- Telugu News Photo Gallery Cricket photos Ravindra Jadeja Surpasses Anil Kumble with most Wickets against West Indies and Equals Courtney Walsh as highest wicketteaker in INDvs WI ODIs
IND vs WI: కుంబ్లేని అధిగమించిన జడ్డూ భాయ్.. ప్రమాదంలో కర్ట్నీ వాల్ష్ రికార్డ్.. మరో వికెట్ తీస్తే సరికొత్త చరిత్రే..
IND vs WI 1st ODI: గురువారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ముగ్గురు విండీస్ ప్లేయర్లను చాకచక్యంగా పెవిలియన్ బాట పట్టించిన జడేజా.. అనిల్ కుంబ్లే రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. ఇంకా..
Updated on: Jul 28, 2023 | 10:01 PM

Ravindra Jadeja: భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య గురువారం జరిగిన తొలి వన్డేలో 3 వికెట్లు తీసిన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

ఇరు జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ ఆటగాడిగా అవతరించడంలో పాటు.. విండీస్ దిగ్గజం కర్ట్నీ వాల్ష్ రికార్డ్‌ను సమం చేశాడు.

భారత్‌పై 38 వన్డేలు ఆడిన వాల్ష్ మొత్తం 44 వికెట్లు పడగొట్టగా.. జడేజా విండీస్‌పై 30 మ్యాచ్‌ల్లోనే ఆ మార్క్‌ని అందుకున్నాడు.

అంతేకాక భారత్ తరఫున వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్న అనీల్ కుంబ్లేని కూడా అధిగమించి, ఆ ఘనతను తన సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్‌పై కుంబ్లే 42 మ్యాచ్‌లు ఆడి మొత్తం 43 వికెట్లు తీశాడు.

వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇంకా 2 మ్యాచ్‌లు మిగిలే ఉన్న నేపథ్యంలో.. జడేజా మరో వికెట్ తీస్తే కర్ట్నీ వాల్ష్‌ని కూడా అధిగమించగలడు.

అదే జరిగితే భారత్-వెస్టిండీస్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కూడా జడేజా సరికొత్త రికార్డ్ సృష్టిస్తాడు.





























