోసారి పేలవ ఫాంతో వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ గూడకేశ్ మోతీ బంతికి 19 పరుగులు చేసి అవుటయ్యాడు. బంతి మిడిల్ ఆఫ్ స్టంప్ వద్ద పిచ్ అయి ఆఫ్ స్టంప్ వైపు వెళుతోంది. సూర్య ఈ బంతిని స్వీప్ చేయాలనుకున్నాడు. కానీ, బంతి ప్యాడ్‌కు తగిలింది. ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ ఇద్దరూ అతన్ని ఎల్‌బీడబ్ల్యూగా ప్రకటించారు.




మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..